అందమైన ఆ పల్లె పిల్ల ఆకు వేసి, తమ్మ పుక్కిట పెట్టి చెంగావి రంగు సీర కట్టుకొని బుంగ తీసుకుని ఒయ్యారంగా నడుస్తూ నీటి కోసం ఏటికి వచ్చింది. ఏటి దగ్గర ఒక కొంటె కోనంగి సరదాపడి రాయి విసిరినాడు. ఆ రాయి గురి తప్పి ఆ గడుసు పిల్ల కడవకు తగిలి అది పగిలిపోయింది. ఆ పిల్ల రాయి విసిరిన పిల్లగాడిని నిలేసి ఇలా అడుగుతోంది… వర్గం: యాలపాట పాడటానికి అనువైన రాగం: ఆనందభైరవి స్వరాలు […]పూర్తి వివరాలు ...
అత్త కూతురుతో మనువు కుదిరింది మల్లన్నకు. ఆ చనువుతో మల్లన్న మరదలిని తనతో కోతకు రమ్మని పిలిచినాడు. పెళ్లి కాకుండా ఇద్దరం కలిసి తిరిగితే నిన్నూ, నన్నూ ఛీ కొడతారంది మరదలు. అందుకతడు నేను ధర్మం తప్పేవాన్ని కాదు అన్నాడు. ఎన్నో ఆశలు చూపినాడు. ఏది ఏమైనా పెళ్ళైన పెళ్లి తర్వాతనే నీ చేనంతా కోస్తానంటుంది. సున్నితమైన బావా మరదళ్ల సరసాలు ఈ పాటలో చూడండి. వర్గం: కోతల పాటలు పాడటానికి అనువైన రాగం: మాయామాళవ గౌళ […]పూర్తి వివరాలు ...
1997 ప్రాంతంలో ఒకసారి వేంపల్లెకు పోయినప్పుడు అక్కడి గ్రంథాలయంలో ‘సాహిత్యనేత్రం’ అని ఒక కొత్త పత్రిక కంటబడింది. మంచి కథలు, శీర్షికలు, కవితలు ఉన్న ఆ పత్రిక కడప నుంచి వెలువడుతోందని తెలిసి చాలా సంబరపడ్డాను. ఆ తర్వాత కడపకు పోయినప్పుడు నగర నడిబొడ్డైన ఏడురోడ్ల కూడలికి అతిసమీపంలో ఉన్న ఆ పత్రిక కార్యాలయానికి వెళ్ళి సంపాదకుడిని కలుసుకుని పాత సంచికలన్నీ తెచ్చుకున్నాను. ఆ సంపాదకుడు శశిశ్రీ. s తర్వాత అప్పుడప్పుడూ నేత్రం ఆఫీసుకు వెళ్తూ ఉండేవాడిని. […]పూర్తి వివరాలు ...
ఒకప్పుడు రామాయణ, భారత, భాగవత కథలు జానపదుల జీవితంలో నిత్య పారాయణాలు. వారికి ఇంతకంటే ఇష్టమైన కథలు మరేవీ ఉండవేమో! పితృవాక్య పరిపాలనకై శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతంగా అరణ్యాలకు వచ్చినాడు. ఆ సమయంలో భరతుడు అక్కడ లేడు. వచ్చిన తర్వాత జరిగిన ఘోరానికి బాధపడి తల్లి కైక దురాశను నిందించి అడవిలో అన్నను కలుసుకుంటాడు. భరతుని రాకకు సంతోషించిన రాముడు అయోధ్యలోని అందరి యోగక్షేమాలు అడిగినాడు. భరతుడు గుండెలవిసేట్లు ఏడుస్తూ తండ్రి చనిపోయిన విధం చెప్పి […]పూర్తి వివరాలు ...
సంసారమనే శకటానికి భార్యాభర్తలు రెండు చక్రాలు. ఆ రెండు చక్రాలలో దేనికి లోపమున్నా బండి నడవదు. దానిని సరిచేయటానికి ఒక మనిషంటూ అవసరం. సరసము విరసము కలబోసిన వారి సంభాషణ పాట రూపంలో… వర్గం: జట్టిజాం పాట పాడటానికి అనువైన రాగం: హిందుస్తాన్ తోడి రాగస్వరాలు (ఏకతాళం) భర్త: కసువు చిమ్మే నల్లనాగీ గురిగింజ గుమ్మడి భార్య: సిమ్మను పోరా సిమ్ముకో పోరా గురిగింజ గుమ్మడి భర్త: ఏయ్ తంతాన్ సూడె నల్లనాగీ గురిగింజ గుమ్మడి భార్య: […]పూర్తి వివరాలు ...
