కడప: జిల్లాలో 48 మండలాలను కరవు ప్రభావిత మండలాలుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిబంధనల మేరకు సగటు వర్షపాతం లేని మండలాలను కరవు పీడిత ప్రాంతాలుగా గుర్తిస్తూ రాష్ట్ర రెవిన్యూ విభాగం ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది. జిల్లాలో కరవు పీడిత మండలాలుగా గుర్తించినవి ఇవీ…. రామాపురం, చక్రాయపేట, సింహాద్రిపురం, పెనగలూరు, గాలివీడు, వీరబల్లి, జమ్మలమడుగు, కడప, తొండూరు, పుల్లంపేట, లక్కిరెడ్డిపల్లె, అట్లూరు, వేంపల్లె, బద్వేలు, గోపవరం, చిన్నమండెం, రాయచోటి, పులివెందుల, […]పూర్తి వివరాలు ...
Tags :జమ్మలమడుగు
జమ్మలమడుగులో తీవ్ర ఉత్కంఠ జమ్మలమడుగు: షాద్‌నగర్ జంట హత్యల కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు బుధ,గురువారాల్లో విచారణతోపాటు తుదితీర్పు వెలువరిస్తుందని వార్తలు వస్తున్న నేపధ్యంలో జమ్మలమడుగులో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ముద్దాయిగా ఉన్నారు. గత ఆగస్టు 21న, సెప్టెంబర్ 18 వతేదీన సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకు వచ్చి తీర్పు వెలువడుతుందని భావించారు. అయితే రెండు సార్లూ వారుుదా పడింది. 1990లో షాద్‌నగర్‌లో దేవగుడి శంకర్‌రెడ్డి, లక్కిరెడ్డి గోపాల్‌రెడ్డిలు హత్యకు గురయ్యారు. […]పూర్తి వివరాలు ...
కడప: త్వరలోనే జమ్మలమడుగు ప్రాంతంలో చిత్ర నిర్మాణం ప్రారంభించనున్నట్లు దర్శకుడు తేజ చెప్పారు. శనివారం నిర్మాత వివేకానందతో కలిసి తేజ గండికోటను సందర్శించి అక్కడి ప్రదేశాలను పరిశీలించారు. గండికోటలోని మాధవరాయస్వామి దేవాలయం, జుమ్మామసీదు, ధాన్యాగారం, తదితర ప్రదేశాలను పరిశీలించారు. అలాగే జమ్మలమడుగుటోని వందేళ్ల చరిత గల ప్రభుత్వ పీఆర్ పాఠశాల, ఆర్డీవో కార్యాలయం, ఎల్ఎంసీ స్కూలు ప్రాంతాలను పరిశీలించారు.పూర్తి వివరాలు ...
డీజీపీ ఆదేశించడంతో శాసనసభ్యుడు ఆదినారాయణరెడ్డి తనయుడు సుధీర్‌రెడ్డి సహా దేవగుడి గ్రామంలో ఏకంగా 35 మందిపై జమ్మలమడుగు పోలీసులు రౌడీషీట్ తెరిచారు. వీరంతా వైకాపాకు చెందినవారు కావడం విశేషం. ఇదేవిధంగా మైదుకూరు శాసనసభ్యుడు రఘురామిరెడ్డి తనయుడు నాగిరెడ్డితోపాటు మరో అయిదుగురిపై రౌడీషీట్ తెరవాలని ఓ తెదేపా నేత నుంచి పోలీసులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి ఉన్నట్లు ఇవాళ ఒక దినపత్రిక పేర్కొంది. ఎన్నికల సమయంలో జరిగిన ఘటనలను ఆధారంగా చేసి వీరిపై రౌడీషీట్ తెరిచినట్లు సమాచారం. ఓ వ్యక్తిపై […]పూర్తి వివరాలు ...
