॥పల్లవి॥ఎవ్వారులేరూ హితవు చెప్పఁగ వట్టి-నొవ్వులఁ బడి నేము నొగిలేమయ్యా॥చ1॥అడవిఁ బడినవాఁడు వెడలఁ జోటులేకతొడరి కంపలకిందు దూరినట్లునడుమ దురితకాననములతరిఁ బడివెడలలేక నేము విసిగేమయ్యా॥చ2॥తెవులువడినవాఁడు తినఁబోయి మధురముచవిగాక పులుసులు చవిగోరినట్లుభవరోగములఁ బడి పరమామృతము నోరఁజవిగాక భవముల చవులాయనయ్యా॥చ3॥తనవారి విడిచి యితరమైనవారి-వెనకఁ దిరిగి తా వెఱ్ఱైనట్లుఅనయము తిరువేంకటాధీశుఁ గొలువకమనసులోని వాని మఱచేమయ్యా రాగము: వరాళి రేకు: 0003-02 సంపుటము: 1-15 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, వరాళిపూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Wednesday, February 18, 2026
॥పల్లవి॥ఎన్నాళ్ళదాఁకఁ దానిట్టె వుండుట బుద్దికన్న పోవుట పూర్వకర్మ శేషం॥చ1॥కలకాలమెల్ల దు:వలదా సుఖము గొంతవడియైననుకలుషబుధ్దులఁ బ్రజ్ఞగల దింతయును మంటఁగలసిపోవుటే పూర్వకర్మ శేషం॥చ2॥జాలి తొల్లియుఁబడ్డజాలె నేఁడునుఁగాకమేలు వొద్దా యేమిటినై నానుతాలిమి లో హరిఁ దలఁచక యెఱుకెల్లగాలిఁబోవుట పూర్వకర్మశేషం॥చ3॥తరగని నరకబాధయు నేఁడునుగాకదరి చేరవలదా యింతటనైననుతిరువేంకటాద్రిపై దేవునిఁ గొలువకగరిపడే భవమెల్ల కర్మశేషం రాగము: ఆహిరి రేకు: 0019-01 సంపుటము: 1-113 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, ఆహిరిపూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Wednesday, February 18, 2026
కన్నడ గౌళ॥పల్లవి॥గాలినే పోయఁ గలకాలముతాలిమికిఁ గొంతయుఁ బొద్దు లేదుread॥చ1॥అడుసు చొరనే పట్టె నటునిటుఁ గాళ్ళుగడుగుకొననే పట్టెఁ గలకాలముఒడలికి జీవుని కొడయఁడైనహరిఁదడవఁగా గొంతయుఁ బొద్దులేదు॥చ2॥కలఁచి చిందనే పట్టెఁ గడవ నించగఁ బట్టెకలుషదేహపుబాదఁ గలకాలముతలపోసి తనపాలిదైవమైనహరిదలఁచఁగా గొంతయుఁ బొద్దులేదు॥చ3॥శిరసు ముడువఁబట్టె చిక్కుదియ్యఁగఁ బట్టెగరిమలఁ గపటాలఁ గలకాలముతిరువేంకటగిరి దేవుఁడైన హరిదరిచేరాఁ గొంతయుఁ బొద్దు లేదు రాగము: తెలియదు రేకు: 0003-01 సంపుటము: 1-14 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలుపూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Wednesday, February 18, 2026
॥పల్లవి॥ఏమి గలదిందు నెంత గాలంబైనపామరపు భోగ మాపదవంటి దరయ॥చ1॥కొండవంటిది యాస, గోడ వంటిది తగులుబెండువంటిది లోని పెద్దతనముపుండువంటిది మేను, పోలించినను మేడి_పండువంటిది సరసభావమింతియును॥చ2॥కంచువంటిది మనసు, కలిమిగలదింతియునుమంచువంటిది,రతి భ్రమతవంటిదిమించువంటిది రూపు, మెలింతియును ముట్టుపెంచువంటిది,దీనిప్రియ మేమిభ్రాఁతి॥చ3॥ఆఁకవంటిది జన్మ, మడవివంటిది చింతపాఁకువంటిది కర్మ బంధమెల్లయేఁకటను దిరువేంకటేశుఁ దలచినకోర్కికాఁక సౌఖ్యములున్న గనివంటి దరయ రాగము: శ్రీరాగం రేకు: 0018-06 సంపుటము: 1-112 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, శ్రీరాగంపూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Wednesday, February 18, 2026
