
మూఢనమ్మకాలు లేని సమాజాన్ని నిర్మించాలి: డా నరసింహారెడ్డి
ప్రొద్దుటూరు: శాస్త్రీయ దృక్పధంతో మూఢనమ్మకాలు లేని సమాజాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని అని జనవిజ్ఞాన వేదిక జిల్లా వ్యవస్థాపక నాయకులు, పట్టణ గౌరవాధ్యక్షుడు డా. డి. నరసింహా రెడ్డిఉద్ఘాటించారు. స్థానిక జనవిజ్ఞాన వేదిక కార్యాలయంలో జరిగిన సైన్సు ప్రయోగాత్మక శిక్షణా తరగతుల ముగింపు సమావేశం బుధవారం జరిగింది.
శిక్షణా తరగతులలో భాగంగా బుధవారం విద్యార్థులకు మ్యాజిక్ పైన మెజీషియన్ సుజాన్ కుమార్ శిక్షణను యిచ్చారు. అనంతరం జనవిజ్ఞాన వేదిక క్యాలెండరు ను జెవివి నాయకులు విడుదల చేశారు.
ఈ కార్యక్రమములో డా. డి.నరసింహారెడ్డి మాట్లాడుతూ జనవిజ్ఞాన వేదిక ద్వారా అక్షరాస్యతను ప్రజల్లో పెంచామని, ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం పెంచేందుకు కృషిచేస్తున్నామని అన్నారు. విద్యార్థులు మ్యాజిక్ శిక్షణను నేర్చుకొని స్టేజి షో లు ఇవ్వడం అభినందనీయం అని అన్నారు.
జనవిజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శులు రవిశంకర్, సుజాన్ కుమార్ లు మాట్లాడుతూ భారతీయ శాస్త్రవేత్తలు డా.యల్లాప్రగడ సుబ్బారావు, డా.AS రావు, శ్రీనివాస రామానుజం, సి.వి.రామన్, సలీం అలీ, జగదేశ్ చంద్రబోష్, హోమీ బాబా, సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్, బోస్, ఆర్యభట్ట, సుశ్రుతుడు తోనూ, చదువుల గురువులు సావిత్రీ భాయి పులే, కృపస్కయ , గిజుబాయి, కొటారి, సర్వేపల్లి, రావీన్ద్రనాద్ టాగూర్, లూయి బ్రయిలి, మాంటిస్సొరితోనూ, సామాజిక కార్యకర్తలు రొమిల్లా థాపర్, ఫై.సత్యవతి మూధనమ్మకాలపై పోరాడిన నరేంద్ర దబోల్కర్, గోవింద్ పన్సారే, కల్బుర్గిల చిత్రాలతో కూడిన క్యాలెండరును ఈ సంవత్సరం జనవిజ్ఞాన వేదిక విడుదల చేసిందన్నారు.
ఈ కార్యక్రమంలో స్పందన రాంప్రసాద్ రెడ్డి, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తవ్వా సురేష్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు గోపినాథ రెడ్డి, సభ్యులు మురళి గుప్తా, డా.కలావతి, జి.టి.ఈశ్వరయ్య, ఉత్తమా రెడ్డి, ప్రకాష్, పెంచలయ్య, శ్రీలక్ష్మి, హేమలత 30 మంది విద్యార్థులు మ్యాజిక్ శిక్షణను పొందారు.
1 Comment
Quality posts is the important to invite the visitors to pay a visit
the web site, that’s what this web site is providing.