హైదరాబాదు: అన్ని విధాలుగా వెనుకబడిన రాయలసీమలో రాజధాని లేదా హైకోర్టు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాయలసీమను నిర్లక్ష్యం చేస్తున్నారనే భావన ప్రజల్లో కూడా ఉందని ఆయన అన్నారు. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ‘ గ్రేటర్ రాయలసీమలో హైకోర్టు’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ… రాయలసీమ వెనుకబాటుతనం గురించి ఎవ్వరూ […]పూర్తి వివరాలు ...
Tags :రాయలసీమ
సీమ కోసం పోరాడేందుకు అఖిలపక్షం, ప్రజా సంఘాలు కలసి రావాలి జాతీయ జెండా సాక్షిగా చంద్రబాబు విఫలం కర్నూలు: రాయలసీమ అభివృద్ధికి సిపిఎం ఆధ్వర్యంలో పోరాటం సాగిస్తామని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు చెప్పారు. బుధవారం కర్నూలులోని సి.క్యాంప్ సెంటర్లోని లలిత కళాసమితిలో ‘రాయలసీమ అభివృద్ధి- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో రాయలసీమకు తీరని అన్యాయం జరిగిందన్నారు. కొత్త రాష్ట్రంలో తొలి […]పూర్తి వివరాలు ...
ఆకు అల్లాడ్డంల్యా గాలి బిగిచ్చింది ఉబ్బరంగా ఉంది ఊపిరాడ్డంల్యా ఉక్క పోచ్చాంది వంతు తప్పేట్లు లేదు వంక పారేట్లే ఉంది. పొద్దు వాల్తాంది మిద్దెక్కి సూచ్చనా వానొచ్చాదా రాదా? పదునైతాదా కాదా? అదును దాట్తే ఎట్లా? ఏడు పదుల కరువు పందికొక్కుల దరువు పంకియ్యని ప్రభువు ముదనష్టపు అప్పు ఉరితాళ్ళ బతుకు. అద్దద్దో…ఆపక్క మోడం ఎక్కొచ్చాంది ఆ మూల నుంచి కుమిల్లు కుమిల్లు నల్లగ కలయబారతాంది కొత్తమిట్ట కాడికొచ్చె దున్నంగి పంపుల్లో దిగబడే అబ్బీ……వచ్చరా….వానొచ్చరా…. మాంచి మోదుబ్బీ… […]పూర్తి వివరాలు ...
రాయలసీమ మహాసభ ఆదివారం జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకుంది.కడప జిల్లా కమిటీ సభ్యులు వీరే… అధ్యక్షుడు – ఎన్.ఎస్.ఖలందర్ ఉపాధ్యక్షులు – నూకా రాంప్రసాద్‌రెడ్డి, తవ్వా ఓబుల్‌రెడ్డి ప్రధాన కార్యదర్శి – జింకా సుబ్రహ్మణ్యం కార్యదర్శులు – సూర్యనారాయణరెడ్డి, పోలు కొండారెడ్డి సహాయ కార్యదర్శులు – గంగనపల్లె వెంకటరమణ, పుట్టా పెద్ద ఓబులేశు కోశాధికారి – మొగలిచెండు సురేశ్ కార్యవర్గ సభ్యులు – సాయిప్రసాద్, చంద్రశేఖర్‌రెడ్డి, జి.పార్వతీ టి.వెంకటయ్య, నాగరాజు కల్చరల్ కమిటీ కన్వీనర్ – ధర్మిశెట్టి […]పూర్తి వివరాలు ...
కడప: దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్టును కేంద్రం తక్షణమే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని రాయలసీమ మహాసభ తీర్మానించింది. స్థానిక సీపీ బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రంలో ఆదివారం జరిగిన సమావేశంలో సీమ జిల్లాలకు చెందిన రచయితలు, కళాకారులు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాయలసీమ సమగ్రాభివృద్ధి సాధనే ధ్యేయంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని రాయలసీమ మహాసభ కేంద్రకమిటీ అధ్యక్షులు డా.శాంతినారాయణ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించారు. పోలవరం వల్ల ప్రయోజనం స్వల్పమేనన్నారు. […]పూర్తి వివరాలు ...
మైదుకూరు: రాయలసీమ మహాసభ అధ్వర్యంలో ఆదివారం (మార్చి 22వ తేదీ) కడపలోని సి.పి.బ్రౌన్ గ్రంథాలయంలో రాయలసీమ రచయితల, కవుల, కళాకారుల, ప్రజాసంఘాల, విద్యార్ధి, మహిళా, రైతుసంఘాల ప్రతినిధుల సమావేశం జరుగనుంది . ఉదయం 10 గంటలకు రాయలసీమ గురించి చర్చ జరుగుతుంది. మధ్యాహ్నం రాయలసీమ మహాసభ కడప జిల్లా కార్యవర్గ ఎంపిక జరుగుతుంది. సంబందిత ప్రతినిధులందరికీ , రాయలసీమ అస్తిత్వం గురించి తపన పడే మిత్రులకు సమావేశం ఆహ్వానం పలుకుతోంది.పూర్తి వివరాలు ...
కడప: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టిసీమ పేరుతో రాయలసీమను దగాచేస్తున్నారని తక్షణం పట్టిసీమకు స్వస్తి చెప్పాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. ఇదే విషయమై ఈ నెల 20వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేయాలని సమావేశంలో తీర్మానించారు. బుధవారం నగరంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి అధ్యక్షతన ‘పట్టిసీమను పక్కనబెట్టి- రాయలసీమ ప్రాజెక్టులకు నిధులు పెంచి పూర్తిచేయాలి’ అనే అంశంపై అఖిలపక్ష రైతు సంఘాల రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. […]పూర్తి వివరాలు ...
కడప: చివరి దశలో ఉన్న రాయలసీమ సాగునీటి పథకాలు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు కేటాయించి ఆయా పథకాలను త్వరగా పూర్తి చేయాలని శాసనమండలిలో ప్రతిపక్ష నేత రామచంద్రయ్య ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నారు. శుక్రవారం ఇందుకు సంబంధించిన వినతిపత్రాన్ని రామచంద్రయ్య చంద్రబాబుకు పంపినారు. రాయలసీమ ఉద్యమం నేపధ్యంలో నాటి తెదేపా ప్రభుత్వం గాలేరు-నగరి, హంద్రీ-నీవా, సుజలస్రవంతి పథకాలు ఏర్పాటు ప్రకటించినా తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కమిటీలు,సర్వేల పేరుతో కాలం గడిపారుతప్ప రాయలసీమ సాగునీటి పై […]పూర్తి వివరాలు ...
బడ్జెట్లో అరకొర కేటాయింపులు జలయజ్ఞానికి సంబంధించి ఇప్పటికే సాగునీరు పుష్కలంగా అందుతున్న కృష్ణా డెల్టా మీద అలవికాని ప్రేమ ప్రదర్శించిన ప్రభుత్వం ఆరుతడి పంటలకూ నోచుకోక కరువు బారిన పడ్డ సీమపైన వివక్షను కొనసాగించింది. నిరుడు రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు కేటాయింపులు జరపడంలో వివక్ష చూపిన ఆం.ప్ర ప్రభుత్వం ఈ ఏడాది కూడా ఆ విధానాన్ని కొనసాగించి తన ప్రాధమ్యాన్ని చెప్పకనే చెప్పింది. రాయలసీమలోని భారీ సాగునీటి పథకాలు అన్నిటికీ కలిపి ఎప్పుడో పూర్తయి నిర్వహణలో ఉన్న […]పూర్తి వివరాలు ...