jvv

ప్రయోగాత్మక శిక్షణ తోనే అవగాహన – జెవివి

ప్రొద్దుటూరు: విద్యార్థులకు సైన్సు ను ప్రయోగాత్మకంగానే శిక్షణ ఇచ్చినప్పుడే మంచి అవగాహన కలుగుతుందని జనవిజ్ఞాన వేదిక చెకుముకి కన్వీనర్ జి,టి.ఈశ్వరయ్య ఆన్నారు . స్థానిక శ్రీరాములపేటలోని CRC భవనంలో ఆదివారం ఉదయం విద్యార్థులకు సైన్సు ను ప్రయోగాత్మకంగా వివరించే కార్యక్రమం చేపట్టారు.

బోధకులుగా సైన్సు ఉపాద్యాయులు శివ మాధవ రెడ్డి , రసాయన శాస్త్ర అధ్యాపకులు ఐఎల్ కుమార్ పాల్గొన్నారు. రసాయన శాస్త్రం లోని ద్రావణాల రకాలు , సజాతీయ , విజాతీయ , సంత్రుప్త , అసంతృప్త , అతి సంత్రుప్త ద్రావనాలు , ఆమ్లాలు – క్షారాలు తయారీ విధానాలు , మనం రోజూ చూసే  పండ్లు , కూరగాయలు లలోని ఆమ్ల , క్షారాలను గుర్తించడం , లిట్మస్ పరీక్ష, PH విలువలను కనుగొనుట, చేసి చూపారు.

చదవండి :  పులివెందులలో చిరంజీవిపై కోడిగుడ్లు, చెప్పులు

ఈ కార్యక్రమం లో జెవివి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తవ్వా సురేష్ రెడ్డి , ఇన్నర్ వీల్ అధ్యక్షులు ఉషారాణి , జెవివి సమతా విభాగం కో – కన్వీనర్ హేమలత , సభ్యులు సదాశివా రెడ్డి , ప్రకాష్ , ఈశ్వర్ రెడ్డి కల్యాణి , ఉత్తమా రెడ్డి , గంగి రెడ్డి , మరియు 30 మంది విద్యార్థులు తల్లిదండ్రులు. ఉపాద్యాయులు. పాల్గొన్నారు.

ఇదీ చదవండి!

సదానంద గౌడ

ఈ పొద్దు జిల్లాలో కేంద్ర న్యాయశాఖ మంత్రి పర్యటన

కడప : కేంద్ర న్యాయశాఖ మంత్రి డీవీ సదానందగౌడ ఈరోజు జిల్లా పర్యటనకు వస్తున్నట్లు ఫ్యాక్స్‌ ద్వారా సమాచారం అందిందని …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: