కడప, హైదరాబాదుల నడుమ ట్రూజెట్ విమాన సర్వీసు

కడప, హైదరాబాదుల నడుమ ట్రూజెట్ విమాన సర్వీసు

ఏప్రిల్ 8 నుండిప్రారంభం

శుక్ర, శని, ఆది వారాలలో కడప – హైదరాబాదు సర్వీసు

కడప: కడప – హైదరాబాదు నగరాల మధ్య వారానికి మూడు సార్లు విమానాన్ని నడిపేందుకు ట్రూజెట్ విమానయాన సంస్థ సిద్ధమైంది. మొదటి విమానం ఏప్రిల్ 8వ తేదీ ఉదయం 10 గంటల 05 నిముషాలకు హైదరాబాదు నుండి బయలుదేరి మధ్యాహ్నం 11 గంటల 10 నిముషాలకు కడప చేరుతుంది.

అదే విమానం 11 గంటల 35 నిముషాలకు కడప నుండి బయలుదేరి తిరుపతి మీదుగా మధ్యాహ్నం 02 గంటల 05 నిముషాలకు హైదరాబాదు చేరుతుంది.

చదవండి :  రెండు రోజులు కాదు వారానికి మూడు రోజులు

ఇప్పటికే ఈ సర్వీసుకు సంబంధించి టికెట్ల అమ్మకాన్ని ట్రూజెట్ ప్రారంభించింది. కడప – హైదరాబాదుల మధ్య టికెట్ ధరను రూ.3630 గా నిర్ణయించినారు.

ప్రతి శుక్ర, శని, ఆది వారాలలో కడప-హైదరాబాదుల మధ్య ఈ విమాన సర్వీసు నడవనున్నట్లు ట్రూజెట్ సంస్థ ప్రతినిధి ఒకరు కడప.ఇన్ఫో కు తెలియచేశారు.

http://www.trujet.com/ebooking/home/ అనే సైట్ ద్వారా కడప – హైదరాబాదు విమాన సర్వీసుకు టికెట్లు కొనుక్కోవచ్చు.

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: