వైఎస్ జగన్ హయాంలో కడప అభివృద్ధి జగన్ గా చిరపరిచితుడైన కడప జిల్లాకు చెందిన యెడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి (దివంగత యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి గారి కుమారుడు) 30/05/2019 నుండి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కడప జిల్లాకు మంజూరు చేసిన/చేయించిన కొన్ని అభివృద్ది పనులు … విద్యారంగం : సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా రిమ్స్ విస్తరణ ప్రదేశం : కడప నగరం అంచనా […]పూర్తి వివరాలు ...
ఈ ఊరున్న తావులో కుందేళ్ళ పైకి యాటకుక్కను ఇడిసిపెడితే ఆ యాటకుక్కపైన కుందేళ్లు తిరగబడినాయంట. ఈ తావు శౌర్యం కలిగినదని భావించి ఇక్కడ ఊరు కట్టించగా దానికి 'పోట్లదుర్తి' అనే పేరు పొందిందట.పూర్తి వివరాలు ...
ముత్తులూరుపాడు (ఆంగ్లం : Muttulurupadu or Muthulurupadu) – కడప జిల్లా ఖాజీపేట మండలంలోని ఒక ఊరు. ఈ ఊరు ఖాజీపేట, మైదుకూరుల నడుమ చిత్తూరు – కర్నూలు జాతీయ రహదారి పై నుండి 2 కి.మీల దూరంలో ఉంది. స్థానికులు ఈ ఊరి పేరును ‘ముత్తులపాడు’ లేదా ‘ముత్తులుపాడు’ అని కూడా వ్యవహరిస్తుంటారు. ఊర్లో పోస్టాఫీసు, రెండు మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలు, పశువైద్యశాల ఉన్నాయి. ముత్తులూరుపాడులో వివిధ కులాలకు, మతాలకు చెందిన ప్రజలు కలిసిమెలిసి […]పూర్తి వివరాలు ...
నంద్యాలంపేట (English: Nandyalampeta) – వైఎస్‌ఆర్ జిల్లా, మైదుకూరు మండలానికి చెందిన ఒక పల్లెటూరు. ఈ ఊరు మైదుకూరు – బద్వేలు రహదారిపైనున్న ‘గుడ్డివీరయ్య సత్రం’ సమీపంలో ఉంది. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం ఈ గ్రామం 2856 ఇళ్లతో, 11457 మంది జనాభాతో 5090 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 5900, ఆడవారి సంఖ్య 5557. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 3230 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 463. నంద్యాలంపేట గ్రామంలో ప్రధాన […]పూర్తి వివరాలు ...
పెద్దముడియం కడప జిల్లాలోని ఒక మండల కేంద్రం. చాళుక్య సామ్రాజ్య స్థాపకుడు విష్ణువర్ధనుడు పుట్టిన ఊరు మన కడప జిల్లాలో ఉందని తెలుసా ? ఒక సారి పెద్దముడియం గ్రామం చరిత్ర చూడండి. పూర్వం త్రిలోచన మహారాజు ( ముక్కంటి కడువెట్టి ) గంగానదిలో స్నానం చేయడానికి కాశీ నగరానికి వెళ్ళినపుడు, చాలా మంది బ్రాహ్మణులు రాజు సహాయార్థం వేచి ఉంటారు. రాజు స్నానాదికాలు పూర్తి చేసుకున్న తర్వాత వారికి దానాలు చేస్తు ఉన్నపుడు, 18 గోత్రాలకి సంబధించిన […]పూర్తి వివరాలు ...
