॥పల్లవి॥ నీవేకానింక నే నన్య మెఱఁగ యే- త్రోవ చూపి నాకుఁ దోడయ్యెదవయ్య ॥చ1॥ అపరాధనత కోట్లయినవి వొక్క- నెపమున ననుఁ గావనేరవా అపరిమితదురితా లైనవి యే- ఉపమచేత నన్ను నుద్దరించెదవయ్య ॥చ2॥ అతిశయముగఁ గర్మినైతిని నీ- మతము నాకొకయింత మరపవా ఇతర కర్మారంభహితుఁడను గతి మోక్ష మెటువలెఁ గల్పించెదవయ్య ॥చ3॥ తిరువేంకటాచలాధీశ్వరా నీ- శరణాగతులఁ బ్రోవఁజాలవా పరమదయానందపరుఁడవు యే- వెరవున భవములు వెడలఁ ద్రోచెదవయ్య రాగము: శ్రీరాగం రేకు: 0003-04 సంపుటము: 1-17 Tags: Annamacharya [&పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Thursday, February 19, 2026
॥పల్లవి॥కూడువండుట గంజికొరకా తనకువేడుకలుగల సుఖము వెదకుటకుఁగాక॥చ1॥కుప్ప నురుచుట కసవుకొరకా తనవుగొప్పయవు టిది మదముకొరకావొప్పన వేడుకల నొరసి మనసునెప్పునకురాఁ దివియ నేరవలెఁ గాక॥చ2॥కొలుచు దంచుట పొట్టుకొరకా తాఁగులజుఁడై మూఢుఁడౌ కొరకాతలపోసి యున్నింటఁ దగిలి మీఁదుతెలిసి సుఖదు: ఖములఁ దెలియవలెఁ గాక॥చ3॥కొండ దవ్వుట యెలుక కొరకా తాఁగొండ యెక్కుట దిగుటకొరకాకొండలకోనేటిపతిఁ గొలిచి తనదునిండి నాపదలెల్ల నీఁగవలెఁ గాక రాగము: శ్రీరాగం రేకు: 0019-03 సంపుటము: 1-115 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, […]పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Thursday, February 19, 2026
॥పల్లవి॥దిబ్బలు వెట్టుచుఁ దేలిన దిదివోఉబ్బు నీటిపై నొక హంసాlisinopril and drivinglisinopril and drivinglisinopril and drivingarcoxia॥చ1॥అనువునఁ గమలవిహారమై నెలవైవొనరి వున్నదిదె వొక హంసామనియెడి జీవుల మానససరసుల-వునికి నున్న దిదె వొక హంసా॥చ2॥పాలునీరు నేర్పరిచి పాలలో-నోలనాడె నిదె వొక హంసాపాలుపడిన యీ పరమహంసముల-వోలి నున్నదిదె వొక హంసా॥చ3॥తడవి రోమరంధ్రంబుల గుడ్లపూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Thursday, February 19, 2026
॥పల్లవి॥అప్పులేని సంసార మైనపాటే చాలుతప్పులేనిజీత మొక్క తారమైనఁ జాలు॥చ1॥కంతలేని గుడిశొక్క గంపంతయినఁ జాలుచింతలేని యంబలొక్క చారెఁడే చాలుజంతగాని తరుణి యేజాతైన నదె చాలువింతలేని సంపదొక్క వీసమే చాలు॥చ2॥తిట్టులేని బ్రదుకొక్క దినమైన నదె చాలుముట్టులేని కూడొక్క ముద్దెఁడే చాలుగుట్టుచెడి మనుకంటే కొంచెపు మేలైనఁ జాలువట్టి జాలిఁ బడకుంటే వచ్చినంతే చాలు॥చ3॥లంపటపడని మేలు లవలేశమే చాలురొంపి కంబమౌ కంటె రోయుటే చాలురంపపుఁ గోరిక కంటె రతి వేంకటపతి-పంపున నాతనిఁ జేరే భవమే చాలు రాగము: గుజ్జరి రేకు: 0019-02 సంపుటము: […]పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Wednesday, February 18, 2026
॥పల్లవి॥ఎవ్వారులేరూ హితవు చెప్పఁగ వట్టి-నొవ్వులఁ బడి నేము నొగిలేమయ్యా॥చ1॥అడవిఁ బడినవాఁడు వెడలఁ జోటులేకతొడరి కంపలకిందు దూరినట్లునడుమ దురితకాననములతరిఁ బడివెడలలేక నేము విసిగేమయ్యా॥చ2॥తెవులువడినవాఁడు తినఁబోయి మధురముచవిగాక పులుసులు చవిగోరినట్లుభవరోగములఁ బడి పరమామృతము నోరఁజవిగాక భవముల చవులాయనయ్యా॥చ3॥తనవారి విడిచి యితరమైనవారి-వెనకఁ దిరిగి తా వెఱ్ఱైనట్లుఅనయము తిరువేంకటాధీశుఁ గొలువకమనసులోని వాని మఱచేమయ్యా రాగము: వరాళి రేకు: 0003-02 సంపుటము: 1-15 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, వరాళిపూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Wednesday, February 18, 2026