॥పల్లవి॥మలసీఁ జూడరో మగ సింహముఅలని మీఱిన మాయల సింహము॥చ1॥అదివో చూడరో ఆదిమపురుషునిపెదయౌభళము మీఁది పెనుసింహమువెదకి బ్రహ్మాదులు వేదాంతతతులుకదిసి కానఁగలేని ఘనసింహము॥చ2॥మెచ్చిమెచ్చి చూడరో మితిమీఱినయట్టి-చిచ్చిఱకంటితోడి జిగిసింహముతచ్చినవారిధిలోన తరుణిఁ గౌఁగిటఁ జేర్చినచ్చినగోళ్ళ శ్రీనరసింహము॥చ3॥బింకమునఁ జూడరో పిరితియ్యక నేఁడుఅంకపుదనుజసంహారసింహమువేంకటనగముపై వేదాచలముపైకింక లేక వడిఁ బెరిగినసింహము రాగము: శంకరాభరణం రేకు: 0002-07 సంపుటము: 1-13 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, శంకరాభరణంపూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Wednesday, February 18, 2026
॥పల్లవి॥దిక్కిందరికినైన దేవుఁడు కడుఁదెక్కలికాఁడైన దేవుఁడు॥చ1॥కొత్తపైండ్లికూఁతుఁ గోరి చూడఁబోయుయెత్తి తేరిమీఁద నిడుకొనినెత్తికన్ను మానినవాని పెండ్లికిదెత్తిగొన్న యట్టి దేవుఁడు॥చ2॥గొప్పయునపెద్దకొండమీఁద నుండిదెప్పరమ్ముగా దిగఁబడికప్పి రెండుదునుకలు గూడినవానితిప్పుఁదీరులాడే దేవుఁడు॥చ3॥బెరసి మేనమామబిడ్డకునై పోయునిరతఁపుబీరాలు నెరపుచుయిరవైనమాయపుటెద్దులఁ బొరిగోన్న-తిరువేంకటగిరి దేవుఁడు రాగము: ఆహిరి రేకు: 0018-05 సంపుటము: 1-111 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, ఆహిరిపూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Wednesday, February 18, 2026
॥పల్లవి॥సందడి విడువుము సాసముఖామంధరధరునకు మజ్జనవేళాlink॥చ1॥అమరాధిపు లిడుఁ డాలవట్టములుకమలజ పట్టుము కాళాంజిజమలిచామరలు చంద్రుఁడ సూర్యుఁడఅమర నిడుఁడు పరమాత్మునకు॥చ2॥అణిమాదిసిరులనలరెడు శేషుఁడమణిపాదుక లిడు మతి చెలఁగాప్రణుతింపు కదిసి భారతీరమణగుణాధిపు మరుగురు బలుమరును॥చ3॥వేదఘోషణము విడువక సేయుఁడుఆదిమునులు నిత్యాధికులుశ్రీదేవుండగు శ్రీవేంకటపతిఆదరమున సిరు లందీ వాఁడె రాగము: ధన్నాసి రేకు: 0002-06 సంపుటము: 1-12 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, ధన్నాసిపూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Wednesday, February 18, 2026
॥పల్లవి॥చాలదా మా జన్మము నీ-పాలింటివారమై బ్రతుకఁగఁ గలిగెopen॥చ1॥కమలాసనాదులు గానని నీపైమమకారము సేయ మార్గము గలిగెఅమరేంద్రాదుల కందరాని నీ-కొమరైన నామము కొనియాడఁ గలిగె॥చ2॥సనకాదులును గానఁజాలని నిన్నుఁతనివోవ మతిలోనఁ దలపోయఁ గలిగెఘనమునీంద్రులకు నగమ్యమైవున్న-నిను సంతతమును వర్ణింపఁగలిగె॥చ3॥పరమమై భవ్యమై పరిగిననీ-యిరవిట్టిదని మాకు నెఱుఁగంగఁ గలిగెతిరువేంకటాచలాధిప నిన్ను యీ-ధరమీఁదఁ బలుమారు దరిసింపఁ గలిగె రాగము: సామంతం రేకు: 0018-04 సంపుటము: 1-110 Tags: Annamacharya పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Wednesday, February 18, 2026
॥పల్లవి॥ఇందుకొరకె యిందరును నిట్లయిరికిందుపడి మఱికాని గెలుపెఱఁగరాదుfactus.dkread॥చ1॥అటమటపువేడుకల నలయించి మఱికదాఘటియించుఁ బరము తటుకన దైవముఇటు సేయ నీశ్వరున కీసు గలదా? లేదు.కుటిలమతిఁ గని కాని గుణిఁ గానరాదు॥చ2॥బెండుపడ నవగతులఁ బెనఁగించి మఱికదాకొండనుచుఁ బర మొసంగును దైవముబండుసేయఁగ హరికి బంతమా? యటుగాదు.యెండదాఁకక నీడహిత వెఱఁగరాదు॥చ3॥మునుప వేల్పులకెల్ల మ్రొక్కించి మఱికదాతనభ క్తి యొసఁగు నంతట దైవముఘనవేంకటేశునకు గపటమా? అటుగాదు.తినక చేఁదునుఁ దీపు తెలియనేరాదు. రాగము: మాళవిశ్రీ రేకు: 0002-05 సంపుటము: 1-11 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, […]పూర్తి వివరాలు ...