1929 మే 17న కడప జిల్లాలో ప్రవేశించి కొండాపురం, మంగపట్నం, మారెడ్డిపల్లి, ముద్దనూరు, చిలమకూరు, నిడుజువ్వి, ఎర్రగుంట్ల గ్రామాల మీదుగా రాత్రి 11 గంటలకు గాంధీజీ ప్రొద్దుటూరు చేరినారు.
అనంతరం శెట్టిపల్లి కొండారెడ్డి గారి భవనానికి మహాత్ముడు కారులో వెళ్లారు. అక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకుని సుమారు అరగంట పాటు నూలు వడికారు. ఆ తరువాత ఆయన అక్కడనే శయనించినారు.
స్థానిక వసంతపేటలోని మునిసిపల్ కార్యాలయం దగ్గర మహాత్మునికి సన్మాన పత్రాలను, విరాళాలను సమర్పించడానికి 18 వ తేదీ ఉదయం సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 6 గంటలకే కస్తూరిబాయితో సహా ఆ ప్రదేశానికి వెళ్ళిన గాంధీజీ ప్రొద్దుటూరు సభ ముగియగానే చాగలమర్రికి బయలుదేరి వెళ్ళినారు.
గాంధీజీ గారి పర్యటన పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి… https://kadapa.info/గాంధీజీ-కడప-1929/