సాగునీటి సౌకర్యాల విషయంలో దశాబ్దాల పాలకుల నిర్లక్ష్యం కారణంగా రాయలసీమ రైతుకు వ్యవసాయం గుదిబండగా మారి, ప్రాణ సంకటమై కూర్చుండింది. కాయకష్టం చేసి గుట్టలు చదును చేసి తను సాగు చేసిన మెట్ట, పొట్ట కూడా నింపలేదని బాధపడుతున్న రైతు వ్యధను ‘ఓ రాయలసీమ రైతన్నా …’ అంటూ జానపదులు ఇలా ఆలపిస్తున్నారు. మెట్టలూ, గుట్టలుదీసి – పట్టుబట్టీ దున్నితేను చిట్టెడైన పండవేమిరా ఓ రాయలసీమ రైతన్నా..! పొట్టలైనా నిండవేమిరా ఎండలోస్తే పంటలేదు, కుండనొక్కా గింజ లేదు […]పూర్తి వివరాలు ...
అందమైన దాన,, సందమామ లాంటి దాన నీ అందమంతా సూసి నేను వాలిపోయాను పొద్దుటూరు లోనా పట్టు సీరలంగడి నాది సీరలన్నీ నీవు సింగారించుకోవే ।।అందమైన॥ ఆళ్ళగడ్డ లోన హారాలంగడి నాది హారాలన్ని నీవు రుంగారించుకోవే ॥అందమైన॥ అనంతపురంలోన అద్దాల మాడి నాది అద్దాల మాడిలోన ముద్దాడుకుందాము రావే ॥అందమైన॥ ముద్దనూరి లోన ముద్దాలంగడి నాది ఒక ముద్దయునా తిని పోదువు రావే ॥అందమైన॥పూర్తి వివరాలు ...
రెండు చెక్కలను లయాత్మకంగా కొట్టడం ద్వారా అద్భుతమైన సంగీతాన్ని సృష్టించి దానికి అనుగుణంగా అడుగులు వేసే కళ చెక్కభజన. చెక్కభజనలో అడుగులకు అనుగుణంగా పాటలో వేగం, ఊపు, ఉంటాయి. చాలారకాల అడుగులున్నాయి . ఆది అడుగు, రెండు, మూడు, పర్ణశాల, కుప్పకొట్టడం, కులుకు వంటివి ప్రత్యేకమైన అడుగులు. ఈ అడుగులకు అనుగుణంగా చెక్కలు కొడుతుంటారు. గురువు మధ్యలో ఉండి పాట పాడతాడు. జానపదులు ఆదరించిన కళారూపాల్లో చెక్కభజనకు విశేషమైన స్థానం ఉంది. చెక్కభజనను జానపదులకు దగ్గర చెయ్యడంలో […]పూర్తి వివరాలు ...
కోలాట కోపుల్లో తాలుపుగట్టి మొదటిది. ‘శివశివ మూరితివి’ అనే ఈ పాట తాలుపుగట్టి కోపుల్లో కడప జిల్లాలో జానపదులు పాడుకునే గణపతి ప్రార్థనా గీతమిది.. వర్గం : భజన పాటలు శివశివ మూరితివి గణనాతా – నువ్వు శివునీ కుమారుడవు గణనాతా ||శివ|| బుద్ది నీదే బుద్ది నీదే గణనాతా ఈ జగతి గొలుచు దేవుడవు గణనాతా ||శివ|| సదువు నీదే సాము నీదే గణనాతా సారస్వతి నీకు దండం గణనాతా ||శివ|| బాపనోళ్ళు నిన్ను గొలువ […]పూర్తి వివరాలు ...
ప్రొద్దుటూరు చెన్నకేశవుని స్తుతించిన అన్నమాచార్య సంకీర్తన ప్రొద్దుటూరు లేదా పొద్దుటూరు, వైఎస్ఆర్ జిల్లాలోని ఒక ప్రముఖ పట్టణము. రెండవ బొంబాయిగా ప్రసిద్ది చెందినది. పెన్నా నదికి ఉత్తర ఒడ్డున ఉన్న ప్రొద్దుటూరు వ్యాపారాలకు నిలయంగా ఉంది. ఇక్కడి పాత మార్కెట్ దగ్గర ఉన్న పురాతన మహాలక్ష్మీ సమేత చెన్నకేశవ స్వామి ఆలయాన్ని పదకవితా పితామహుడు సందర్శించినట్లు చారిత్రిక ఆధారాలను బట్టి తెలుస్తోంది. పొద్దుటూరు చెండ్రాయుని (చెన్నకేశవుని) యెడల తన మధుర భక్తిని శృంగార సంకీర్తనా రూపంలో అన్నమాచార్యుడు […]పూర్తి వివరాలు ...
