ఒంటిమిట్ట: వాస్తు రీత్యా దక్షిణద్వారం అనర్థదాయకం కావడంతో కోదండ రామాలయ దక్షిణ ద్వారాన్ని మూసి వేయాలని జిల్లా సర్వోన్నత అధికారి కేవిరమణ అధికారులకు సూచించారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను శనివారం జిల్లాకలెక్టరు కేవీ రమణ పరిశీలించారు. కల్యాణం నిర్వహించే ప్రదేశాన్ని పరిశీలించారు. బ్రహ్మోత్సవాల సమయంలో బారికేడ్లతో భక్తులకుఇబ్బందులు కలగకుండా పటిష్టమైన వరుసలు ఏర్పాటు చేయాలని అధికారులకు చెప్పారు. కల్యాణం నిర్వహించే ప్రాంత వంకను పూడ్చాలని జెడ్పీవైస్‌ఛైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి కలెక్టరు సూచించారు. ప్రస్తుతం సమయంతక్కువగా […]పూర్తి వివరాలు ...
కడప: జనవిజ్ఞానవేదిక కడప జిల్లా కమిటీ ప్రచురించిన ‘కూల్‌డ్రింక్స్ మానేద్దాం.. సహజ పానీయాలే తాగుదాం’ అన్న కరపత్రాలను ఇన్‌ఛార్జి జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి అరుణ సులోచనాదేవి శుక్రవారం జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోషక విలువలు లేని, అనారోగ్య సమస్యలు సృష్టించే శీతల పానీయాలను తాగడం మానేయడం మంచిదన్నారు. శీతల పానీయాల్లో అదనపు క్యాలరీలు స్థూలకాయానికి దారితీస్తాయన్నారు. వాటిని ఎక్కువకాలం తాగితే మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువన్నారు. చిన్నారులు శీతలపానీయాలు తాగకుండా తల్లిదండ్రులు నిరుత్సాహపరచాలని […]పూర్తి వివరాలు ...
ఒంటిమిట్ట : కోదండరాముని కల్యాణాన్ని ఏప్రిల్ 2న గవర్నర్ నరసింహన్ చేతులమీదుగా నిర్వహిస్తామని దేవాదాయశాఖ సహాయ కమిషనరు శంకర్‌బాలాజీ చెప్పారు. శుక్రవారం ఒంటిమిట్టలో పాత్రికేయులతో మాట్లాడుతూ… చేత్తో ఒలిచిన బియ్యం గింజలతో సీతారాముల తలంబ్రాల కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆయన తెలిపారు. చేత్తో ఒలిచిన బియ్యం గింజలను చుట్టుప్రక్కల గ్రామస్థులు 27 వరకూ తెచ్చి ఇవ్వవచ్చునన్నారు. ఈ ఏడాది నూతనంగా ప్రవేశ పెట్టే ఈ ఆచారాన్ని విజయవంతం చేయాలన్నారు. కల్యాణంలో పాల్గొనదలచిన 25లోగా భక్తులు రూ. వెయ్యి చెల్లించి […]పూర్తి వివరాలు ...
మైదుకూరు: కడప జిల్లాకు చెందిన హరికథ, బుర్రకథ, యక్షగాన కళాకారుడు కొండపల్లి వీరభద్రయ్య భాగవతార్‌ను ప్రభుత్వం జానపద కళల విభాగంలో హంస (కళారత్న) పురస్కారానికి ఎంపిక చేసింది. ఉగాది సందర్భంగా తుళ్లూరులో నిర్వహించే ఉగాది సంబరాల్లో వీరభద్రయ్య పురస్కారంతో పాటు రూ.50 వేల నగదు బహుమతిని అందుకోనున్నారు. ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ విభాగాలలో 32 మంది కళాకారులకు హంస పురస్కారాలను, 67 మందికి ఉగాది పురస్కారాలనూ, బాలాంత్రపు రజనీకాంతరావుకు ‘తెలుగు వెలుగు విశిష్ట పురస్కారం’ను […]పూర్తి వివరాలు ...
