సోమవారం , 23 డిసెంబర్ 2024
సిపి బ్రౌన్ గ్రంథాలయం
సిపి బ్రౌన్ గ్రంధాలయం మరియు భాషా పరిశోధనా కేంద్రము, కడప

బ్రౌన్ లైబ్రరీ నిర్మాణం మొదలైన రోజు

When:
శుక్రవారం, జనవరి 22, 2021 all-day Indian/Maldives Timezone
2021-01-22T00:00:00+05:00
2021-01-23T00:00:00+05:00
Cost:
Free
బ్రౌన్ లైబ్రరీ నిర్మాణం మొదలైన రోజు

తెలుగు పునరుజ్జీవన పితామహుడుగా పేరుపొందిన సి.పి.బ్రౌన్‌ పూర్తిపేరు ఛార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌. ఈయన తూర్పు ఇండియా కంపెనీ ఉద్యోగిగా 1820లో కడపజిల్లా కలెక్టర్‌కు సహాయకుడుగా ఉద్యోగజీవితాన్ని ప్రారంభించాడు. ఈయన కడపలో 15 ఎకరాల తోటను ఒక బంగ్లాతో సహా 3,000 వరహాలకు కొన్నాడు. ( ఒక వరహా అంటే ఆ రోజుల్లో 4 రూపాయలుతో సమానం) తెలుగు సాహిత్యానికి సేవచేయడానికై ఆయన ఈ తోటను కొన్నాడు. ఆ స్థలాన్ని బ్రౌన్‌ కాలేజ్‌ అని ఆ రోజుల్లో పిలిచేవారు. సి.పి.బ్రౌన్‌ తెలుగు భాషా సాహిత్యాల సముద్ధరణకోసం కట్టించిన భవన శిథిలాలమీద నేటి సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం ఆవిర్భవించింది.

శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని తెలుగుశాఖ 1974 లో సి.పి.బ్రౌన్‌ పరిశోధనా పథకాన్ని ప్రారంభించింది. దీనికి ఆచార్య జి.ఎన్‌.రెడ్డి అధ్యక్షుడు కాగా బంగోరె(బండి గోపాలరెడ్డి) పరిశోధకుడుగా ఉండేవారు. ఈ ఇద్దరు లండన్‌లో ఉండినటువంటి వేల పుటల వ్రాతప్రతులను తెప్పించారు. దాదాపు 20 సంపుటాల లేఖలు తెప్పించారు. ఈ ప్రాజెక్టు నిర్వహణకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి పదిహేనువేల రూపాయల గ్రాంటును మంజూరుచేసింది.

ఆచార్య జి.ఎన్‌.రెడ్డి, బంగోరెలు తమ పరిశోధనలో భాగంగా కడపకు అనేక పర్యాయాలు వచ్చారు. బ్రౌన్‌, రచనలు ఆయన స్వీయచరిత్ర ఆధారంగా ఒక పర్యాయం సి.పి.బ్రౌన్‌ నివసించిన స్థలాన్ని వాళ్ళు గుర్తించారు. తరువాత వాళ్ళు అప్పటి జిల్లా కలెక్టరు డా.పి.ఎల్‌.సంజీవరెడ్డి గారిని కలుసుకొని సి.పి.బ్రౌన్‌ తెలుగు సాహిత్యానికి సేవచేసిన స్థలంలో ఒక గ్రంథాలయాన్ని స్థాపించాలని కోరారు.

జిల్లా కలెక్టరు డా.పి.ఎల్‌.సంజీవరెడ్డిగారు అప్పటి సి.పి.బ్రౌన్‌ నివసించిన స్థల యజమాని శ్రీ సి.ఆర్‌.కృష్ణస్వామి గారి నుండి 20 సెంట్ల స్థలాన్ని విరాళంగా పొందడంలో విజయం సాధించారు. గ్రంథాలయ నిర్మాణం పనిని అప్పటి కడపజిల్లా రచయితల సంఘం అధ్యక్షకార్యదర్శులైన డా.మల్లెమాల వేణుగోపాలరెడ్డి గారికి, శ్రీ జానమద్ది హనుమచ్ఛాస్త్రి గారికి అప్పజెప్పారు.

1986లో స్థలదాత శ్రీ సి.కె.సంపత్‌కుమార్‌ గారు (సి.ఆర్‌.కృష్ణస్వామిగారి కుమారుడు) అధ్యక్షుడుగా, జిల్లా కలెక్టర్‌ ప్రధాన పోషకుడుగా, జానమద్ది హనుమచ్ఛాస్త్రి గారు కార్యదర్శిగా సి.పి.బ్రౌన్‌ స్మారక ట్రస్టు ఆవిర్భవించింది.

1987 జనవరిలో శ్రీ జంధ్యాల హరినారాయణ గారు జిల్లా కలెక్టరుగా వచ్చారు. ఆయన గ్రామీణ క్రాంతిపథం నిధులనుండి మూడున్నర లక్షల రూపాయలు ట్రస్టుకు మంజూరుచేశారు.

1987 జనవరి 22 న గ్రంథాలయ భవనానికి పునాది వేయబడినది. ఈ కార్యక్రమానికి సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు గారు అధ్యక్షులుగా ఉన్నారు. కడప పట్టణాభివృద్ధి సంస్థ అధ్యక్షులు శ్రీ జి.కృష్ణమూర్తి గారు ఆ సంస్థనుండి మొదటి దఫాగా 43,000 రూపాయలు విరాళంగా ఇచ్చారు.

ఇదీ చదవండి!

మనువు

మనువు (కథ) – సొదుం జయరాం

Calendar Add to Calendar Add to Timely Calendar Add to Google Add to Outlook Add …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: