॥పల్లవి॥ఘనమనోరాజ్యసంగతి చెలఁగినఁగానిజనుల కెప్పుడు నాత్మసౌఖ్యంబు లేదు॥చ1॥ప్రతిలేనిధైర్యంబు పదిలపరచినఁ గానిమతిలోనిపగవారిమద మణఁపరాదుమితిలేనిశాంతమనుమేఁటికైదువఁ గానిక్రితకంబువిషయముల గెలుపెరఁగరాదు॥చ2॥సొరిది నిర్మోహమనుజోడు దొడిగినఁ గానివెరపుడిగి మమతచే వెళ్లఁబడరాదుయిరవైన విజ్ఞానపింట నుండినఁ గానిఅరసి జగమెల్ల తానై యేలరాదు॥చ3॥యిన్నియునుఁ దిరువేంకటేశుఁ డిచ్చినఁ గానితన్నుఁదానెరిఁగి యాతనిఁగొలువరాదుకన్నులను వెలి లోను గలయఁజూచిన గానిసన్నంబుఘనమనెడిజాడ గనరాదు రాగము: సామంతం రేకు: 0049-06 సంపుటము: 1-303 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, సామంతంపూర్తి వివరాలు ...
॥పల్లవి॥కడుపెంత తాఁ గుడుచు కడుపెంత దీనికైపడనిపాట్ల నెల్లఁబడి పొరలనేలా॥చ1॥పరులమనసునకు నాపదలు గలుగఁగఁజేయఁబరితాపకరమైనబ్రదుకేలాసొరిది నితరుల మేలుచూచి సైఁపఁగలేకతిరుగుచుండేటి కష్ట దేహమిదియేలా॥చ2॥యెదిరి కెప్పుడుఁ జేయుహితమెల్లఁ దనదనుచుచదివిచెప్పనియట్టి చదువేలాపొదిగొన్నయాసలోఁ బుంగుడై సతతంబుసదమదంబై పడయుచవులు దనకేలా॥చ3॥శ్రీవేంకటేశ్వరుని సేవారతికిఁగాకజీవనభ్రాంతిఁ బడుసిరులేలాదేవోత్తముని నాత్మఁ దెలియనొల్లక పెక్కు_త్రోవ లేఁగిన దేహి దొరతనంబేలా రాగము: గుండక్రియ రేకు: 0049-05 సంపుటము: 1-302 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, గుండక్రియపూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఏదియునులేని దేఁటిజన్మమువేదాంతవిద్యావివేకి గావలెను॥చ1॥పరమమూ ర్తిధ్యానపరుఁడు గావలె నొండెపరమానందసంపద లొందవలెనుపరమార్థముగ నాత్మభావింపవలె నొండెపరమే తానై పరగుండవలెను॥చ2॥వేదశాస్త్రార్థకోవిదుఁడు గావలె నొండెవేదాంతవిదుల సేవించవలెనుకాదనక పుణ్యసత్కర్మి గావలె నొండెమోదమున హరిభక్తి మొగి నుండవలెను॥చ3॥సతతభూదదయావిచారి గావలె నొండెజితమైనయింద్రియస్థిరుఁడు గావలెనుఅతిశయంబగు వేంకటాద్రీశుసేవకులెగతియనుచు తనబుద్ధిఁ గలిగుండవలెను రాగము: నాట రేకు: 0049-04 సంపుటము: 1-301 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, నాటపూర్తి వివరాలు ...
॥పల్లవి॥అయ్యా మానువఁగదవయ్య మనుజుఁడు తన-కయ్యపుఁగంగఁ గానఁడు॥చ1॥పాపపుణ్యలంపటుఁడైనా దష్ట-రూపుడూ జన్మరోగి యటుగానపైపైనే ద్రవ్యతాపజ్వరము వుట్టియేపొద్దు వొడలెరఁగఁడు॥చ2॥నరకభవనపరిణతుఁడైనా కర్మపురుషుఁడు హేయభోగి యటుగానదురితపుణ్యత్రిదోషజ్వరము పట్టిఅరవెరమాట లాడీని॥చ3॥దేహమోహస్థిరుఁడైనా ని-ర్వాహుఁడు తర్కవాది యటుగానశ్రీహరి వేంకటశ్రీకాంతునిఁ గనివూహలఁ జేరనొల్లఁడు రాగము: నాట రేకు: 0049-03 సంపుటము: 1-300 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఏలవచ్చీ యేలపోయీ నెందుండీఁ బ్రాణితోలుతి త్తిలోనఁ జొచ్చి దుంక దూరనా॥చ1॥పుట్టులేక నరకాలపుంగుడై తా నుండక యీ-పుట్టుగున కేల వచ్చీ పోయీఁ బ్రాణిపుట్టుచునే కన్న వారిఁ బుట్టినవారి నాసలఁబెట్టిపట్టి దు: ఖములఁ బెడరేఁచనా॥చ2॥భూతమై యడవిలోఁ బొక్కుచుఁ దా నుండక యీ-బూతుజన్మమేల మోఁచెఁ బుచ్చిన ప్రాణిరాతిరిఁబగలు ఘోరపుఁబాటు వడిపడిపాతకాలు చేసి యమబాధఁబడనా॥చ3॥కీటమై వేంకటగిరి కిందనైన నుండక యీ-చేటువాటుకేల నోఁచె చెల్లఁబో ప్రాణిగాటమైనసంపదల కడలేనిపుణ్యాల-కోటికిఁ బడగెత్తక కొంచెపడనా రాగము: భూపాళం రేకు: 0049-02 సంపుటము: 1-299 Tags: Annamacharya Keerthanalu, Telugu [&పూర్తి వివరాలు ...