తాళ్ళపాక అన్నమయ్య, అక్క(ల)మ్మల (అక్కమాంబ) సంతానమైన పెదతిరుమలయ్య వాళ్ళ నాయన మాదిరిగానే శ్రీ వేంకటేశ్వరుని సేవలో తరించినాడు. తిమ్మయ్య, తిమ్మార్య, తిరుమలాచార్య, తిమ్మడు, తిరుమలగురుడుగా పేర్కొనబడిన పెదతిరుమలయ్య కూడా దేవుని కడప లక్ష్మీ వల్లభుని దర్శించుకుని తరించినాడు. తన సంకీర్తనలతో కడపరాయని కీర్తించి గానం చేసినాడు. కడపరాయని కీర్తించిన పెదతిరుమలయ్య సంకీర్తనలలో ఇది ( కాంతగలనాడు …) కూడా ఒకటి. వర్గం: శృంగార సంకీర్తన రాగము: రామక్రియ రేకు: 49-7 సంపుటము: 17-296 కాంతగలనాడుఁ యేకాంతములమాట, శ్రీ […]పూర్తి వివరాలు ...
పదకవితా పితామహుడి ‘కడపరాయడు’ జగదేక సుందరుడు, అందగాడు. కడపరాయని సుద్దులను, వలపులను తలచుకొని ఆ సతి ఇట్లా పరవశిస్తోంది… వర్గం: శృంగార సంకీర్తన రాగము: దేసాళం రేకు: 512 సంపుటము: 13-68 కంటిమి నీ సుద్దులెల్ల గడపరాయ యింటింట దారణలెక్కె నేమి చెప్పేదయ్యా ॥పల్లవి॥ కొమ్మల చేత నెల్లాను కొలువు సేయించుకొంటా కమ్మి వలపు కొటారుగాఁ బెట్టేవు అమ్మరో పోఁకకుఁ బుట్టెడాయను సిగ్గులు నేడు యెమ్మెల సతుల భాగ్యాలేమి చెప్పేదయ్యా ॥కంటిమి॥ జలజ లోచనలతో సరసములాడుకొంటా మొలకనవ్వులను […]పూర్తి వివరాలు ...
పదకవితా పితామహుడి ‘కడపరాయడు’ జగదేక సుందరుడు, అందగాడు. వాని అందచందాలు చూసి కన్నెలు పరవశించినారు. వాని చేతలకు బానిసలైనారు. కడపరాయని వశీకరణకు గురైన ఒక నాయిక ఆ ‘మాయగాడి’ని మోహిస్తూ.. వచ్చి వలపులందుకొమ్మని ఇట్లా పిలుస్తోంది… వర్గం: శృంగార సంకీర్తన రాగము: సామంతం రేకు: 0879-5 సంపుటము: 18-472 సారెనేలే జగడము – అన్నమాచార్య సంకీర్తన ‘కన్నుల మొక్కేము…’ సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి. కన్నుల మొక్కేము నీకుఁ గడపరాయ నన్నుఁ గన్నెనాఁడె యేలితివి […]పూర్తి వివరాలు ...
కడప నారాయణదాసు సంకీర్తనలు తొలితెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య, ప్రజాకవి వేమన , కాలజ్ఞానకర్త పోతులూరి వీరబ్రహ్మం కడప ఖ్యాతిని ప్రపంచానికి చాటారు. వారికోవకే చెందిన పండరి భజన వాగ్గేయకారుడు కడప నారాయణదాసు తాజాగా వెలుగులోకి వచ్చారు. దాదాపు80- 90 ఏళ్ల కిందట తాడిపత్రిలో పుట్టి, కడపలో నివసించి ఈ నేలలో నడయాడి పండరి భజన కీర్తనలను రచించి, తానే గురువై బృందాలకు పండరి భజన నేర్పిస్తూ తమిళనాడు (చోళంగిపురం) చేరుకుని ప్రజాబాహుళ్యంలో చిరస్థాయిగా నిలిచి పోయిన వాగ్గేయకారులు […]పూర్తి వివరాలు ...