ఆకు అల్లాడ్డంల్యా గాలి బిగిచ్చింది ఉబ్బరంగా ఉంది ఊపిరాడ్డంల్యా ఉక్క పోచ్చాంది వంతు తప్పేట్లు లేదు వంక పారేట్లే ఉంది. పొద్దు వాల్తాంది మిద్దెక్కి సూచ్చనా వానొచ్చాదా రాదా? పదునైతాదా కాదా? అదును దాట్తే ఎట్లా? ఏడు పదుల కరువు పందికొక్కుల దరువు పంకియ్యని ప్రభువు ముదనష్టపు అప్పు ఉరితాళ్ళ బతుకు. అద్దద్దో…ఆపక్క మోడం ఎక్కొచ్చాంది ఆ మూల నుంచి కుమిల్లు కుమిల్లు నల్లగ కలయబారతాంది కొత్తమిట్ట కాడికొచ్చె దున్నంగి పంపుల్లో దిగబడే అబ్బీ……వచ్చరా….వానొచ్చరా…. మాంచి మోదుబ్బీ… […]పూర్తి వివరాలు ...
అనుమానపు మగడు ఆ ఇల్లాలిని ఎంతో వేధించాడు. విసిగించాడు. పాపం ఆ ఇల్లాలు అతని సూటిపోటి మాటలు భరించలేకపోయింది. సుక్కబొట్టు పెట్టినా, రంగుచీర కట్టినా, అద్దంలో చూసినా, సహించలేని తన భర్తను గురించి ఆమె ఇలా చెప్తోంది… వర్గం: జట్టిజాం పాట పాడటానికి అనువైన రాగం: శుద్ధ సావేరి స్వరాలు (దేశాది తాళం) సుక్కబొట్టు పెట్టనీడు సుట్టాల సూడనీడు ఎన్నాళ్ళు కాయిలుంటడో ఈనాకుసించ ఎన్నాళ్ళు కాయిలుంటడో పచ్చబొట్టు పెట్టనీడు పసుపుసీరె కట్టనీడు ఎన్నాళ్ళు కాయిలుంటడో ఈనాకుసించ ఎన్నాళ్ళు […]పూర్తి వివరాలు ...
క్రీ.శ.17 వ శతాబ్దం నుండి ఈ జిల్లాను మహమ్మదీయులు ఆక్రమించుకున్నారు. అప్పటినుంచి సిద్ధవటం, గండికోట, కడప ప్రాంతాలు ‘మయానా నవాబుల’ అధీనంలో ఉండేవి. వీరి పాలనా ప్రభావంవల్ల కొన్ని గ్రామనామాలు, వాడుక పదాలు ఉర్దూ భాషకు లోనైనాయి. ఇప్పటికీ ఈ జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు వారి పేర్లే నిలిచిపోయాయి. ఉదాహరణకు ఖాజీపేట, ఇబ్రహీంపేట, సాలాబాద్. నేక్నామ్ఖాన్ పేరుమీద ఏర్పడిన నేక్నామాబాద్ ఇప్పటి కడప. ఈ జిల్లాలో ‘మల్లయుద్ధం’ వంటి క్రీడల్ని నేర్చుకునే స్థలాలను ఇప్పటికీ ‘తాలెం కొట్టం’ […]పూర్తి వివరాలు ...
గంజి కరువు దిబ్బ కరువు ధాతు కరువు డొక్కల కరువు నందన కరువు బుడత కరువు ఎరగాలి కరువు పెద్దగాలి కరువు పీతిరి గద్దల కరువు దొర్లు కరువు కరువులకు లేదిక్కడ కరువు ఎండిపోయిన చెట్లు బండబారిన నేలలు కొండలు బోడులైన దృశ్యాలు గుండెలు పగిలిన బతుకులు ఇదే అనాదిగా కనిపిస్తున్న రాయలసీమ ముఖ చిత్రం దగాపడిన దౌర్భాగ్యులకు ఈ నేల నెలవైంది వంచించబడి వధ్యశిల నెక్కడం ఇక్కడ మామూలైపోయింది ఈ అధవసీమ ముఖంపై ఎవడో ఎక్కడివాడో […]పూర్తి వివరాలు ...