॥పల్లవి॥హరి నీయనుమతో అది నాకర్మమోపరమే యిహమై భ్రమయించీని॥చ1॥కలుగుదు శాంతము కటకట బుద్ధికిచలమున నింతాఁ జదివిననునిలువదు చిత్తము నీపై చింతకుపలుసంపదలను బరగినను॥చ2॥తగులదు వైరాగ్యధన మాత్మకునువొగి నుపవాసము లుండిననుఅగపడదు ముక్తి అసలనాసలజగమింతా సంచరించినను॥చ3॥విడువదు జన్మము వివేకముననేజడిసి స్వతంత్రము జరపిననుయెడయక శ్రీవేంకటేశ్వర నీవేబడిఁగాచితి విదె బ్రదికితి నేను రాగము: లలిత రేకు: 0088-05 సంపుటము: 1-433 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, లలితపూర్తి వివరాలు ...
॥పల్లవి॥తెలియక వూరక తిరిగేముచలమరి కగునా సంతతసుఖము॥చ1॥హేయము కడుపున నిడుకొని యింకా‘చీ’ యనని మాకు సిగ్గేదిపాయము పిడికిటఁ బట్టుచునుండేటికాయధారులకుఁ గలదా విరతి॥చ2॥అంగనల రతుల యాసలనీఁదేటియెంగిలిమనుజుల కెగ్గేదిముంగిట నార్గురుముచ్చులఁ గూడినదొంగగురుని కిందుల నిజమేది॥చ3॥జననమరణములు సరి గని కాననిమనుజాధమునకు మహిమేదియెనగొని శ్రీవేంకటేశు శరణ మిటుగని మనకుండిన గతి యిఁక నేది రాగము: సామంతం రేకు: 0088-04 సంపుటము: 1-432 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥సహజాచారములెల్లా సర్వేశ్వరునియాజ్ఞేఅహమించి నమ్మకుండు టదియే పాషండము॥చ1॥నిద్దిరించువానిచేతి నిమ్మవంటివలెనేచద్దికర్మములు తానే జారితే జారెపొద్దువొద్దు తనలోన భోగకాంక్ష లుండఁగానుఅద్దలించి కర్మ మొల్లననుటే పాషండము॥చ2॥కలగన్నవాడు మేలుకనినటువలెనేతలగి ప్రపంచ మెందో దాఁగితే దాగెయిల నీదేహము మోఁచి యింతా గల్లలనుచుపలికి తప్పనడచే భావమే పాషండము॥చ3॥ధర నద్దము చూచేటి తనరూపమువలెగరిమతో దనయాత్మ కంటేఁ గనెసరుస శ్రీవేంకటేశుసాకార మటు గనికరఁగి భజించలేని కష్టమే పాషండము రాగము: మలహరి రేకు: 0088-03 సంపుటము: 1-431 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఏమియుఁ జేయఁగవద్దు యింతలోనె మోక్షముదీమపువిజ్ఞానమే దివ్వెత్తు ఫలము॥చ1॥పాపచింత మదిలోన బారకుండా నిలిపితేచేపట్టి దానములెల్లా జేసినంత ఫలముకోపానలములోన కోరికలు వేల్చితేనేయేపున యజ్ఞాలు సేసి యేచినంత ఫలము॥చ2॥కనకముపై కాదని పోదొబ్బితేనేతనకు వేవేలు ఘోరతపముల ఫలమువనితలమోహములవలఁ బడకుండితేనేదినము గోటితీర్థాలు దిరిగినఫలము॥చ3॥శ్రీవేంకటేశ్వరు జేరి కొలుచుటేధావతిలేని యట్టితనజన్మ ఫలముభావించి యాచార్యపాదపద్మమూలమేసావధానమున సర్వశాస్త్రార్థఫలము రాగము: గుండక్రియ రేకు: 0088-02 సంపుటము: 1-430 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥వివేకమెఱఁగనివెఱ్ఱులముగాక నేముదివారాత్రము నిన్నే ద్రిష్టించవలదా॥చ1॥మానివోడ నమ్మి వొక్కమనుజుఁడు వార్ధి దాఁటినానార్థములు గూర్చి నటించఁగానుదానవారికృప నమ్మి తగినసంసారవార్థి-లోను చొచ్చి దాఁటి గెల్వ లోకులకుఁ జెల్లదా॥చ2॥జుట్టెఁడుయినుము నమ్మి సొరిది నొక్కఁడు భూమిఁగట్టిడిభయములెల్లఁ గడవఁగానునెట్టనఁ జక్రాయుధుని నిజనామ మిటు నమ్మితట్టి భవభయములు తరి దాఁటఁజెల్లదా॥చ3॥వేలెఁడుదీపము నమ్మి వెడఁగుఁజీఁకటిఁ బాసిపోలిమి నొక్కనరుఁడు పొదలఁగానుఆలించి శ్రీవేంకటేశుఁ డాత్మలో వెలుఁగగానుమేలి మాతనిఁ గొలిచి మెరయంగఁవలదా రాగము: బౌళి రేకు: 0088-01 సంపుటము: 1-429 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥పరిపూర్ణ గరుడాద్రి పంచాననంపరమంసేవే పంచాననం॥చ1॥క్రూరదంష్ట్రాగ్నికణఘోర పంచాననంపారీణచక్రధర పంచాననంవీర పంచాననం విజయ పంచాననంభారభూభారహర పంచాననం॥చ2॥దివిజపంచాననం తీవ్రనఖకాననంభవనాశినీతీర పంచాననంకువలయాకాశసంఘోష పంచాననంపవిశబ్దదంతరవ పంచాననం॥చ3॥శ్రీవేంకటాఖ్యఘనశిఖరి పంచాననంపావనం పంచముఖ పంచాననంసేవిత ప్రహ్లదసిద్ది పంచాననంభావితం శ్రీయుక్త పంచాననం రాగము: నాట రేకు: 0087-06 సంపుటము: 1-428 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, నాటపూర్తి వివరాలు ...
