ఆంధ్ర సాహిత్య ప్రబంధాలలో మనుచరిత్ర కున్నంత స్థానం మరే ప్రబంధానికీ లేదు. అల్లసాని పెద్దనామాత్యుడీ ప్రబంధాన్ని రచించాడు. ఈయన నందవరీక బ్రాహ్మణుడు. చొక్కనామాత్యుని పుత్రుడు. అహోబలం మఠం పాలకుడు శఠగోపయతి వల్ల చతుర్విధ కవిత్వాలు సంపాదించుకొన్నాడు. అల్లసాని పెద్దన శ్రీకృష్ణదేవరాయల కొలువులో ప్రవేశించక మునుపే హరికథాసారం రచించాడు. ఈ గ్రంథం లభ్యం కాలేదు. ఇందలి కొన్ని పద్యాలను కస్తూరి రంగకవి తన ఆనందరంగరాట్ఛందంలో ఉదాహరించాడు. శ్రీకృష్ణరాయలు క్రీ.శ. 1509లో విజయనగర సింహాసనం అధిష్ఠించాడు. అప్పటికే ఆ రాజ్యం […]పూర్తి వివరాలు ...
Tags :అల్లసాని పెద్దన
భక్త కన్నప్ప కడప (వైఎస్సార్) జిల్లా వాడే. కైఫీయతుల్లో ఇందుకు స్పష్టమైన ఆధారం ఉందని ఘంటాపథంగా చెబుతున్నారు. దీంతో కన్నప్ప కర్నాటకవాడనీ, తమిళుడని, ఆ ప్రాంతాల వారు చేసిన వాదనలో నిజం లేదని స్పష్టమైంది. కన్నప్ప వైఎస్సార్ జిల్లావాడేననడానికి రుజువుగా ఆయన ప్రతిష్టించిన శివలింగం రాజంపేట మండలం ఊటుకూరులో నేటికీ ఉందని పండిత పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.పూర్తి వివరాలు ...