కన్నె సోయగమునకు మురిసిన కడపరాయడు (గడపరాయ )చెలువతో చెలిమి చేసి శృంగారము చేసినాడు. నాయికా నాయకుల సరసములు ప్రొద్దుపోవు వరకు సాగినవి.పూర్తి వివరాలు ...
‘ఇ’తో మొదలయ్యే కడప సామెతలు … ‘ఇ ‘ అనే అక్షరంతో తెలుగు సామెతలు. కడప జిల్లాతో పాటుగా రాయలసీమ నాలుగు జిల్లాలలో వాడుకలో ఉన్న/ఉండిన సామెతలు. ఇంటి ఎద్దుకు బాడుగ ఇంటికన్న గుడి పదిలం ఇంటికో కడిదిని గుంటగ్గుక్కనీల్ దాగినట్టు ఇంతే సంగతులు చిత్తచ్చవలయును ఇచిత్రానికి ఇద్దురు పుడితే ఈడ్చలేక ఇద్దరు సచ్చిరంట ఇచిత్రానికి ఈర్లు బెడితే ఇంటాదికి యారగబెట్నంట ఇచ్చేటోడు ఉంటే సెచ్చోటోడు లేసొచ్చినంట ఇచ్చేవోన్ని సూసి చ్చేవోడుకూడా లేసొచ్చ ఇట్లిట్లే రమ్మంటే ఇల్లంతా […]పూర్తి వివరాలు ...
ఒక అభిప్రాయం మా మధ్య పెఠిల్లున విరిగినపుడు మేమిద్దరం చెరో ధృవం వైపు విసరేయబడతాము ఆమె మొహం నాకేదో నిషిద్ధ వర్ణ చిత్రంలా గోచరిస్తుంది చేయి చాచితే అందే ఆమె దూరం మనస్సులో యోజనాలై విస్తరించుకొంటుంది ఉల్లిపొరై మామధ్య లేచిన భేదభావానికి నా అహం ఉక్కుపూత పూసేందుకు నడుం బిగిస్తుంది మౌనంగా మామధ్య చెలియలికట్టలా పడుకొని వున్న పాపకు ఇటువైపు నా గుండె కల్లోల సాగరమై ఎగిసి పడుతుంటుంది నా మనస్సు విరిగిన అభిప్రాయ శకలాల్ని కూర్చుకొంటూ […]పూర్తి వివరాలు ...
ఇప్పటికి శివతాండవం పదిసార్లైనా ప్రింటు అయివుంటుంది. కానీ నేను ఆర్ధికంగా లాభపడింది మాత్రం చాలా తక్కువ. కారణాలు అనేకాలు. ముఖ్యంగా ఈ రాయలసీమ చీకటి ఖండం. ఈ ప్రాంతాల్లోనే గడ్డకు వచ్చి ఒక పేరు, ప్రతిష్ట సంపాదించుకోవలంటే చాలా కష్టం. సాహిత్యకంగా నా జీవితంలో ఎన్నో కల్లోలాలు ఎదుర్కోవలసివచ్చింది. ఒకసారి గుంటూరికి సాహిత్య మిత్రులు కొందరు నన్నాహ్వానించినారు. నాకు శరీర ఆరోగ్యము కూడా సరిగాలేదు అప్పుడు. ప్రయాణినికి కావలసిన జాగ్రత్తలన్నీ వారే చూచుకున్నారు. రామాయణం పైన నా […]పూర్తి వివరాలు ...
పుస్తకం : సంవేదన , సంపాదకత్వం: రాచమల్లు రామచంద్రారెడ్డి , ప్రచురణ : యుగసాహితి, అక్టోబర్1968లో ప్రచురితం.పూర్తి వివరాలు ...
మామూలుగా ఐతే ఒక ప్రాంతం/వర్గంమీద అక్కసుతో అపోహలు, అకారణ ద్వేషం కలిగేలా రాసే కథలను విజ్ఞతగల సంపాదకులు ప్రచురించరు. ఒకవేళ ప్రచురించినా ఇలాంటి కథలకు పాత పత్రికలకు ఉన్నదానికంటే ఎక్కువ ప్రాధాన్యత ఉండదు. ఐతే ఈ కథ అలా మరుగున పడలేదు. 87 సంవత్సరాల తెలుగు కథాచరిత్రలో 87 మంది రచయితల అత్యుత్తమ కథలుగా ఎంపికచేసిన కథాసాగర్ సంకలనంలో చోటు సంపాదించుకుంది. కథ అక్కడితో ఆగలేదు – ఆ కథాసంకలనాన్ని ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ […]పూర్తి వివరాలు ...
అన్నమయ్య సంకీర్తనలలో ఒంటిమిట్ట కోదండరాముడు ఒంటిమిట్టలోని కోదండరాముడ్ని దర్శించి తరించిన పదకవితా పితామహుడు ఆయన సాహస గాధల్ని (అలౌకిక మహిమల్ని)ఇట్లా కీర్తిస్తున్నాడు … వర్గం: ఆధ్యాత్మ సంకీర్తన రాగము: నాట రేకు: 0096-01 సంపుటము: 1-477 ఇందులోనే కానవద్దా యితఁడు దైవమని విందువలె నొంటిమెట్ట వీరరఘురాముని యెందు చొచ్చె బ్రహ్మవర మిల రావణుతలలు కందువ రాఘవుఁడు ఖండించునాఁడు ముందట జలధి యేమూల చొచ్చెఁ గొండలచే గొందింబడఁ గట్టివేసి కోపగించేనాడు ||ఇందులోనే|| యేడనుండె మహిమలు యిందరి కితఁడు వచ్చి వేడుకతో […]పూర్తి వివరాలు ...
తాళ్ళపాక అన్నమయ్య, అక్క(ల)మ్మల (అక్కమాంబ) సంతానమైన పెదతిరుమలయ్య వాళ్ళ నాయన మాదిరిగానే శ్రీ వేంకటేశ్వరుని సేవలో తరించినాడు. తిమ్మయ్య, తిమ్మార్య, తిరుమలాచార్య, తిమ్మడు, తిరుమలగురుడుగా పేర్కొనబడిన పెదతిరుమలయ్య కూడా దేవుని కడప లక్ష్మీ వల్లభుని దర్శించుకుని తరించినాడు. తన సంకీర్తనలతో కడపరాయని కీర్తించి గానం చేసినాడు. కడపరాయని కీర్తించిన పెదతిరుమలయ్య సంకీర్తనలలో ఇది కూడా ఒకటి. వర్గం: శృంగార సంకీర్తన రాగము: రామక్రియ రేకు: 74-6 సంపుటము: 17-386 ఏమి నీ కింత బలువు యెవ్వ రిచ్చిరి […]పూర్తి వివరాలు ...
పుస్తకం : సంవేదన , సంపాదకత్వం: రాచమల్లు రామచంద్రారెడ్డి , ప్రచురణ : యుగసాహితి, జులై 1968లో ప్రచురితం.పూర్తి వివరాలు ...