Tags :జమ్మలమడుగు

    రాజకీయాలు

    రోడ్డెక్కిన వైకాపా శాసనసభ్యులు

    జమ్మలమడుగు: తెదేపా ప్రభుత్వం చౌకదుకాణాల డీలర్లపై తప్పుడు కేసులు బనాయించిందని, ఎలాంటి విచారణ లేకుండానే ఏకపక్షంగా తొలగించిదంటూ జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయం ముందు సోమవారం వైకాపా శాసనసభ్యులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ముద్దనూరు రోడ్డుపై రెండు గంటల పాటు భైఠాయించి నిరసన తెలిపారు. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. ప్రజలకు, వైకాపా కార్యకర్తలకు అన్యాయం జరిగితే అందరం కలిసికట్టుగా పోరాటం చేస్తామని శాసనసభ్య్లులు ఆదినారాయణరెడ్డి, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, రఘురామిరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, జయరాముడు, అంజద్‌బాషా, ఎమ్మెల్సీ […]పూర్తి వివరాలు ...

    ప్రత్యేక వార్తలు

    జమ్మలమడుగులో తమిళ హీరో విజయ్

    కడప జిల్లాలో సినిమా షూటింగ్ ల సందడి పెరుగుతోంది. ఇప్పటికే పలు తమిళ, కన్నడ చిత్రాలు గండికోట పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకోగా తాజాగా  జమ్మలమడుగు నియోజకవర్గంలోని గుర్రప్పనికొట్టాలలో (మైలవరం మండలంలోని లింగాపురం పంచాయతీ) తమిళ సినిమా ‘కత్తి’ చిత్రీకరణ జరుగుతుండడంతో సందడి నెలకొంది. తమిళంలో అగ్రకధానాయకుడు విజయ్, సమంత జంటగా నటిస్తున్న ఈ సినిమాకు మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. మంగళవారం హీరో విజయ్‌పై పలు సన్నివేశాలను చిత్రీకరించారు. చిత్రీకరణ కోసం పలు సెట్టింగులు వేశారు. కరవుతో అల్లాడుతున్న […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    ప్రమాణ స్వీకారం చేసినారు…ఆయనొక్కడూ తప్ప!

    జిల్లా నుండి గెలుపొందిన శాసనసభ్యులలో తొమ్మిది మంది గురువారం శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసినారు. పులివెందుల శాసనసభ్యుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, మేడామల్లికార్జునరెడ్డి (రాజంపేట), శ్రీకాంత్‌రెడ్డి (రాయచోటి), శ్రీనివాసులు (రైల్వేకోడూరు), రఘురామిరెడ్డి (మైదుకూరు), ఆదినారాయణరెడ్డి (జమ్మలమడుగు), అంజాద్‌బాషా (కడప), జయరాములు (బద్వేలు), రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి (ప్రొద్దుటూరు)లు శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి మాత్రమే ప్రమాణ స్వీకారం చేయలేదు. అక్షర క్రమంలో ఎమ్మెల్యేలతో వరుసగా ప్రమాణం చేయిస్తుండగా, రవీంద్రనాథ్‌రెడ్డి పేరు పిలిచే సరికి రాహుకాలం వచ్చింది. […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    జమ్మలమడుగులో ఎవరికెన్ని ఓట్లు?

    జమ్మలమడుగు శాసనసభ స్థానం నుండి పోటీ చేయటానికి మొత్తం 24 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల తిరస్కరణ మరియు ఉపసంహరణల అనంతరం మొత్తం 12 మంది అభ్యర్థులు తుదిపోరులో తలపడ్డారు. ఈ పోరులో వైకాపా తరపున బరిలోకి దిగిన చదిపిరాల్ల ఆదినారాయణ రెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన రామసుబ్బారెడ్డిపై సుమారు 12వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆదినారాయణరెడ్డి చదిపిరాళ్ల – వైకాపా – 100794 రామసుబ్బారెడ్డి పొన్నపురెడ్డి – తెదేపా+భాజపా  – 88627 […]పూర్తి వివరాలు ...