॥పల్లవి॥నా తప్పు లోఁ గొనవే నన్నుఁ గావవే దేవచేఁతలిన్నీ జేసి నిన్నుఁజేరి శరణంటిని॥చ1॥అందరిలో నంతర్యామివై నీవుండఁగానుయిందరిఁ బనులుగొంటి నిన్నాళ్ళునుసందడించి యిన్నిటా నీచైతన్యమై యుండఁగానువందులేక నేఁ గొన్నివాహనా లెక్కితివి॥చ2॥లోకపరిపూర్ణుఁడవై లోనా వెలి నుండఁగానుచేకొని పూవులుఁ బండ్లుఁ జిదిమితినికైకొని యీమాయలు నీకల్పితమై వుండఁగానుచౌకలేక నేవేరే సంకల్పించితిని॥చ3॥యెక్కడచూచిన నీవే యేలికెవై వుండఁగానుయిక్కడాఁ దొత్తుల బంట్ల నేలితి నేనుచక్కని శ్రీవేంకటేశ సర్వాపరాధి నేనుమెక్కితి నన్ను రక్షించు ముందెఱఁగ నేను రాగము: సాళంగనాట రేకు: 0087-05 సంపుటము: 1-427 Tags: Annamacharya Keerthanalu, Telugu […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥పట్టినచోనే వెదకి భావించవలెఁగానిగట్టిగా నంతర్యామి కరుణించును॥చ1॥యింటిలోనిచీఁకటే యిట్టే తప్పకచూచితేవెంటనే కొంతవడికి వెలుఁగిచ్చునుఅంటి కానరానితనయాతుమ తప్పకచూచు-కొంటేఁ దనయాతుమయు గొబ్బునఁ గాన్పించును॥చ2॥మించి కఠినపురాతిమీఁదఁ గడవ వెట్టితేఅంచెలఁ దానే కుదురై నయట్టుపొంచి హరినామమే యేపొద్దు నాలికతుదనుయెంచి తలఁచఁదలచ నిరవౌ సుజ్ఞానము॥చ3॥వొక్కొక్కయడుగే వొగి ముందరఁ బెట్టితేయెక్కువై కొండైనా నెక్కుఁ గొనకుయిక్కువ శ్రీవేంకటేశు నిటు దినదినమునుపక్కనఁ గొలిచితే బ్రహ్మపట్ట మెక్కును రాగము: బౌళి రేకు: 0087-04 సంపుటము: 1-426 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥శ్రీవేంకటేశుఁడు శ్రీపతియు నితఁడేపావనపు వైకుంఠ పతియును నితఁడే॥చ1॥భగవతములోఁ జెప్పే బలరాముతీర్ధయాత్రనాగమోక్తమైనదైవమాతఁ డితడేబాగుగా బ్రహ్మాండపురాణపద్ధతియాతఁ డితఁడేయోగమై వామనపురాణోక్తదైవ మీతఁడే॥చ2॥వెలయ సప్తరుషులు వెదకి ప్రదక్షిణములలరఁ జేసినదేవుఁడాఁతఁ డీతఁడేనెలవై కోనేటిపొంత నిత్యముఁ గుమారస్వామికలిమి దపముసేసి కన్నదేవు డీతఁడే॥చ3॥యెక్కువై బ్రహ్మాదులు నెప్పుడు నింద్రాదులుతక్కక కొలిచియున్న తత్వమీతఁడుచక్క నారదాదులససంకీర్తనకుఁ జొక్కినిక్కినశ్రీవేంకటాద్రి నిలయుఁడు నీతఁడే రాగము: బౌళి రేకు: 0087-03 సంపుటము: 1-425 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic […]పూర్తి వివరాలు ...