Tags :డిఎల్ రవీంద్రారెడ్డి

    రాజకీయాలు

    కడప బరిలో తెదేపా అభ్యర్థిగా డిఎల్

    తాను రాజకీయాల్లో కొనసాగాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు కాబట్టే.. వారి ఆకాంక్ష మేరకు రాజకీయాల్లో కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు కాంగ్రెస్ మాజీ మంత్రి, మైదుకూరు శాసనసభ్యుడు డిఎల్ రవీంద్రారెడ్డి వెల్లడించారు. మైదుకూరు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా పుట్టా సుధాకర్‌యాదవ్, తెదేపా కడప పార్లమెంట్ అభ్యర్థిగా తాను ఎన్నికల గోదాలోకి దిగనున్నట్లు ఆయన ప్రకటించారు.  బుధవారం సాయంత్రం తన స్వగ్రామమైన సుంకేశులలో అభిమానులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ విషయాలు చెప్పారు. 35 ఏళ్ల రాజకీయ జీవితంలో […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    డిఎల్ సైకిలెక్కినట్లేనా!

    దువ్వూరులో సోమవారం డిఎల్ రవీంద్రారెడ్డి తన అనుచరులతోపాటు మైదుకూరు తెదేపా ఇన్‌ఛార్జి పుట్టాసుధాకర్‌యాదవ్, ఆ పార్టీ కార్యకర్తలతో కలిసి సమావేశం నిర్వహించారు. సమావేశంలో డీఎల్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన నేపథ్యంలో మారిన పరిస్థితులు అందరికి తెలిసిందేనని, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అందరం కలిసి కట్టుగా తెదేపా గెలుపునకు పాటుపడాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెదేపా ఎంపీ అభ్యర్థిగా మీరు నిలవాలని కార్యకర్తలు కోరగా పార్టీ ఆదేశాల మేరకే అవి జరుగుతాయని చెప్పారు. దువ్వూరు మండలంలో వీలైనన్ని ఎంపీటీసీలు గెలుచుకోవాలని […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    డిఎల్ రవీంద్రారెడ్డి కంట కన్నీరు

    తన భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించేందుకు ఖాజీపేటలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో తీవ్ర ఉద్వేగానికి లోనైన మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి కన్నీరు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 35 ఏళ్ల రాజకీయ జీవితంలో తన వెంట ఉన్న ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఎప్పుడూ ప్రజా శ్రేయస్సు కోసమే తపించానని అన్నారు. తన భవిష్యత్ రాజకీయ జీవితంపై ప్రజా బ్యాలెట్ నిర్వహించానని, ప్రజలు ఇచ్చే తీర్పుతోనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అనేది […]పూర్తి వివరాలు ...