పదకవితా పితామహుడి ‘కడపరాయడు’ జగదేక సుందరుడు, అందగాడు. వాని అందచందాలు చూసి కన్నెలు పరవశించినారు. వాని చేతలకు బానిసలైనారు. కడపరాయని వశీకరణకు గురైన ఒక నాయిక ఆ ‘మాయగాడి’ని మోహిస్తూ.. వచ్చి వలపులందుకొమ్మని ఇట్లా పిలుస్తోంది… వర్గం: శృంగార సంకీర్తన రాగము: శంకరాభరణం రేకు: 1610-4 సంపుటము: 26-58 మాఁటలేలరా యిఁక మాఁటలేల మాఁటలేలరా మాయకాఁడా ॥పల్లవి॥ చూచి చూచే చొక్కించితి యేచి నీ చేఁత కేమందురా కాచెఁ బూచెను కాఁగిట చన్నులు లోఁచి చూడకు లోనైతి […]పూర్తి వివరాలు ...
Tags :అన్నమయ్య సంకీర్తనలలో కడప జిల్లా
పదకవితా పితామహుని ‘కడపరాయడు’ ఎవరినో తలపోస్తూ కోపిస్తున్నాడని కలహాంతరియైన నాయిక ఇట్లా వాపోతున్నది. వర్గం : శృంగార సంకీర్తన రాగము: హిందోళవసంతం రేకు: 0214-2 సంపుటము: 8-80 నేనుసేసే చేఁతలలో నెరుసున్నదా మీనుల వినుమంటేను వేసరేవుగాక ॥పల్లవి॥ కప్పుర మిచ్చితిఁ గాక కవకవ నవ్వితినా రెప్పల మొక్కితిఁగాక రేసు రేచేఁనా ముప్పిరినెవ్వతెచేనో ముందువాడివచ్చి దప్పితో నొక్కటొక్కటే తలచేవుగాక ॥నేనుసేసే॥ చిగురందిచ్చితిఁగాక చేగోరు దాఁకించితినా మొగమోటనుంటిఁగాక ముంచికైకోనా మగువ యెవ్వతెచేనో మర్మాలు తొరలి వచ్చి పగటులనూరకే భ్రమసేవుగాక ॥నేనుసేసే॥ […]పూర్తి వివరాలు ...
నల్లబల్లి చెన్నకేశవుని స్తుతించిన అన్నమాచార్య సంకీర్తన – 2 నల్లబల్లి, కడప జిల్లాలోని ముద్దనూరు మండలానికి చెందిన ఒక గ్రామము. ఇది మండల కేంద్రమైన ముద్దనూరు పట్టణానికి సమీపంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న చెన్నకేశవ స్వామి ఆలయాన్ని పదకవితా పితామహుడు పలుమార్లు సందర్శించినట్లు చారిత్రిక ఆధారాలను బట్టి తెలుస్తోంది. నల్లబల్లి చెన్నకేశవుని సరససల్లాపాలను అన్నమాచార్యుడు ఈ విధంగా కీర్తిస్తున్నాడు… వర్గం : శృంగార సంకీర్తన రాగము: రామక్రియ రేకు: 0190-4 సంపుటము: 7-534 చేకొనుమీ నల్లఁబల్లి చెన్నకేశవా […]పూర్తి వివరాలు ...
చెంతకు చేరిన కడపరాయని చేతలను తప్పు పడుతూ, సవతుల పట్ల ఈర్ష్యను చూపక, నేర్పరితనంతో వానిని కట్టి పడేయమని చెలికత్తె ఆ సతికి ఇట్లా సుద్దులు చెబుతోంది.. వర్గం: శృంగార సంకీర్తన రాగము: నారాయణి రేకు: 0704-3 సంపుటము: 16-21 సారెనేలే జగడము – అన్నమాచార్య సంకీర్తన ‘నేరుపరి వై..’ సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి. నేరుపరి వైతేను నెలఁత నీ వాతనికి నారుకొన్నప్రియముతో నయములే చూపవే ॥పల్లవి॥ సన్నలనే పతికి నిచ్చకురాలవై యుండవే […]పూర్తి వివరాలు ...
