Tags :ఉర్దూ విశ్వవిద్యాలయం

    రాజకీయాలు

    ‘సతీష్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయాల’

    జిల్లాపై వివక్ష కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి కడప : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాపై వివక్ష కొనసాగిస్తున్నాడని , ఉర్దూ విశ్వవిద్యాలయాన్ని ఇతర జిల్లాకు తరలించడమే ఇందుకు నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నజీర్అహ్మద్ ఆరోపించారు. స్థానిక ఇందిరాభవన్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కడప జిల్లాలో ఉర్దూ యూనివర్సిటీ, ఒంటిమిట్ట ఉత్సవాలు, పెద్దదర్గా అభివృద్ధి, ఫుడ్‌పార్క్ మొదలైన వాటిపై శాసనసభలో ప్రకటన చేశారని.. ఇప్పుడు కర్నూలు జిల్లాలో ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారని విమర్శించారు. ఉర్దూ […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    ఉర్దూ విశ్వవిద్యాలయం దీక్ష విరమణ

    ముఖ్యమంత్రిని కలిసేందుకు సతీష్ హామీ కడప: సంఖ్యాపరంగా, పాఠశాలల పరంగా చూసినా కడపలో ఉర్దూ విశ్వవిద్యాలయం సాధనకు మేం శాయశక్తులా కృషిచేస్తాం, విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామని శాసనమండలి ఉపాధ్యక్షుడు సతీష్‌రెడ్డి అన్నారు. యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో 20రోజుల నుంచి కడప కలెక్టరేట్ వద్ద జరుగుతున్న నిరాహార దీక్షాశిబిరాన్ని సందర్శించిన సతీష్  నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారమే ఉర్దూ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు సలా ఉద్దీన్, ఇతర ప్రముఖులతో […]పూర్తి వివరాలు ...

    వార్తలు

    ముఖ్యమంత్రి కక్ష గట్టారు

    ఉర్దూ విశ్వవిద్యాలయం కోసం కొనసాగుతున్న ఆందోళనలు కడప : కడపలో ఉర్దూ విశ్వవిద్యాలయం ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తూ సీపీఎం కార్యకర్తలు బుధవారం కలెక్టరేట్ ఎదుట ముఖ్యమంత్రి చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించారు. ఆందోళనకారులు దిష్టిబొమ్మతో ప్రదర్శనగా వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ప్రజాస్వామ్య బద్దంగా నిరసన తెలియజేసే హక్కు తమకు ఉందని, దీన్ని అడ్డుకోవడానికి మీరెవరంటూ సీపీఎం నగర కార్యదర్శి ఎన్.రవిశంకర్‌రెడ్డి ప్రశ్నించారు. ఇవేవి పట్టని పోలీసులు దిష్టిబొమ్మను లాగేశారు. […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    ‘చంద్రబాబు మాట నిలుపుకోవాల’

    ఉర్దూ విశ్వవిద్యాలయం కోసం కొనసాగుతున్న ఆందోళన కడప: జిల్లాలో ఉర్దూ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు మాట నిలుపుకోవాలని వైకాపా నాయకులు పేర్కొన్నారు. ఊరికోమాట, రోజుకో ప్రకటన ఇవ్వడం ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టటానికే చేస్తున్నారని ఆరోపించారు. అధిక సంఖ్యలో ఉర్దూ విద్యార్థులు, కవులు, సాహితీవేత్తలు ఉన్న ప్రాంతంలో కాకుండా కర్నూలులో విశ్వవిద్యాలయం స్థాపిస్తామని చంద్రబాబు ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు గురువారం స్థానిక కలెక్టరేట్ వద్ద ఉర్దూ విశ్వవిద్యాలయ కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో జరగుతున్న […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    జిల్లా అభివృద్ధికి పోరుబాటే శరణ్యం: అఖిలపక్షం

    మొత్తానికి కడప జిల్లాకు చెందిన నాయకులు జిల్లా అభివృద్ది కోసం సమాలోచనలు సాగించడానికి సిద్ధమయ్యారు. ఈ దిశగా అఖిలపక్షం గురువారం కడపలో సమావేశం నిర్వహించింది. జిల్లా అభివృద్ది కోసము పోరాటాలు చేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులూ, రైతు సంఘాల నాయకులూ నొక్కి చెప్పారు. ఇది ఒక ముందడుగు… ఈ అడుగులు గమ్యం చేరే వరకు ఇలాగే సాగాలని జిల్లా ప్రజానీకం ఆకాంక్షిస్తోంది! కడప: రాయలసీమలో వెనుకబడిన కడప జిల్లాను అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వమే వివక్ష చూపుతోన్ననేపధ్యంలో […]పూర్తి వివరాలు ...

    వార్తలు

    ఉర్దూ విశ్వవిద్యాలయం కోసం ఆందోళనలు

    కడప: జిల్లాలో ఏర్పాటు చేస్తామని చెప్పిన ఉర్దూ విశ్వవిద్యాలయాన్ని చంద్రబాబు మాట మార్చి కర్నూలుకు మంజూరు చేస్తున్నట్లు పేర్కొనడంపై జిల్లాలోని అన్ని వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉర్దూ విశ్వవిద్యాలయ సాధనకు నగరంలోని ఉర్దూ మాతృభాషాభిమానులు, కవులు, ప్రజాప్రతినిధులు ఉర్దూ విశ్వవిద్యాలయ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట నిరహారదీక్షలు చేపట్టారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు రోజూ 25 మందితో దీక్షలు చేపడతామని యాక్షన్ కమిటీ అధ్యక్షుడు సలాఉద్దీన్ తెలిపారు. మాట మార్చిన వ్యక్తులకు మద్దతు పలికే […]పూర్తి వివరాలు ...