    వార్తలు

    ఉక్కు కర్మాగారం ఏర్పాటు పరిశీలనకై వచ్చిన సెయిల్‌ బృందం

    కడప: జిల్లాలో ఉక్కు కార్మాగారం ఏర్పాటుకు ఉన్న అనుకూల, అననుకూల పరిస్థితులపరిశీలకై జిల్లాకు వచ్చిన 8 మంది సెయిల్‌(Steel Athority of India-SAIL) బృందం ఆదివారం సికె దిన్నెమండలంలోని కొప్పర్తి, జమ్మలమడుగు మండలంలోని బ్రహ్మణీ ప్లాంట్‌ స్థలం, మైలవరం మండలంలోని ఎం. కంబాల దిన్నె, ప్రాంతాన్ని పరిశీలించారు. మైలవరంరిజర్వయర్‌ను కూడా బృందం సభ్యులు పరిశీలించారు. రిజర్వయర్‌ లో నీటిసామర్థ్యం గత పది సంవత్సరాల కాలంలో సరాసరి నిల ్వవున్న నీటి వసతి వివరాలనుఅధికారుల ను అడిగి తెలుసుకున్నారు. రిజర్వయర్‌ […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    ఒకే దోవలో నాలుగు పురపాలికలు సైకిల్ చేతికి

    గుంతకల్లు – నెల్లూరు దోవ జిల్లాలోని ప్రధాన రహదారుల్లో ఒకటి. ఈ దోవలో జమ్మలమడుగు, ప్రొద్దుటూరు,  మైదుకూరు, బద్వేల్ పట్టణాలు ఒకదాని తర్వాత మరోటి వరుసగా వస్తాయి. ఈ నాలుగూ పురపాలికలు కావడం ఒక విశేషమైతే ఇటీవల జరిగిన పురపాలిక ఎన్నికలలో ఈ నాలుగూ సైకిల్ చేతికి చిక్కాయి. కడప జిల్లా మొత్తానికి ఈ నాలుగు పురపాలికలు మాత్రమే తెదేపా గెలుచోవటం మరో విశేషం… – జమ్మలమడుగు పురపాలికలోని 20 వార్డులకు గాను తెదేపా 11, వైకాపా […]పూర్తి వివరాలు ...

    వార్తలు

    మంగళవారం దేవగుడిలో రీపోలింగ్

    మే 7న జరిగిన పోలింగ్ సందర్భంగా ఘర్షణ జరిగిన దేవగుడిలో ఈనెల 13వ తేదీన (వచ్చే మంగళవారం) రీపోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఈసీ  ప్రకటించింది. అదే రోజున రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల రీ-పోలింగ్ నిర్వహించనున్నారు. ఏ ఏ పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ అవసరం, ఏ కేంద్రాల్లో రీ పోలింగ్ అవసరం లేదనే వివరాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ శుక్రవారం జిల్లా కలెక్టర్ నుంచి నివేదిక తెప్పించుకున్నారు. ఈ నివేదికను శుక్రవారం కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పంపించారు. […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    ఈ పొద్దు మాయిటాల జమ్మలమడుగుకు బాబు

    తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు జమ్మలమడుగులో బుధవారం సాయంత్రం జరిగే రోడ్‌షోలో పాల్గొంటున్నారు. ఆయన పర్యటన వివరాలను జమ్మలమడుగు టీడీపీ అభ్యర్థి రామసుబ్బారెడ్డి వివరించారు. సాయంత్రం 3.30 గంటలకు పీఆర్ హైస్కూలులో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌కు చంద్రబాబు హెలికాఫ్టర్‌లో చేరుకుంటారు. అక్కడి నుంచి బయల్దేరి నీళ్లట్యాంకు వద్ద నుంచి రోడ్‌షో ప్రారంభం అవుతుంది. పాత బస్టాండు, మార్కెట్‌వీధి, మెయిన్‌బజార్, అమ్మవారిశాల వీధి, పలగాడి వీధి, తేరు రోడ్డు, పెద్దపసుపుల జంక్షన్, సంజాముల మోటు, ఎస్‌బీఐ ద్వారా పాత బస్టాండు […]పూర్తి వివరాలు ...

    ఆచార వ్యవహారాలు

    జమ్మలమడుగులో 30 నుండి గూడు మస్తాన్‌ వలీ ఉరుసు

    జమ్మలమడుగు: జమ్మలమడుగు పట్టణానికి పడమటి దిశగా పవిత్ర పినాకినీ నదీ తీరంలో క్రీ.శ. 1651 సంవత్సరంలో శ్రీ హజరత్‌ గూడు మస్తాన్‌ వలీ వారు సమాధియై ఉన్నారు. ఆయన పేరుమీద ప్రతి సంవత్సరం భారీ ఎత్తున ఉరుసు ఉత్సవాలు హిందూ ముస్లిం సోదరులు సమైక్యతకు ప్రతీకగా, అత్యంత భక్తి శ్రద్ధలతో ఇక్కడ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఉరుసు వెనుక ఆసక్తికరమైన కథ ఒకటి ప్రచారంలో ఉంది. అరేబియా దేశానికి చెందిన నలుగురు ముస్లిం సోదరులు ఇస్లాం […]పూర్తి వివరాలు ...