॥పల్లవి॥ఎన్నాళ్ళదాఁకఁ దానిట్టె వుండుట బుద్దికన్న పోవుట పూర్వకర్మ శేషం॥చ1॥కలకాలమెల్ల దు:వలదా సుఖము గొంతవడియైననుకలుషబుధ్దులఁ బ్రజ్ఞగల దింతయును మంటఁగలసిపోవుటే పూర్వకర్మ శేషం॥చ2॥జాలి తొల్లియుఁబడ్డజాలె నేఁడునుఁగాకమేలు వొద్దా యేమిటినై నానుతాలిమి లో హరిఁ దలఁచక యెఱుకెల్లగాలిఁబోవుట పూర్వకర్మశేషం॥చ3॥తరగని నరకబాధయు నేఁడునుగాకదరి చేరవలదా యింతటనైననుతిరువేంకటాద్రిపై దేవునిఁ గొలువకగరిపడే భవమెల్ల కర్మశేషం రాగము: ఆహిరి రేకు: 0019-01 సంపుటము: 1-113 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, ఆహిరిపూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Wednesday, February 18, 2026
కన్నడ గౌళ॥పల్లవి॥గాలినే పోయఁ గలకాలముతాలిమికిఁ గొంతయుఁ బొద్దు లేదుread॥చ1॥అడుసు చొరనే పట్టె నటునిటుఁ గాళ్ళుగడుగుకొననే పట్టెఁ గలకాలముఒడలికి జీవుని కొడయఁడైనహరిఁదడవఁగా గొంతయుఁ బొద్దులేదు॥చ2॥కలఁచి చిందనే పట్టెఁ గడవ నించగఁ బట్టెకలుషదేహపుబాదఁ గలకాలముతలపోసి తనపాలిదైవమైనహరిదలఁచఁగా గొంతయుఁ బొద్దులేదు॥చ3॥శిరసు ముడువఁబట్టె చిక్కుదియ్యఁగఁ బట్టెగరిమలఁ గపటాలఁ గలకాలముతిరువేంకటగిరి దేవుఁడైన హరిదరిచేరాఁ గొంతయుఁ బొద్దు లేదు రాగము: తెలియదు రేకు: 0003-01 సంపుటము: 1-14 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలుపూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Wednesday, February 18, 2026
॥పల్లవి॥ఏమి గలదిందు నెంత గాలంబైనపామరపు భోగ మాపదవంటి దరయ॥చ1॥కొండవంటిది యాస, గోడ వంటిది తగులుబెండువంటిది లోని పెద్దతనముపుండువంటిది మేను, పోలించినను మేడి_పండువంటిది సరసభావమింతియును॥చ2॥కంచువంటిది మనసు, కలిమిగలదింతియునుమంచువంటిది,రతి భ్రమతవంటిదిమించువంటిది రూపు, మెలింతియును ముట్టుపెంచువంటిది,దీనిప్రియ మేమిభ్రాఁతి॥చ3॥ఆఁకవంటిది జన్మ, మడవివంటిది చింతపాఁకువంటిది కర్మ బంధమెల్లయేఁకటను దిరువేంకటేశుఁ దలచినకోర్కికాఁక సౌఖ్యములున్న గనివంటి దరయ రాగము: శ్రీరాగం రేకు: 0018-06 సంపుటము: 1-112 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, శ్రీరాగంపూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Wednesday, February 18, 2026
॥పల్లవి॥మలసీఁ జూడరో మగ సింహముఅలని మీఱిన మాయల సింహము॥చ1॥అదివో చూడరో ఆదిమపురుషునిపెదయౌభళము మీఁది పెనుసింహమువెదకి బ్రహ్మాదులు వేదాంతతతులుకదిసి కానఁగలేని ఘనసింహము॥చ2॥మెచ్చిమెచ్చి చూడరో మితిమీఱినయట్టి-చిచ్చిఱకంటితోడి జిగిసింహముతచ్చినవారిధిలోన తరుణిఁ గౌఁగిటఁ జేర్చినచ్చినగోళ్ళ శ్రీనరసింహము॥చ3॥బింకమునఁ జూడరో పిరితియ్యక నేఁడుఅంకపుదనుజసంహారసింహమువేంకటనగముపై వేదాచలముపైకింక లేక వడిఁ బెరిగినసింహము రాగము: శంకరాభరణం రేకు: 0002-07 సంపుటము: 1-13 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, శంకరాభరణంపూర్తి వివరాలు ...