ఒంటిమిట్ట: వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని పోతన సాహిత్యపీఠం మరియు తితిదే ధర్మప్రచారమండలి ఆధ్వర్యంలో ఒంటిమిట్ట కోదండరామాలయంలో గురువారం జరిగిన భాగవత పద్యార్చనకు విద్యార్థుల నుంచి అనూహ్య స్పందన లభించింది. జిల్లావ్యాప్తంగా సుమారు 2 వేల మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. యోగి వేమన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య శ్యాంసుందర్ పోటీలను ప్రారంభింపద్యార్చనకు హాజరైన విద్యార్థులను చూసి వారు ఆశ్యర్యచకితులయ్యారు. వీరు తెలుగుభాషా గతవైభవాన్ని గుర్తుకు తెస్తున్నారని వైవీయూ ఉపకులపతి శ్యాంసుందర్ అన్నారు. తెలుగుభాషకు సేవ చేస్తున్న […]పూర్తి వివరాలు ...
Tags :కట్టానరసింహులు
యోగివేమన విశ్వవిద్యాలయం తెలుగుశాఖ ఆధ్వర్యంలో ’21వ శతాబ్దిలో తెలుగు సాహిత్యం తీరుతెన్నులు’ అనే అంశంపై జాతీయ సదస్సు సి.వి.రామన్ విజ్ఞాన భవన్‌లోని సదస్సుల గదిలో బుధవారం మొదలైంది. ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి అధ్యక్షోపన్యాసం చేస్తూ సమాజ కోణం నుంచి సాహిత్యాన్ని అధ్యయనం చేయాల్సిన అవసరాన్ని వివరించారు. ఈ సదస్సులో పాల్గొన్న ఆచార్య కుసుమకుమారి మాట్లాడుతూ వికీపిడియా వంటి వెబ్‌సైట్‌లు వేల పుటల్ని సాహిత్య అభిమానులకు అందిస్తున్నాయని వివరించారు. అలాంటి మాధ్యమాలను తెలుగు రచయితలు, పరిశోధకులు తప్పక ఉపయోగించుకోవాలన్నారు. […]పూర్తి వివరాలు ...