రాయలసీమ హక్కుల కోసం ముక్తకంఠంతో ముందడుగు వేయాల్సిన సమయం ఆసన్నమైంది. సీమకు న్యాయం జరిగిన తరువాతనే విడిపోవడమైనా, కలిసి ఉండటమైనా అని ఎలుగెత్తిచాటాలి. రాష్ట్ర విభజనకు రంగం సిద్ధమవుతున్న ప్రస్తుత సందర్భంలో అప్రమత్తత తప్పనిసరి. కేంద్ర ప్రభుత్వానికి సీమ స్థానీయత సెగ తగలాలి. ఆ వైపుగా సీమ ప్రజలంతా కదం తొక్కాలి. రాష్ట్రంలో అన్ని రంగాలలో చిన్నచూపునకు గురైన ప్రాంతం రాయలసీమ. 1953-1956 ఆది గా అన్యాయాలను అడుగడుగు నా అనుభవిస్తున్నప్పటికీ అంద రం కలిసే అభివృద్ధి […]పూర్తి వివరాలు ...
యువరాజా వారు నిద్ర లేచారు. అదేంటోగానీ రాత్రుళ్ళు ఎంతసేపు నిద్రపోయినా వారికి లేచేసరికి బద్ధకంగానే ఉంటుంది. బలవంతాన లేచినా రోజంతా ఏం చెయ్యాలో తోచిచావదు. నాన్నగారు పోయిన తర్వాత ఒక ప్రయోగం చేసి చేతులు కాల్చుకున్నప్పట్నించి నోరూవాయీలేనివాడొకణ్ణి ప్రధానమంత్రిగా పెట్టుకుని రాజ్యవ్యవహారాలు అమ్మగారే దగ్గరుండి చూసుకుంటున్నారు. ఆ వ్యవహారాల్లో ఒక్కటీ తన బుర్రకెక్కి చావవు. పరివారమూ, వందిమాగధులు మాత్రం తననే సింహాసనం మీద కూర్చోమంటారు, అమ్మేమో ఇంకా సమయం రాలేదంటుంది. ఈలోగా కొరుక్కుతినడానికి గోర్లు కూడా మిగల్లేదు. […]పూర్తి వివరాలు ...
(18.05.1931 – 04.08.2013) న్యాయవాద వృత్తిలో విలువలు, నీతి నిజాయితీల కోసం పాటుపడిన అరుదైన న్యాయవాది పద్మనాభరెడ్డి. న్యాయవాదులు వృత్తి విలువల కోసం నిలబడితే ప్రజల హక్కులు కాపాడవచ్చునని నిరూపించారు. కేసులను క్షుణ్ణంగా అధ్యయనం చేయడం, అవసరమైతే ఉచితంగానే వాదించడం, వామపక్ష ఉద్యమాల వైపు మొగ్గు చూపడం, అండదండలు ఇవ్వడం, ప్రభావాలకు లొంగకపోవడం ఆయన నుంచి అందరూ నేర్చుకోవాలి. హైకోర్టు సీనియర్ న్యాయ వాది సి.పద్మనాభరెడ్డి మృతితో ప్రజా ఉద్యమాలకు అండదం డలందించే గొప్ప మానవతావా దిని […]పూర్తి వివరాలు ...
నెహ్రూ వారసులు మొదలెట్టిన ఆట చివరి అంకానికి చేరింది. రాష్ట్ర విభజన రెండుముక్కలాటే అని కాంగ్రెస్ అధినేత్రి ఏకపక్షంగా తేల్చేశారు. ఆ మధ్య ఒక వ్యాసంలో సీనియర్ పాత్రికేయులు ఎం.జె. అక్బర్ చెప్పినట్లు దేశం సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నపుడు, ప్రభుత్వం విఫలమైనపుడు వాటి తాలూకు ప్రతిస్పందనలు, ఆందోళనలు జనబాహుళ్యం పైన ప్రభావం చూపుతున్నదని తెలిసిన మరుక్షణం, అదీ ఎన్నికలకు సిద్దమవుతున్న సందర్భంలో వాటిని పక్కదారి పట్టించడానికి మూలన పడిన నిర్ణయాలను, బిల్లులను ఏకబిగిన బయటకు తీసి విన్యాసం […]పూర్తి వివరాలు ...
