Tags :తెలుగు కథలు

    కథలు

    శని (కథ) – సొదుం జయరాం

    సొదుం జయరాం కథ ‘శని’ “ఏం చేస్తున్నావురా,కేశవా? ” అంటూ ఆదిరెడ్డి యింట్లోకి వచ్చాడు. కేశవ భోంచేసి, కునుకు తీసే ప్రయత్నంలో వున్నాడు. అదిరెడ్డిని చూడగానే మంచం మాద నుంచి చివుక్కున లేచి నిలబడి : “కూర్చో పెదనాన్నా” అన్నాడు. ఆదిరెడ్డి ఉసూరుమంటూ మంచం మాద కూలబడి, “ఎండలు దంచేస్తున్నాయిరా కేశవా” అన్నాడు. “మార్చిగదా, యిప్పుడే ఎండలు మొదలయ్యాయి”. “అది సరే సావిత్రి కనిపించదేం?” అన్నాడు ఆదిరెడ్డి. “ఇంట్లో భోంచేస్తోంది” కేశవ అన్నాడు. ఇంట్లో భోంచేస్తున్న సావిత్రి […]పూర్తి వివరాలు ...

    కథలు

    చనుబాలు (కథ) – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

    చీకటి చిక్కబడింది. బలహీనంగా వెలిగే వీధిలైట్ల కాంతిలో వేపచెట్టు కింది అరుగుమీద మరింత దట్టమైన చీకట్లో నా చుట్టూ ఐదారు బీడీ ముక్కలు మినుకు మినుకుమంటున్నాయి. వాటి నిప్పు, వెలుగు అరుగు ముందు నిల్బున్న నాలుగైదు జతల కనుపాపల మీద ప్రతిఫలిస్తోంది. “మాదా కవలం తల్లీ! సందాకవలమమ్మా!” అంటూ బిక్షగత్తెలు ఇల్లిల్లూ తిరిగి గొంతెత్తే వేడికోళ్లు ఇక్కడిదాకా పాకుతున్నాయి. తెగులు చూపిన కోళ్లను అగ్గవగా ఎదరకపోతున్న బేరగాళ్లు వాటి కాళ్లకు తాళ్లు గట్టి సైకిలు మీద వేలాడేసుకు […]పూర్తి వివరాలు ...

    కథలు

    ఇచ్ఛాగ్ని (కథ) – కేతు విశ్వనాథరెడ్డి

    పెద్దకూతురు హరిత పుట్టిల్లు చేరి మూడు మాసాలు దాటింది. ‘తరాలు మారాయి సంస్కారాల మధ్య ఘర్షణలు ఎక్కువయ్యాయి. సామరస్యానికి మార్గమేమిటో ఏ రకంగా కుదురుతుందో అది?” అని హరిత తల్లి కస్తూరి తల్లడిల్లింది. సంస్కారం కొలిమిలో కాల్చటానికి తన కూతురు ఇనుమూకాదు, ఇత్తడీ కాదు, మనిషి రక్తమాంసాలున్న మనిషి. వాడి పీహెచ్‌.డి. చదువూ, ఆ యూనివర్శిటీ లెక్చరరు ఉద్యోగమూ తగలెయ్యనా? అని హరిత తండ్రి లెనిన్‌ బాబుకు ఆగ్రహం కలిగింది. తల్లిదండ్రుల తల్లడిల్లడాలూ, ఆగ్రహాలూ కాపురాల్ని సంధించలేవు. […]పూర్తి వివరాలు ...

    కథలు

    కసాయి కరువు (కథ) – చక్రవేణు

    చక్రవేణు కథ ‘కసాయి కరువు’ రాళ్లసీమ పల్లె మీద ఎర్రటి ఎండ నిప్పులు కురిసినట్లు కురుస్తోంది. ఎందుకో నూరీడు వగపట్టినట్లు ఊరి మీద అగ్గి వాన చల్లుతున్నాడు. తూరువు కొండ మీద చెట్లు మలమల మాడి ఎండిపోయాయి. గుట్టల మీద తెల్లకనిక రాళ్ళు కొలిమిలో మండినట్లు ఎర్రగా మెరున్తున్నాయి. యుద్ధకాలంలో శత్రువుల దాడికి భయవడి ఊరొదిలి వలనపోయిన విధంగా వల్లె పల్లె అంతా. బోసిగా ఉంది. పల్లెలో ఇళ్ళ యజమనులెవ్వరూ లేరు. పసిబిడ్డలూ, వాళ్ళ తల్లులూ, మునలోళ్ళూ […]పూర్తి వివరాలు ...

    కథలు

    రెక్కలు (కథ) – కేతు విశ్వనాథరెడ్డి

    కేతు విశ్వనాథరెడ్డి కథ – రెక్కలు ఆ ‘ముగ్గురూ ఖాకి దుస్తుల్లో ఉన్న ఆడపిల్లలని తెలుస్తూనే ఉంది, వాళ్ళ ఎత్తుల్ని బట్టి, కదలికల్ని బట్టీ, పోలీసు స్టేషన్‌ ముందు ముసలి కానిస్టేబుల్‌తో మాట్లాడుతూ ఆ ముగ్గురూ అటూ ఇటూ చూస్తూ నిల్చున్నారు. వాళ్ళకు దగ్గరలోనే మూడు బ్యాగులున్నాయి. మాకులాగే వాళ్ళకు కూడా ఎలక్షన్‌ డ్యూటీ పడినట్లుంది. మా రూటు లారీ ఆగీ ఆగగానే ఆ ముగ్గురాడపిల్లలూ బ్యాగులు పుచ్చుకొని లారీ వెనకవైపు నుల్బున్నారు. ఇరవై, ఇరవై అయిదేండ్లలోపు […]పూర్తి వివరాలు ...

    ఈ-పుస్తకాలు కథలు

    కుట్ర (కథ) – కుప్పిరెడ్డి పద్మనాభరెడ్డి

    కడప జిల్లాకు చెందిన కుప్పిరెడ్డి పద్మనాభరెడ్డి ‘కుట్ర’ పేరుతో రాసిన కథ (కధానిక).  జ్యోతి మాసపత్రిక 1981 నవంబరు సంచికలో ప్రచురితమైన ఈ కథ కడప.ఇన్ఫో సందర్శకుల కోసం…పూర్తి వివరాలు ...

    కథలు సాహిత్యం

    దాపుడు కోక (కథ) – డాక్టర్ కేతు విశ్వనాథరెడ్డి

    చెన్నమ్మ నాగరిక నాయిక కాదు. కాబట్టి ఆమె ఆర్తనాదంలో విపంచీ కలస్వరాలు పలకలేదు. బస్సు యింజను రొదలో ప్రయాణీకుల రణగొణ ధ్వనుల్లో, చెన్నమ్మ గోడు ఎవరికీ అర్థం కాలేదు. కాని చెన్నమ్మ వులికిపాటు చూసి కొందరు గొల్లుమన్నారు. చెన్నమ్మ తీరు తెన్నుల్లో కొందరు సెక్సును చూస్తున్నారు, కండక్టరు ద్రోణుడు సృష్టించిన పద్మ వ్యూహంలో చిక్కుకుని వొక మూల నలిగిపోతున్న వీరయ్య, ఆ అరిచింది తన కూతురని గుర్తించాడు.పూర్తి వివరాలు ...