అప్పుదెచ్చి కవులకిచ్చును, తప్పక ఋణదాతకిచ్చు తానేమగునో – ఉప్పలపాటి వెంకట నరసయ్య భావకవితోద్యమ స్రవంతి వొరిగి పొరిలేవేళ రాయలసీమలో ”తొలకరి చినుకులు” కురిపించి, సెలయేరై విజృంభించి సంగమింప చేసిన అభ్యుదయ కవితావేశ మూర్తి వైసివిరెడ్డి. వైసివి రెడ్డిగా తెలుగు సాహితీ లోకానికి పరిచితుడైన ఎమ్మనూరు చినవెంకటరెడ్డి – కడపజిల్లా పులివెందుల సమీపంలోని బోనాల గ్రామంలో 14-2-1924న జన్మించారు. తండ్రి కొండారెడ్డి పెద్దరైతు. పిల్లలను వేకువనేలేపి అమరకోశం, ఆంధ్రనామ సంగ్రహం వల్లెవేయించి భారత, భాగవతాల్లోని పద్యాలు వినిపించేవారు. గ్రామంలో […]పూర్తి వివరాలు ...
సెగమంటలు కథ మాల ఓబులేసు నీరసంగా రిక్షా తోసుకుంటూ వచ్చి తన ఇంటి ముందాపాడు. ఇల్లంటే ఇల్లు కాదది బోద వసారా. పేరుకు మాత్రం చుట్టూ నాలుగు మట్టిగోడలుంటాయి. ఆ నాలుగు గోడలు కూడబలుక్కొని కూడా ఆ ఇంకో మంచి కొట్టం రూపైనా ఇవ్వలేక పోతున్నాయి. ఓబులేసు ఇంటికాడ రిక్షా ఆపుతూనే బిలబిల మంటూ అతని ఆరుగురు సంతానం వచ్చి చుట్టేశారు. ”నాయన! నాయన! “ ”య్యా! యేందే సీదర పొండి” కసిరాడు ఓబులేసు. అతని భార్య […]పూర్తి వివరాలు ...
జీవితంలో ముందు ముందు ఎవరిదారి వాళ్ళదనుకున్నాము. నలుగురం ఎప్పుడైనా, ఎక్కడైనా కలవడం కూడా అంత సాధ్యం కాదేమో అని నిరుత్సాహపడ్డాము. కాన్పూరు ఐ.ఐ.టిలో బి.టెక్ చదివిన నాలుగేళ్లూ ఎంతో ఆత్మీయంగా గడిచాయి. ఆ తర్వాత ఉద్యోగరీత్యా ఒకచోట పనిచేసే అవకాశం వస్తుందని ఎవరూ కలగనలేదు. అబ్దుల్లాది జమ్ము, సేతు మాధవన్ది తంజావూరు, దేశపాండేది పూనా, నాదేమో తెనాలి. నలువురం ఒకే దేశంలోని వాళ్ళమే. అయినా ఉద్యోగాల విషయంగా ఎవరు ఎక్కడుంటామో తెలియదు. అయితే, నిజం ఊహకంటే గొప్పది. […]పూర్తి వివరాలు ...
“ఉత్తరాన ఒక వాన ఉరిమి కురవాల దక్షిణాన ఒక వాన దాగి కురవాల పడమరా ఒక వాన పట్టి కురవాల తూర్పున ఒక వాన తుళ్ళి కురవాల…” పాట సాగిపోతూ వుండాది. పాట ప్రవహిస్తా వుండాది. పాట పరవళ్ళు తొక్కుతా వుండాది. పాట పరవశిస్తా ఆడతా వుండాది. తెల్లటి ఆకాశం మీద నల్లటి మోడాలు కమ్ముకుంటా వుండాయి. మోడాలు మోడాలు పెనవేసుకొని అల్లుక పోతా వుండాయి. ఒకదానికొకటి చేతులు పట్టుకొని కదలి వస్తా వుండాయి. కదలి… కదలి.. […]పూర్తి వివరాలు ...
గండికోట చెన్నకేశవుని స్తుతించిన అన్నమయ్య సంకీర్తన చెన్నకేశవుని యెడల అపారమైన భక్తిప్రపత్తులు కలిగిన అన్నమయ్య తన కీర్తనలలో ఆ స్వామిని స్తుతించి తరించినాడు. విజయనగర సామ్రాజ్య కాలంలో వేలుగులీని హైందవ సంప్రదాయానికీ, సంస్కృతికీ ప్రతీకగా నిలిచిన గండికోటలో చెన్నకేశవుని ఆలయం ఒకటి ఉండేది. ఈ ఆలయాన్ని దర్శించిన అన్నమయ్య ఇక్కడి చెన్నకేశవుడిని ఈ విధంగా స్తుతిస్తున్నాడు… రాగం: సామంత కీర్తన సంఖ్య: ౩౧౪(314), ౨౭ (27) వ రాగి రేకు పల్లవి: చీరలియ్యగదవోయి చెన్నకేశవా! చూడు చేరడేసి కన్నుల వో చెన్నకేశవా […]పూర్తి వివరాలు ...