గొణుగుతూ, తిట్టుతూ కడపరాయనితో పంతం బట్టి, మళ్ళా పతికై వయ్యారి చూపులు చూస్తున్న ఆ సతిని చెలికత్తె అనునయించి, కడపరాయని కౌగిలిలో కరిగిపొమ్మని ఇలా ఊరడిస్తోంది… వర్గం: శృంగార సంకీర్తన రాగము: రామక్రియ రేకు: 1124-7 సంపుటము: 21-139 సారెనేలే జగడము – అన్నమాచార్య సంకీర్తన ‘సారెనేలే జగడము సారెనేలే’ సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి. సారెనేలే జగడము సారెనేలే సణఁగులు సారెనేలే పతితోఁ బంతము సారెనేలే ॥పల్లవి॥ పెదవుల గొణఁగుచు బీరములాడుచు కొదలుఁదిట్లనే […]పూర్తి వివరాలు ...
కలహించిన కడపరాయడు తిరస్కరించి పోగా వాని ఊసులని, చేతలని తలచుకొని మన్నించమని అడుగుతూ ఆ సతి, చెలికత్తెతో వానికిట్లా సందేశం పంపుతోంది… వర్గం: శృంగార సంకీర్తన రాగము: శంకరాభరణం రేకు: 0958-4 సంపుటము: 19-334 ఆడరాని మా టది – అన్నమాచార్య సంకీర్తన ‘ఆడరాని మా టది’ సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి. ఆడరాని మా టది గుఱుతు వేడుకతోనే విచ్చేయుమనవే ||పల్లవి|| కాయజకేలికిఁ గడుఁ దమకించఁగ ఆయము లంటిన దది గుఱుతు పాయపుఁబతికినిఁ […]పూర్తి వివరాలు ...
గండికోట చెన్నకేశవుని సంకీర్తన – 3 చెన్నకేశవుని యెడల అపారమైన భక్తిప్రపత్తులు కలిగిన అన్నమయ్య తన కీర్తనలలో ఆ స్వామిని స్తుతించి తరించినాడు. విజయనగర సామ్రాజ్య కాలంలో వెలుగులీని హైందవ సంప్రదాయానికీ, సంస్కృతికీ ప్రతీకగా నిలిచిన గండికోటలో చెన్నకేశవుని ఆలయం ఒకటి ఉండేది. ఈ ఆలయాన్ని దర్శించిన అన్నమయ్య ఇక్కడి చెన్నకేశవుడి ప్రణయ గాధను ఈ విధంగా స్తుతిస్తున్నాడు… వర్గం : శృంగార సంకీర్తన రాగము: సామంతం రేకు: 1354-5 సంపుటము: 23-323 చెయ్యరాని చేఁతల వోచెన్నకేశ్వరా చేయం టేవు గండికోట […]పూర్తి వివరాలు ...
స్వాధీన పతికయైన శృంగార నాయక ఒకతె కడపరాయని లీలలు కొనియాడుచూ, సుతారముగా ఆయనను దెప్పిపొడుస్తూ ‘నీవూ నేనూ ఒకటే కదా. నన్ను చూస్తే నీకెందుకయ్యా అంత భయం’ అంటూ తనని వశపరచుకున్న వైనాన్ని వివరిస్తోంది. అన్నమయ్య గళం నుండి జాలువారిన ఆ సంకీర్తనా మాధుర్యం మీ కోసం… వర్గం: శృంగార సంకీర్తన రాగము: సామంతం రేకు: 0277-5 సంపుటము: 9-161 ‘నీకేల వెరపు’ సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి… నీకేల వెరపు నీవూ […]పూర్తి వివరాలు ...
గండికోట చెన్నకేశవుని స్తుతించిన అన్నమయ్య సంకీర్తన – 2 చెన్నకేశవుని యెడల అపారమైన భక్తిప్రపత్తులు కలిగిన అన్నమయ్య తన కీర్తనలలో ఆ స్వామిని స్తుతించి తరించినాడు. విజయనగర సామ్రాజ్య కాలంలో వెలుగులీని హైందవ సంప్రదాయానికీ, సంస్కృతికీ ప్రతీకగా నిలిచిన గండికోటలో చెన్నకేశవుని ఆలయం ఒకటి ఉండేది. ఈ ఆలయాన్ని దర్శించిన అన్నమయ్య ఇక్కడి చెన్నకేశవుడిని ఈ విధంగా స్తుతిస్తున్నాడు… వర్గం : శృంగార సంకీర్తన రాగము: ముఖారి రేకు: 1009-2 సంపుటము: 20-50 చెల్లునా నీ కీపనులు చెన్న కేశా ‘చెల్లునా […]పూర్తి వివరాలు ...