॥పల్లవి॥కాలాంతకుఁడనువేఁటకాఁ డెప్పుడుఁ దిరిగాడునుకాలంబనియెడితీవ్రపుగాలివెర వెరిఁగి॥చ1॥పరమపదంబు చేనికి పసిగొనునర మృగములకు నునుతరమిడి, సంసారపుటోఁదములనె యాఁగించి,వురవడిఁ జేసినకర్మపుటరులు దరిద్రంబనువలవొరపుగ మాయనుపోగులు వొకవెరవున వేసీ॥చ2॥కదుముకవచ్చేటిబలురోగపుఁగుక్కల నుసికొలిపి,వదలక ముదిసినముదిమే వాకట్టుగఁ గట్టి.పొదలుచు మృత్యువు పందివోటై నల్లెట నాడఁగ.పదిలముగా గింకరులనుచొప్పరులఁ బరవిడిచీ॥చ3॥ఆవోఁదంబులఁ జిక్కక, ఆవురులనుఁ దెగనురికి,ఆవేఁటకాండ్ల నదలించాచేనే చొచ్చి ,పావనమతిఁ బొరెవొడిచి పరమానందముఁ బొందుచుశ్రీ వేంకటపతి మనమునఁ జింతించీ నరమృగము రాగము: కన్నడగౌళ రేకు: 0049-01 సంపుటము: 1-298 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥చాల నొవ్వి నేయునట్టిజన్మమేమి మరణమేమిమాలుగలపి దొరతనంబు మాన్పు టింత చాలదా॥చ1॥పుడమిఁ బాపకర్మమేమి పుణ్యకర్మమేమి తనకుకడపరానిబంధములకుఁ గారణంబులైనవియెడపకున్న పసిఁడిఁసంకెలేమి యినుపసంకెలేమిమెడకుఁ దగిలియుండి యెపుడు మీఁదుచూడరానివి॥చ2॥చలముకొన్న ఆపదేమి సంపదేమి యెపుడుఁ దనకుఅలమిపట్టి దు: ఖములకు నప్పగించినట్టిదియెలమిఁ బసిఁడిగుదియయేమి యినుపగుదియయేమి తనకుములుగ ములుగఁ దొలితొలి మోఁదు టింత చాలదా॥చ3॥కర్మియైనయేమి వికృతకర్మియైననేమి దనకుకర్మఫలముమీఁదకాంక్ష గలుగు టింత చాలదామర్మ మెరిఁగి వేంకటేశుమహిమలనుచుఁ దెలిసినట్టినిర్మలాత్ము కిహముఁ బరము నేఁడు గలిగెఁ జాలదా రాగము: భైరవి రేకు: 0048-04 సంపుటము: 1-297 Tags: Annamacharya Keerthanalu, Telugu […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥బలువగుకర్మము లివివో జీవులప్రారబ్ధంబులు సంచితంబులునుబలిసి తీర వివి పెరుగనేకాని బ్రహ్మలబహుకల్పంబులదాఁక॥చ1॥పాయనిజన్మంబులకర్మంబులు పాయక జీవుల ప్రారబ్ధములైయేయెడఁజూచిన నెదిటికొలుచులై యిచ్చల నిటు భజియించఁగనుకాయపుఁ బెడతటిగండఁడు విధి, దనుఁగడ తేర్చిన తనకడకర్మములుపోయి సంచితంబులఁ గలసిన, నవి పొదలుచుఁ గొండలపొడవై పెరుగు॥చ2॥పొదలి సంచితంబులు వడిఁబెరుగును పొలియును జీవునిపుణ్యముఁ జాలకయెదిగినపుణ్యం బిగురును కాఁగినయినుముమీఁదిజలములవలెనుపదిలములై కడుఁబాపకర్మములే బరువై పరగఁగఁ బ్రాణికి నెన్నఁడుతుదయు మొదలు నెందును లేక, వడిఁ దొలఁగక భవములతొడవై తిరుగు॥చ3॥తలఁపులో నవయఁదలఁచినజంతువు, కలుషహరుఁడు వేంకటగిరిపతి దనుదలఁచుభాగ్య మాత్మకు నొసగినఁ, జిత్తము పరిపక్వంబై యెపుడుజలజోదరుదలఁచఁగఁబ్రారబ్దంబులు సంచితంబులుఁ […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥బలువగుఁ దనరూపము చూపెకలదింతయుఁ దనఘన తెఱిఁగించెన్॥చ1॥పాండవరక్షణపరుఁడై నరునకునండనే తెలిపె మహమహిమదండి విడిచి తనదయతో నర్జునుఁ-డుండఁగ మగటిమి నొడఁబడఁ బలికె॥చ2॥మగుడఁగ కులధర్మములుఁ బుణ్యములుతెగి పార్ధున కుపదేశించెనగుచు నతనితో నానాగతులనునిగమమునియమమునిజ మెరిఁగించెన్॥చ3॥వెరపుమిగుల నావిజయునిమనుమనిపరీక్షిత్తుఁ దగఁ బ్రదికించెతిరువేంకటగిరిదేవుఁడు దానైగరిమల బారతకథ గలిగించెన్ రాగము: పాడి రేకు: 0048-03 సంపుటము: 1-295 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, పాడిపూర్తి వివరాలు ...