*అత్తిరాల పరశురామేశ్వర ఆలయం – తమిళ పాలన *అత్తిరాలలోని పరశురామేశ్వర ఆలయం ప్రాంగణంలో గోడలపై ఏడు తమిళ శాసనాలు తంజావూరు చోళుల పాలనకు తార్కాణం గా నిలుస్తున్నాయి. క్రీ.శ. 11 వ శతాబ్దంలో రాజరాజ చోళ -3 అత్తిరాల ఆలయాన్ని అభివృద్ధి చేసాడు. ఆలయ నిర్మాణం అంతకుముందే జరిగి ఉండవచ్చుననే అభిప్రాయం కూడా ఉంది. * ఈ ప్రాంతం అధిరాజేంద్రచోళ మండలంగా, ‘మేల్పాకనాడు’ గా పిలువబడుతూ ఉండేదని ఈ శాసనాలవల్ల తెలుస్తోంది. అప్పట్లో అత్తిరాలను ‘తిరువత్తూరు’ పిలిచేవారని […]పూర్తి వివరాలు ...
దండనాయకుడిని హతమార్చిన పెద్దపసుపుల ప్రజలు పశ్చిమ చాళుక్య రాజైన త్రైలోక్యమల్ల మహారాజు కళ్యాణీ పట్టణాన్నిరాజధానిగా చేసుకుని గండికోటసీమతో సహా పాలన చేస్తున్న (క్రీ.శ.1064) కాలంలో కటకచంద్రనాయకుడు అనే దండనాథుడు జమ్మలమడుగు ప్రాంత రాజ్యపాలనను పర్వవేక్షించేవాడు. ఈ నేపథ్యంలో పెద్దపసుపుల, దానవులపాడు గ్రామాల మధ్య పొలిమేర తగాదా తలెత్తింది. ఇది రెండు గ్రామాల ప్రజల మధ్య పోరాటానికి దారి తీసింది. ఈ విషయం త్రైలోక్యమల్ల మహారాజు దృష్టికి వెళ్ళింది. దీంతో రాజు ఈ తగాదాను పరిష్కరించాల్సిందిగా కటకచంద్ర దండనాయకున్ని […]పూర్తి వివరాలు ...
భారతీయ సంస్కృతిలో సూర్యారాధనకు ఉన్న ప్రాధాన్యత అమితమైనది. కోణార్క్ లోని సూర్యదేవాలయాన్ని ఇందుకు ప్రతీకగా చెప్పుకుంటాం. మన రాష్ట్రంలో ‘అరసవెల్లి’ సూర్య దేవాలయం కూడా బహుళ ప్రాచుర్యం పొందింది. రాయలసీమలో సైతం సూర్యారాధనకు విశిష్ట ప్రాధాన్యత ఉందని చెప్పడానికి అనేక చోట్ల సూర్య దేవాలయాలు ఉన్నాయి. ‘తిరుచానూరు’లోని సూర్య నారాయణ దేవాలయం,ఉరవకొండ సమీపం లోని ‘బూదగవి’ సూర్యనారాయణ ఆలయం, భక్తుల పూజలను అందుకుంటున్నాయి. కడప జిల్లా ఎర్రగుంట్ల సమీపంలోని “నిడుజువ్వి” లో ఈ సూర్య విగ్రహం ఉంది. […]పూర్తి వివరాలు ...
కమలాపురం సమీపం లోని పెద్దచెప్పలి గ్రామంలో వెలసిన పురాతన దేవలాలకు ఎంతో విశిష్టమైన చరిత్ర ఉంది. అగస్త్యేశ్వర ఆలయం ఇక్కడి కామాక్షి సహిత అగస్త్యేశ్వర ఆలయాన్ని క్రీస్తు శకం 6వ శతాబ్దంలో రేనాటి చోళరాజైన పుణ్యకుమారుడు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఆయన పెద్దచెప్పలిని రాజధానిగా చేసుకుని తన రాజ్యాన్ని పాలించాడు. తన శాసనాలన్నింటినీ తెలుగులోనే వాడాడనటానికి అగస్త్యేశ్వరాలయంలోని స్తంభాలకు చెక్కబడిన తెలుగు శాసనాలే నిదర్శనం. ఇక్కడి ఆలయంలోని మూలవిగ్రహాలను అగస్త్యముని ప్రతిష్ఠించినట్లు మాలేపాడు శాసనం ద్వారా తెలుస్తోంది. […]పూర్తి వివరాలు ...