చిన్నమండెం: కేశాపురం గ్రామం దేవళంపేటలో మంగళవారం సాయంత్రం సిద్దల బోనాలతో ప్రారంభమైన పాలేటమ్మ తిరునాళ్లలో రాత్రికి మొక్కులు ఉన్న భక్తులు కట్టిన చాందినీ బండ్లు, బాణ సంచా పేలుళ్లు, చెక్కభజనలు, కోలాటాలు, సంగీతవిభావరి అందరిని అలరించాయి. బుధవారం అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయం వద్ద రద్దీ నెలకొంది. జిల్లా నలుమూలల నుంచే కాకుండా చిత్తూరు జిల్లా సరిహద్దు మండలాల నుంచి వేల సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. అమ్మవారి దర్శనానికి ఎక్కువ సమయం వరుసలో నిల్చోవాల్సి వచ్చింది. […]పూర్తి వివరాలు ...
Tags :కేశాపురం
వార్తా విభాగం
Monday, March 17, 2014
చిన్నమండెం మండల పరిధిలోని కేశాపురం గ్రామం దేవళంపేటలో వెలసిన పాలేటమ్మ ఆలయం వద్ద 18వ తేదీ మంగళవారం నుంచి రెండు రోజులు తిరునాళ్ల నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా పేరెన్నికగన్న పాలేటమ్మకు చిన్నమండెం, కలిబండ, పడమటికోన, బోనమల, కేశాపురం, జిల్లా సరిహద్దు గ్రామాల్లో ఆదివారం నుంచే బోనాలు సమర్పిస్తారు. మంగళవారం ఉదయం నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. సాయంత్రం సిద్దల బోనాలు సమర్పించడంతో తిరునాళ్ల ప్రారంభమవుతుంది. మొక్కులు ఉన్నవారు […]పూర్తి వివరాలు ...