శనివారం , 28 డిసెంబర్ 2024
gandhi

గాంధీజీ కడప నగర పర్యటన

When:
గురువారం, డిసెంబర్ 31, 2015 @ 7:40 సా. – శనివారం, జనవరి 2, 2016 @ 8:25 సా. Indian/Maldives Timezone
2015-12-31T19:40:00+05:00
2016-01-02T20:25:00+05:00
గాంధీజీ కడప నగర పర్యటన

1933 డిసెంబరు 31 రాత్రి 7.40 గం.కి గాంధీజీ సపరివారంగా కడప చేరినారు. జిల్లా హరిజన సేవా సంఘ అధ్యక్షుడు వకీలు సంజీవ రెడ్డి మహాత్మునికి పూలదండ వేసి స్వాగతం చెప్పినారు. కడప రైల్వే ప్లాటుఫారం నిండా క్రిక్కిరిసిపోయిన జనం గాంధీజీని జయధ్వానాలతో ఆహ్వానించినారు. గాంధీజీ రైల్వే స్టేషను నుంచి త్రివర్ణ పతాకాలతోను, తోరణాలతోను రమ్యంగా అలంకరించిన మోటారు కారులో పోతూ ప్రజల అభినందనలను, తన సహజ మందహాసముతో అందుకుని శాంతినికేతనానికి పోయి అక్కడ బస చేసినారు.

1934 జనవరి 2న సాయంకాలం 6 గంటలకు గాంధీజీ కడప స్వదేశీ ఎంపోరియంకు ప్రారంభోత్సవం జరిపినారు.

కడప నుంచి గాంధీజీ, ఆయన బృందము జనవరి రెండవ తేదీ రాత్రి 8.25గం.కు రాయచూరు ప్యాసింజరు మూడవ తరగతి బండిలో గుత్తికి బయలుదేరినారు.

http://wp.me/p4r10f-2D

ఇదీ చదవండి!

మనువు

మనువు (కథ) – సొదుం జయరాం

Calendar Add to Calendar Add to Timely Calendar Add to Google Add to Outlook Add …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: