ప్రొద్దుటూరు: లెజెండ్ సినిమా చేయడం తన పూర్వ జన్మ సుకృతమని హిందూపురం శాసనసభ్యుడు, కథా నాయకుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. చలనచిత్ర సీమలో లెజెండ్ సినిమా ఒక లెజెండ్‌గా మిగిలిపోతుందన్నారు. లెజెండ్ చలనచిత్రం 275 రోజులు ప్రొద్దుటూరులోని అర్చనా థియేటర్‌లో ప్రదర్శింపబడిన నేపధ్యంలో విజయోత్సవ సభను ఆదివారం స్థానిక రాయల్ కౌంటీ రిసార్ట్స్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్రం యూనిట్‌తో కలిసి వచ్చిన బాలకృష్ణ మాట్లాడుతూ నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా చిత్రానికి అన్ని సదుపాయాలు కల్పించారన్నారు. […]పూర్తి వివరాలు ...
Tags :బ్రహ్మయ్య
వైకాపా తరపున రాజంపేట శాసనసభ సీటు కోసం చివరి వరకూ ప్రయత్నించి విఫలమైన ఆ నియోజకవర్గ కాంగ్రెస్‌పార్టీ ఇన్‌ఛార్జ్ మేడా మల్లికార్జున రెడ్డి చివరకు తెలుగుదేశం గూటికి చేరారు. ఆదివారం హైదరాబాదులో పసుపు దళపతి చంద్రబాబు సమక్షంలో మేడా సైకిలేక్కారు. దీంతో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ పటిష్టతకు అవకాశాలు మెరుగయ్యాయి. మేడా మల్లి కార్జునరెడ్డి తెలుగుదేశం పార్టీ రాజం పేట నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న బ్రహ్మయ్యతో కలిసి వెళ్లి పార్టీలో చేరారు. వీరు […]పూర్తి వివరాలు ...