ఒంటిమిట్ట : కోదండరాముని పెళ్లి ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తామని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ తెలిపారు. స్థానిక కోదండ రామాలయాన్ని బుధవారం ఆయన పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఒంటిమిట్ట కోదండ రామాలయ సంప్రదాయాల ప్రకారం అన్ని కార్యక్రమాలు యధావిధిగా కొనసాగుతాయని తెలిపారు. ఆలయంలో కల్యాణం ఎప్పటిలాగానే రాత్రి సమయంలో నిర్వహిస్తామన్నారు. ఒంటిమిట్ట కోదండ రామాలయం, శ్రీశైలం, కాణిపాకం, శ్రీకాళహస్తి, తిరుపతి, తిరుమలను ఒక సర్క్యూట్‌గా ఏర్పాటు చేసి పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరుస్తామన్నారు. […]పూర్తి వివరాలు ...
కడప : జిల్లా వ్యాప్తంగా వివిధ రకాల పరిశ్రమల స్థానకు 44 దరఖాస్తులు వచ్చాయని.. అందులో 33 దరఖాస్తులకు కమిటీ అనుమతిని ఇచ్చిందని మంగళవారం తన కార్యాలయంలో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ రమణ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఎనిమిది దరఖాస్తులకు సంబంధించి అదనపు సమాచారం కోరాలని సూచించారు. మరో మూడు దరఖాస్తులపై అధికారులు చర్చించి నిర్ణయం తీసుకుంటారన్నారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఔత్సాహికులు చేసుకున్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ వెంకటరమణ అన్నారు. […]పూర్తి వివరాలు ...
బడ్జెట్లో అరకొర కేటాయింపులు జలయజ్ఞానికి సంబంధించి ఇప్పటికే సాగునీరు పుష్కలంగా అందుతున్న కృష్ణా డెల్టా మీద అలవికాని ప్రేమ ప్రదర్శించిన ప్రభుత్వం ఆరుతడి పంటలకూ నోచుకోక కరువు బారిన పడ్డ సీమపైన వివక్షను కొనసాగించింది. నిరుడు రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు కేటాయింపులు జరపడంలో వివక్ష చూపిన ఆం.ప్ర ప్రభుత్వం ఈ ఏడాది కూడా ఆ విధానాన్ని కొనసాగించి తన ప్రాధమ్యాన్ని చెప్పకనే చెప్పింది. రాయలసీమలోని భారీ సాగునీటి పథకాలు అన్నిటికీ కలిపి ఎప్పుడో పూర్తయి నిర్వహణలో ఉన్న […]పూర్తి వివరాలు ...
కడప: జిల్లా కలెక్టర్ కేవీ రమణ వ్యవహార శైలిపై అఖిలపక్షం నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రాజ్యాంగ బద్ధంగా పని చేయని ఆయన ఈ జిల్లా కలెక్టర్‌గా అర్హులు కారని పేర్కొన్నారు. కడప నగరంలోని వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ జయశ్రీ అధ్యక్షతన రౌండు టేబుల్ సమావేశం నిర్వహించారు. వైకాపా, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, కార్మిక సంఘం నేతలు జిల్లా కలెక్టర్ తీరుపై మండిపడ్డారు. గతంలో పని చేసిన […]పూర్తి వివరాలు ...
కడప: “అన్ని జిల్లాల్లో ఉన్నట్లు ఇక్కడ పరిశ్రమలు లేవు, పరిశ్రమలు స్థాపించేందుకు అనువైన వాతావరణం జిల్లాలో లేదు. పెట్టుబడి పెట్టేటప్పుడు పారిశ్రామిక వేత్తలు అనువైన పరిస్థితులను ఎంచుకుంటారు. భూములు ఇస్తామన్నా ఇక్కడ పరిశ్రమలు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇక్కడి వారికి ఆవేశం ఎక్కువ అనే అభిప్రాయం ఉంది. ఆ కారణంగానే భయపడుతున్నారు. అంతే తప్ప జిల్లాపై ఎలాంటి రాజకీయ వివక్ష లేదు. జిల్లాలో ఆస్పత్రుల ఏర్పాటు, తాగునీటి పథకాల్లో కూడా రాజకీయాలు చేస్తున్నారు.” అని […]పూర్తి వివరాలు ...