ఆయనకు ఆ స్థలం బాగా నచ్చింది. ఆ కొండ కోట నిర్మాణానికి ఎంతో అనువుగా ఉందనీ, అక్కడ కోటను నిర్మిస్తే ఆ చుట్టు పక్కల గ్రామం వెలసి సుసంపన్నంగా, ఎంతో వైభవంగా కళకళలాడుతుందనీ జ్యోతిష్కులు శెలవిచ్చారు. దాంతో కాకమహారాజులు అక్కడ కోటను నిర్మించాలని అనుకున్నాడు. వైకుంఠశుద్ధ పంచమి రోజున కోట నిర్మాణానికి శంకుస్థాపన జరిపాడు. అతితక్కువ వ్యవధిలోనే అక్కడ గండికోట ఆవిర్భవించి దుర్భేద్యమైన కోటగా పేరు తెచ్చుకుంది. 101 బురుజులతో నిర్మితమైన గండి కోట ఎంతో సుందరంగానూ, దృఢంగానూ […]పూర్తి వివరాలు ...
వర్గం: హాస్యగీతాలు (పసలకాపర్లు పాడుకొనే పాట) పాడటానికి అనువైన రాగం : తిలకామోద్ స్వరాలు (ఆదితాళం) పొద్దన్నె లేసినాడు కాదరయ్యా వాడు కాళ్ళు మగం కడిగినాడు కాదరయ్యా(2) కాళ్ళు మగం నాడు కాదరయ్యా వాడు పంగనామం పీకినాడు కాదరయ్యా పంగనామం పీకినాడు కాదరయ్యా వాడు సద్ది సంగటి తిన్యాడు కాదరయ్యా సద్ది సంగటి తిన్యాడు కాదరయ్యా వాడు బుట్టి సంకన పెట్టినాడు కాదరయ్యా బుట్టి సంకన పెట్టినాడు కాదరయ్యా వాడు పల్లె దావ పట్టినాడు కాదరయ్యా పల్లె […]పూర్తి వివరాలు ...
18 మండలాల్లో అతి తక్కువ వర్షపాతం జిల్లా వ్యాప్తంగా సకాలంలో వర్షం రాక పోవడం, వచ్చినా పదును కాకపోవడంతో సేద్యాలు చేసుకోలేక రైతులు వాన కోసం ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు. ఖరీఫ్ పంటకు అను వైన జూన్, జులై నెలల్లో జిల్లాలో సాధారణం కంటే అతి తక్కువ వర్షపాతం నమోదైంది. నాలుగు నెలల్లో 393.5 మిల్లి మీటర్ల వర్షపాతం జి ల్లాలో నమోదు కావాల్సి ఉండగా 180.6 మిల్లి మీటర్లు మాత్రమే నమోదైంది. వాస్తవికంగా 54 […]పూర్తి వివరాలు ...
తితిదే పరిధిలోని వైఎస్‌ఆర్ జిల్లా జమ్మలమడుగులోని శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో బుధవారం నుంచి ఈ నెల 5వతేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా బుధవారం ఉదయం 9 నుండి 12 గంటల వరకు స్నపన తిరుమంజనం, యాగశాల పూజ, పుణ్యావచనం, పవిత్ర ప్రతిష్ట నిర్వహిస్తారు. 4వతేదీన ఉదయం 8.30 నుండి 12 గంటల వరకు పవిత్ర సమర్పణ, 5వతేదీన ఉదయం 8.30 నుండి 12 గంటల వరకు స్నపన […]పూర్తి వివరాలు ...
జమ్మలమడుగు మున్సిపల్ చైర్ పర్సన్ గా తులశమ్మ(వైకాపా), వైస్ ఛైర్మన్‌గా ముల్లా జానీ (తెదేపా)ఎన్నికయ్యారు. జమ్మలమడుగు మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక ఎట్టకేలకు ప్రశాంతంగా ముగిసింది. తెదేపా, వైకాపా అభ్యర్థులకు సమానంగా ఓట్లు రావడంతో లాటరీ ద్వారా ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌లను ఎంపిక చేశారు. తెదేపా వాళ్ళు ప్రత్యక్ష ఎన్నికలలో అధిక స్థానాలు పొందినప్పటికీ లాటరీలో చైర్ పర్సన్, పదవి వైకాపాకు దక్కడం విశేషంగా ఉంది. మే నెలలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 9 […]పూర్తి వివరాలు ...