పులివెందుల రంగనాథుని పైన అన్నమయ్య రాసిన సంకీర్తన పులివెందులలోని రంగనాయక స్వామి ఆలయాన్ని రామానుజాచార్యులు ప్రతిష్ఠించారు. రైల్వే కొండాపురం వద్ద గల ముచ్చుమర్రి అనే గ్రామంలోని పెద్ద రంగడు, చిన్న రంగడు అనే రజక సోదరుల స్వప్నంలో స్వామి సాక్షాత్కరించి ఏటిలో ఉన్న నన్ను పులివెందులలో ప్రతిష్ఠించవలసిందిగా అజ్ఞాపించారట. రాగము: మలహరి రేకు: 0603-4 సంపుటము: 14-15 ॥పల్లవి॥ ఇంకనేల వెరపు యెదుటనే వున్నారము వంకలొత్తకిఁక మఱి వద్దు వద్దు ఇపుడు ॥చ1॥ వావులు నీకెంచనేల వాడల […]పూర్తి వివరాలు ...
రాగము: దేసాళం రేకు: 1650-5 సంపుటము: 26-298 ॥పల్లవి॥ రట్టడి కడపరాయఁ డిట్టె వీఁడు గట్టిగా నేఁడిపుడు తగవు దేర్చరే ॥చ1॥ చెలము సాదించరాదు సముకానఁ గొంచరాదు పలుమారు మాటలాడి పదరీ వీఁడు మొలకచన్నులు నావి మొనలెత్తీఁదనమీఁద చెలులార మాకు బుద్దిచెప్పఁగదరే ॥చ2॥ పందెములడువరాదు పంతము విడువరాదు కందువలు చూపి పొత్తుగలసీ వీఁడు అందపు నాచూపు లివి అంటుకొనీఁ దనమీద చందపు మావలపులు చక్కఁబెట్టరే ॥చ3॥ తమక మాఁపఁగరాదు తాలిమి చూపఁగరాదు అమర గూడె శ్రీవెకటప్పఁడు వీఁడు […]పూర్తి వివరాలు ...
అన్నమయ్య, కడప జిల్లాలో చాలా దేవాలయాలని దర్శించి, అక్కడి దేవుళ్ళ మీద కీర్తనలు రచించారు. వీటిలో కొన్ని ప్రదేశాలని కొంతమంది పరిశోధకులు, టిటిడి వాళ్ళు, వారి పరిశోధనలో గుర్తించడం జరిగింది. కాని ఇంకా కొన్ని ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయో తెలియలేదు. అలాంటి ప్రదేశాలలో, మేడిదిన్నె హనుమంతాలయం ఒకటి. ఈ ఊరి గురించి మాకు అన్నమయ్య కీర్తనల మీద పరిశోధన చేస్తున్న, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ద్వారా తెలిసింది. మేడిదిన్నె కడప జిల్లాలో పెద్దముడియం మండలానికి చెందిన గ్రామము. […]పూర్తి వివరాలు ...
అన్నమయ్య సంకీర్తనలలో పెద్దముడియం నృసింహుడు రాగము: సాళంగనాట రేకు: 0324-1 సంపుటము: 11-139 ॥పల్లవి॥ జయమాయ నీకు నాపె సరసములూ నయగారి ముడుయము నారసింహా ॥చ1॥మోము చూచి నీతోడ ముచ్చట లాడ వలసి కోమలి నీ తొడమీఁదఁ గూచున్నది ఆముకొని అట్టె మాట లాడ వయ్య ఆపెతోడ నామాట విని యిట్టె నారసింహా ॥చ2॥మన్నన నీ యలుకల మంకు దెలవ వలసి చన్ను లురమునఁ బెట్టి సత మైనది చెన్నుఁడ వాపె చనవు చెల్లించ వయ్య యిట్టె […]పూర్తి వివరాలు ...
కన్నె సోయగమునకు మురిసిన కడపరాయడు (గడపరాయ )చెలువతో చెలిమి చేసి శృంగారము చేసినాడు. నాయికా నాయకుల సరసములు ప్రొద్దుపోవు వరకు సాగినవి.పూర్తి వివరాలు ...
