Tags :జయరాములు

    వార్తలు

    బిందు సేద్యం చేయండి: చంద్రబాబు

    ఊటుకూరు వద్ద రైల్వే ఫ్లైఓవర్  నిర్మాణానికి శంకుస్థాపన కడప: జిల్లా రైతులు బిందు సేద్యం ద్వారా పంటలు సాగు చేయాలని ముఖమంత్రి  చంద్రబాబు పిలుపునిచ్చారు. సోమవారం వివిధ కార్యక్రమాలలో పాల్గొనే నిమిత్తం జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి తొలుత ఇటీవల మరణించిన మాజీ ఎంపీ గునిపాటి రామయ్య కుటుంబాన్ని రైల్వేకోడూరులో పరామర్శించారు. తర్వాత రామాపురం మండలం నల్లగుట్టపల్లి చేరుకొని అక్కడి నీరు-చెట్టు పనులను పరిశీలించారు. అనంతరం కడపకు వచ్చిన ఆయన ఒక ప్రయివేటు ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    సభలో లేని నన్ను ఎలా సస్పెండ్ చేస్తారు?

    బద్వేలు: శాసనసభకు హాజరుకాని తనను ఎలా సస్పెండ్ చేస్తారని వైఎస్సార్ జిల్లా బద్వేలు శాసనసభ్యుడు తిరువీధి జయరాములు ప్రశ్నించారు. ఐదు రోజుల క్రితం అయ్యప్పస్వామి దర్శనం కోసం శబరిమలై వెళ్లిన ఆయన శనివారం సాయంత్రం పోరుమామిళ్లలోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ తాను ఐదు రోజుల క్రితం శబరిమలైకి వెళ్లానని అందువల్ల అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేకపోయానన్నారు. అయినా ఈనెల 18న తాను అసెంబ్లీలో ఉన్నట్లు ప్రకటించి స్పీకర్ తనను కూడా సస్పెండ్ చేశారన్నారు. […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    మా జిల్లా పేరును పలికేదానికీ సిద్ధపడరా?

    హైదరాబాద్: గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో కనీసం వైఎస్సార్ జిల్లా పేరును ఉచ్చరించడానికి సైతం సిద్ధపడక పోవడం  చంద్రబాబునాయుడు ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనమని రాయచోటి శాసనసభ్యుడు గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం గవర్నర్ ప్రసంగం అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన సహచర ఎమ్మెల్యేలు తిరువీధి జయరాములు, షేక్ బేపారి అంజాద్‌బాషాతో కలిసి మాట్లాడుతూ ‘రాయలసీమలో కరువు ఉందంటూనే చిత్తూరు, అనంతపురం జిల్లాలో 1200 అడుగుల లోతుకు […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    ‘ఇప్పుడు స్పందించకపోతే తాగునీరూ దక్కదు’

    ఒంటిమిట్ట స్ఫూర్తితో ఉద్యమించాల 25, 26వ తేదీల్లో ప్రాజెక్టుల పరిశీలన కడప: జిల్లాలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు పూర్తికాకపోతే జిల్లా ఎడారిగా మారే ప్రమాదం ఉందని అఖిలపక్షం నేతలు ఆవేదన వ్యక్తంచేశారు. శుక్రవారం వైకాపా జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్మికనేత సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి అధ్యక్షతన ప్రెస్‌క్లబ్‌లో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో ప్రభుత్వ లాంఛనాలతో నవమి వేడుకలు నిర్వహించాలని రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఏకతాటిపైకి వచ్చారన్నారు. ఫలితంగా […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    కడప జిల్లాపరిషత్ ఏకగ్రీవం

    కడప జిల్లా పరిషత్‌ పీఠం ఏకగ్రీవమైంది. జడ్పీ పీఠాన్ని దక్కించుకోవాలని తెదేపా నేతలుచేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆ పార్టీ సభ్యులు ప్రమాణ స్వీకార అనంతరం ఓటింగ్‌ కన్నా ముందే సమావేశం నుంచి వెళ్లిపోయారు. దీంతో వైకాపా సభ్యులు జడ్పీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చైర్మన్‌గా ఎర్రగుంట్ల జడ్పీటీసీ సభ్యుడు గూడూరు రవి, వైస్‌చైర్మన్‌గా ఒంటిమిట్ట జడ్పీటీసీ సభ్యుడు ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కలెక్టర్‌ కోన శశిధర్‌ అధ్యక్షతన జడ్పీ పాలకవర్గం ఎన్నికలు జరిగాయి. […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    ప్రమాణ స్వీకారం చేసినారు…ఆయనొక్కడూ తప్ప!

    జిల్లా నుండి గెలుపొందిన శాసనసభ్యులలో తొమ్మిది మంది గురువారం శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసినారు. పులివెందుల శాసనసభ్యుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, మేడామల్లికార్జునరెడ్డి (రాజంపేట), శ్రీకాంత్‌రెడ్డి (రాయచోటి), శ్రీనివాసులు (రైల్వేకోడూరు), రఘురామిరెడ్డి (మైదుకూరు), ఆదినారాయణరెడ్డి (జమ్మలమడుగు), అంజాద్‌బాషా (కడప), జయరాములు (బద్వేలు), రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి (ప్రొద్దుటూరు)లు శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి మాత్రమే ప్రమాణ స్వీకారం చేయలేదు. అక్షర క్రమంలో ఎమ్మెల్యేలతో వరుసగా ప్రమాణం చేయిస్తుండగా, రవీంద్రనాథ్‌రెడ్డి పేరు పిలిచే సరికి రాహుకాలం వచ్చింది. […]పూర్తి వివరాలు ...