ఎట్టకేలకు తెలంగాణ గొడవకు తెరదించే పనికి కాంగ్రెస్ పూనుకుంది. ఇది ఆ ప్రాంత ప్రజా పోరాట ఫలం. వారికి ధన్యవాదాలు! కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పేర్కొన్న సీమకు కృష్ణా నికరజలాల కేటాయింపు హామీ ఏమైంది? ఈ సందర్భంలో విడిపోయే రాష్ట్రంలో సీమ వాసులు కలిసుంటే మిగిలేది మట్టే. రాయలసీమ అస్తిత్వం కొనసాగాలన్న ఇక్కడ సాగు, తాగు నీరు కావాలన్న ప్రత్యేక రాయలసీమే శరణ్యం. దీనికోసం పాలకులు, ప్రజలు ఉవ్వెత్తున ఉద్యమించాల్సిన తరుణమిది. రాయలసీమ ఎలా వంచనకు గురైంది […]పూర్తి వివరాలు ...
నిన్ననే రెండో విడత పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. నిన్న రాత్రి పొద్దు పోయే వరకు పాత్రికేయ మిత్రులు ఎన్నికల ఫలితాలను సేకరించి పార్టీల వారి మద్దతుదారులను లెక్కించే పనిలో ఉండగా, సంపాదకులు, బ్యూరో చీఫ్ లు క్షేత్ర స్థాయి నుండి అందిన సమాచారాన్ని క్రోడీకరించి జిల్లా స్థాయి లేదా రాష్ట్ర స్థాయి బ్యానర్ కథనాన్ని తయారు చేశారు. ఇవాళ ఉదయం ఆయా పత్రికలలో వెలువడిన కథనాలు చెప్పింది ఒక్కటే .. ‘వైకాపా హవా తగ్గిందీ’ అని. నేరుగా […]పూర్తి వివరాలు ...
కేతు విశ్వనాథరెడ్డి గురించి సొదుం జయరాం “జ్ఞాపకశక్తికీ నాకూ చుక్కెదురు. విశ్వం, నేనూ ఎప్పుడు దగ్గరయ్యామో నాకు సరిగ్గా గుర్తు లేదు. ఇద్దరం ప్రొద్దుటూరు మునిసిపల్ హైస్కూల్లో చదువుకున్నాం. కానీ ఆ రోజుల్లో మా ఇద్దరికీ స్నేహం అయినట్టు లేదు. నేను ఇంటర్మీడియేట్ చదువుతున్న రోజులలో రా.రా గారు కడపకొచ్చారు. ఆయన ఎక్కడెక్కడి వాళ్ళను ఒకచోట చేర్చారు. గజ్జల మల్లారెడ్డి, కేతు విశ్వనాధరెడ్డి, ఆర్వీఆర్, రామప్ప, బండి గోపాల్ రెడ్డి, వై.సి.వి.రెడ్డి, కుప్పిరెడ్డి పద్మనాభరెడ్డి, గోవిందరెడ్డి, రామ్మోహన్ […]పూర్తి వివరాలు ...
తెలంగాణకు చెందిన ఆర్ విద్యా సాగర్ రావు కేంద్ర జలసంఘం చీఫ్ ఇంజనీర్ గా పని చేసి పదవీ విరమణ పొందారు. వారు మంచి మేధావి, వక్త కూడా. వివిధ పత్రికలకు వ్యాసాలు రాయడంలోనూ సిద్ధహస్తులు. వారు ఈ మధ్య సినిమాలలో నటిస్తున్నారు కూడా. తెరాసకు సలహాదారుగా కూడా వారు వ్యవహరిస్తున్నారు. రావు గారు ‘నమస్తే తెలంగాణా’ దిన పత్రికలో నీళ్ళు నిజాలు అని ఒక శీర్షిక నిర్వహిస్తున్నారు. ఈ శీర్షికలో వారు రాసిన వ్యాసాలలో సీమపై […]పూర్తి వివరాలు ...
రాష్ట్రంలో ఒక విచిత్రమైన రాజకీయ పరిస్థితి నెలకొంది.ఆమాటకు వస్తే అన్ని విషయాలలోను పరస్పర వైరుధ్యాలతో మన సమాజం కొట్టుమిట్టాడుతోంది. అవినీతికి వ్యతిరేకంగా పోరాటాన్ని నెత్తికెత్తుకుని లబ్ది పొందాలని చూస్తున్న కొందరు రాజకీయ నాయకులు తామే హజారే తర్వాత హజారేలమంటూ బాగానే హడావుడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. పనిలో పనిగా అవినీతి నిర్మూలనకు కరెన్సీ నోట్లు రద్దు చేయాలంటూ పాటలు మొదలు పెట్టారు.పాపం ఈ ఆలోచన రిజర్వ్ బ్యాంకు వారికి కానీ ఆర్ధిక వేత్త అయిన మన ప్రధానుల వారికి కానీ […]పూర్తి వివరాలు ...