అన్నమయ్య సంకీర్తనలలో ఒంటిమిట్ట కోదండరాముడు ఒంటిమిట్టలోని కోదండరాముడ్ని దర్శించి తరించిన పదకవితా పితామహుడు ఆయన సాహస గాధల్ని (అలౌకిక మహిమల్ని)ఇట్లా కీర్తిస్తున్నాడు … వర్గం: ఆధ్యాత్మ సంకీర్తన రాగము: నాట రేకు: 0096-01 సంపుటము: 1-477 ఇందులోనే కానవద్దా యితఁడు దైవమని విందువలె నొంటిమెట్ట వీరరఘురాముని యెందు చొచ్చె బ్రహ్మవర మిల రావణుతలలు కందువ రాఘవుఁడు ఖండించునాఁడు ముందట జలధి యేమూల చొచ్చెఁ గొండలచే గొందింబడఁ గట్టివేసి కోపగించేనాడు ||ఇందులోనే|| యేడనుండె మహిమలు యిందరి కితఁడు వచ్చి వేడుకతో […]పూర్తి వివరాలు ...
తాళ్ళపాక అన్నమయ్య, అక్క(ల)మ్మల (అక్కమాంబ) సంతానమైన పెదతిరుమలయ్య వాళ్ళ నాయన మాదిరిగానే శ్రీ వేంకటేశ్వరుని సేవలో తరించినాడు. తిమ్మయ్య, తిమ్మార్య, తిరుమలాచార్య, తిమ్మడు, తిరుమలగురుడుగా పేర్కొనబడిన పెదతిరుమలయ్య కూడా దేవుని కడప లక్ష్మీ వల్లభుని దర్శించుకుని తరించినాడు. తన సంకీర్తనలతో కడపరాయని కీర్తించి గానం చేసినాడు. కడపరాయని కీర్తించిన పెదతిరుమలయ్య సంకీర్తనలలో ఇది కూడా ఒకటి. వర్గం: శృంగార సంకీర్తన రాగము: రామక్రియ రేకు: 74-6 సంపుటము: 17-386 ఏమి నీ కింత బలువు యెవ్వ రిచ్చిరి […]పూర్తి వివరాలు ...
ఆహోబిల మఠ సంస్తాపనాచార్యులైన శ్రీమాన్ శఠగోప యతీంద్రుల దగ్గర సకల వైష్ణవాగమాలను అభ్యసించిన పిదప దారి వెంబడి పలు ఆలయాలను దర్శిస్తూ తిరుమల చేరినాడు పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమయ్య. అన్నమయ్య దర్శించుకున్న రాయలసీమ జిల్లాలలోని ఆలయాల జాబితా : కడప జిల్లా: దేవుని కడప లక్ష్మీవెంకటేశ్వరాలయం ఒంటిమిట్ట కోదండరామాలయం గండికోట చెన్నకేశవాలయం గండికోట రామాలయం ప్రొద్దుటూరు చెన్నకేశవాలయం పొట్లదుర్తి చెన్నకేశవాలయం వెయ్యినూతులకోన నృసింహాలయం సంబటూరు చెన్నకేశవాలయం పెద్దచెప్పలి చెన్నకేశవాలయం మాచనూరు చెన్నకేశవాలయం పాలగిరి చెన్నకేశవాలయం కోన చెన్నకేశవాలయం […]పూర్తి వివరాలు ...
మాచనూరు చెన్నకేశవుని సంకీర్తనలు – 1 పదకవితా పితామహుడు దర్శించిన క్షేత్రాలు అనేకం కడప జిల్లాలో ఉన్నాయి. ఆయా వైష్ణవ క్షేత్రాలను దర్శించిన అన్నమయ్య అక్కడి క్షేత్రపాలకులను కీర్తిస్తూ సంకీర్తనా గానం చేసినాడు. అటువంటి క్షేత్రాలలో మాచనూరు చెన్నకేశవాలయం ఒకటి. మాచనూరు కడప జిల్లా పెండ్లిమర్రి మండలంలోని ఒక గ్రామం. ఈ ఊరికి మాచనవోలు (మాచన అనే ఆయన కట్టించడం వలన ఈ ఊరు మాచనవోలు అయింది. ఆధారం: మెకంజీ కైఫీయత్తులు-1225-10) అనే పేరు కూడా కలదు. […]పూర్తి వివరాలు ...