రా.రా .గా ప్రసిద్ధుడయిన విమర్శకుడూ, సంపాదకుడూ, కథకుడూ, అనువాదకుడూ సిసలయిన మేధావీ – రాచమల్లు రామచంద్రారెడ్డి (1922-88) హృదయమున్న రసైకజీవి! స్వపరభేదాలు పాటించని విమర్శకుడు. పిసినారి అనిపించేటంత పొదుపరి కథకుడు. ముళ్లలోంచి పువ్వులను ఏరే కళలో ఆరితేరిన సంపాదకుడు. మూలరచయిత మనసును లక్ష్యభాషలోని పాఠకుడికి సమర్థంగా చేర్చిన అనువా దకుడు. అక్షరాంగణంలో నిలువెత్తు విగ్రహాలుగా పాతుకు పోయిన ‘ప్రముఖుల’ గుట్టురట్టు చెయ్యడానికి క్షణమాత్రం జంకని విగ్రహ విధ్వంసి. ఒక్కమాటలో చెప్తే- మూడున్నర దశాబ్దాల సాహిత్య జీవితంలో ఒక […]పూర్తి వివరాలు ...
పైన ఫ్యాను తిరుగుతోంది. తిరిగేది చిన్నగే అయినా కిటకిటా మంటూ శబ్దం పెద్దగా వస్తోంది. ఆ ఫ్యాను గాలిని ఏమాత్రం లెక్కచేయకుండా ఈగలు బొయ్యిమంటూ అటూ ఇటూ తిరుగుతున్నాయి. నట్టింట్లో కాళ్లు బార్లా చాపుకుని దిగులుగా కూచోనుంది జమ్రూత్. “పెద్దోడు తిరిగొచ్చాడని పెద్దాసుండ్యా…” అంది ఉన్నట్టుండి. “ఇప్పుడు ఆ ఆసకు ఏమైంది?” అన్నట్టు చూశాడు పక్కనే ఎర్రటి వైరు మంచంపై కూర్చొని ఉన్న ఆమె కొడుకు గౌస్. “ఆ పావురం వొచ్చినట్టే నా బిడ్డకూడా వొచ్చాడనుకొంటి” అంది […]పూర్తి వివరాలు ...
ఇన్నేళ్లైనా నా జ్ఞాపకాలనుండి జుట్టుమామ తొలగిపోలేదు. ఎప్పుడూ కాకపోయినా, సినిమానుండి తిరిగొచ్చే సమయంలో తప్పకుండా గుర్తొస్తాడు. గుర్తుకొస్తే మనసు బరువెక్కుతుంది. ఏదో అపరాధం చేసిన భావన నన్ను వెంటాడుతుంది. నేను చేసిన తప్పు ఇదీ అని ఇదమిత్తంగా తేల్చుకోనూలేను; దులిపేసుకుని నిశ్చింతగా ఉండనూలేను. అప్పట్లో నాది తప్పూ, నేరం తెలిసిన వయసేగాదు. అతడు చనిపోయేనాటికి నా వయసు ఎనిమిదేండ్లు.పూర్తి వివరాలు ...
పాలకంకుల శోకం కథ ఎదురుగా బడి కన్పించగానే గుర్తొచ్చింది కృష్ణకు – తను ఇంటివద్దనుంచి బయల్దేరేటపుడు ఈ దారిన రాకూడదనుకొంటూనే పరధ్యానంగా వచ్చాడని. సందులో దూరి పోదామనుకొన్నాడు గాని లోపల్నించి రమణసార్ చూడనే చూశాడు. “ఏమయ్యా క్రిష్ణారెడ్డి?” అంటూ అబయటకొచ్చాడు. “ఏముంది సార్..” నెత్తి గీరుకొంటూ దగ్గరగా వెళ్లాడు కృష్ణ. “బంగారంటి పాప. ఆ పిల్ల జీవితమెందుకు నాశినం జేస్తావ్? బడికి పంపీయ్యా. పదిరోజులైంది సూడూ” నిలదీశాడు రమణ. ఓసారి అటు ఇటు జూసి “సార్ సార్” […]పూర్తి వివరాలు ...