లక్కిరెడ్డిపల్లె: రాయలసీమలోనే ప్రసిద్ది గాంచిన లక్కిరెడ్డిపల్లె మండలంలోని అనంతపురం గంగమ్మ జాతర ఉత్సవాలు గురువారం వైభవంగా జరిగినాయి. జాతరకు భక్తజనం పోటెత్తారు. గురువారం తెల్లవారుజామున చాగలగుట్టపల్లి నుంచి అమ్మవారి చెల్లెలైన కుర్నూతల గంగమ్మ భారీ వూరేగింపు నడుమ అనంతపురంలోని ప్రధాన ఆలయానికి చేరుకున్నారు. దారి పొడవునా వేలాది మంది భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ మొక్కులు తీర్చుకున్నారు. ఆలయం సమీపంలోకి చాగలగుట్టపల్లె అమ్మవారు చేరుకోగానే అనంతపురం గంగమ్మ ఆలయ అర్చకులైన చెల్లు వంశీయులు అమ్మవారికి కల్లు ముంతలతో […]పూర్తి వివరాలు ...
Tags :లక్కిరెడ్డిపల్లె
కడప: జిల్లాలో 48 మండలాలను కరవు ప్రభావిత మండలాలుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిబంధనల మేరకు సగటు వర్షపాతం లేని మండలాలను కరవు పీడిత ప్రాంతాలుగా గుర్తిస్తూ రాష్ట్ర రెవిన్యూ విభాగం ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది. జిల్లాలో కరవు పీడిత మండలాలుగా గుర్తించినవి ఇవీ…. రామాపురం, చక్రాయపేట, సింహాద్రిపురం, పెనగలూరు, గాలివీడు, వీరబల్లి, జమ్మలమడుగు, కడప, తొండూరు, పుల్లంపేట, లక్కిరెడ్డిపల్లె, అట్లూరు, వేంపల్లె, బద్వేలు, గోపవరం, చిన్నమండెం, రాయచోటి, పులివెందుల, […]పూర్తి వివరాలు ...
తొలివిడత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఆదివారం జరుగనున్నాయి. 29 మండలాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఎంపీటీసీ బరిలో 1055 మంది, జడ్పీటీసీ బరిలో 144 మంది అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మొత్తం 29 జడ్పీటీసీ స్థానాలకు, 326 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. 8,05,681 మంది పల్లె ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఐదు నియోజకవర్గాల పరిధిలో ఎన్నికలు జరుగుతున్నాయి. బద్వేల్, అట్లూరు, గోపవరం, బికోడూరు, కలసపాడు, పోరుమామిళ్ళ, కాశినాయన, మైదుకూరు, బీమఠం, దువ్వూరు, […]పూర్తి వివరాలు ...
చక్రాయపేట : రంగస్థల నాటక రంగంలో విభిన్న పాత్ర పోషించి, అభినవ చాకలి తిప్పడుగా పేరు తెచ్చుకున్న కళాకారుడు వెంకటకృష్ణయ్య ఇకలేరు. రంగస్థలంపై అనేక ప్రదర్శనలు ఇచ్చిన నటుడు వెంకటకృష్ణయ్య మృతి నాటక రంగానికి తీరని లోటని పలువురు కళాకారులు పేర్కొన్నారు. నాగులగుట్టపల్లెలో నివాసముంటున్న నటుడు వెంకటకృష్ణయ్య బుధవారం కన్నుమూశాడు. పౌరాణిక, సాంఘిక ఘట్టాలలో పలు వైవిధ్యభరతమైన పాత్రలు పోషించిన వెంకటకృష్ణయ్య స్వగ్రామం లక్కిరెడ్డిపల్లె. 1953లో కృష్ణయ్య విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఉద్యోగ రీత్యా 1975దశకంలో రికార్డు […]పూర్తి వివరాలు ...
భారతదేశపు దూర దక్షిణ ప్రాంతానికి కర్నాటకమని పేరు. ఈ ప్రాంతంలో జరిగిన యుద్ధాలు కర్నాటక యుద్ధాలుగా పేరు పొందాయి. భారతదేశంలో ఆంగ్ల, ఫ్రెంచి రాజకీయ భవితవ్యమును ఈ కర్నాటక యుద్ధాలే నిర్ణయించినాయి. ఈ యుద్ధాలే ఆంగ్ల సామ్రాజ్య స్థాపనకు పునాది వేసినట్లు చరిత్ర చెబుతోంది. క్రీ.శ.1748-56 సంవత్సరాల మధ్య జరిగిన రెండవ కర్నాటక యుద్ధంలో కడప నవాబు మౌసింఖాన్ (మూచామియా), కర్నూలు నవాబు హిమ్మత్ బహదూర్ ఖాన్ లు పాల్గొని అనేక రాజకీయ హత్యలకు కారణమైనారు. దక్కన్ […]పూర్తి వివరాలు ...
రాయచోటి – లక్కిరెడ్డిపల్లె ప్రాంతాలను సస్యశ్యామలం చేయగలిగే వెలిగల్లు, శ్రీనివాసపురం రిజర్వాయర్ల నిర్మాణాలను త్వరగా పూర్తిచేయించి, హంద్రీ-నీవా జలాల తో నింపడమే తన జీవిత ధ్యేయమని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. హంద్రీ – నీవా జలాలను తరలించడం ద్వారానే దుర్భిక్ష ప్రాంతమైన రాయచోటి నియోజక వర్గంలో శాశ్వతంగా కరవును నివారించవచ్చని శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక మార్కెట్ యార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన భూసార పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించిన ఆయన రైతులనుద్దేశించి మాట్లాడుతూ దశాబ్దాలుగా ఈ […]పూర్తి వివరాలు ...