ఒంటిమిట్ట (ఇంగ్లీషు: Ontimitta) కోదండరామునికి ప్రభుత్వ లాంఛనాలు సమర్పించేందుకు ముందుకు వచ్చిన ఆం.ప్ర ప్రభుత్వం అందుకోసం 15 వేల రూపాయలు (INR 15000 Only) కేటాయించింది. ఇందుకు సంబంధించి ఆం.ప్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి జెఎస్వి ప్రసాద్ పేర ప్రభుత్వం జీవో నెంబరు 63ను విడుదల చేసింది (ఫిబ్రవరి 21, 2015న). ఇందులో రాష్ట్ర విభజన నేపధ్యంలో ఒంటిమిట్ట ఆలయానికి ప్రభుత్వ లాంఛనాలు సమర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాల కోసం […]పూర్తి వివరాలు ...
కడప: బిజెపి కేంద్ర బడ్జెట్‌ను వ్యతిరేకించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ రామ్మోహన్ పిలుపునిచ్చారు. 2015-16 సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ పెట్టుబడిదారులకు, ధనవంతులకు, విదేశీ బహుళజాతి కంపెనీలకు వత్తాసుగా ఉందన్నారు. ఈ దేశాన్ని మరింతగా దోచుకోవడానికి అవసరమైన రాయితీలన్నింటిని అడ్డుగోలుగా అప్పచెప్పుతూ, సాధారణ ప్రజలపై మాత్రం మోయలేనిభారాన్నివేస్తూ బడ్జెట్ ప్రతిపాదనలుండడం యాదృచ్ఛికం కాదన్నారు. ఓట్లేసిన ప్రజల కంటే ఎన్నికల నిధులను సమకూర్చిన పెట్టుబడిదారులకు సేవ చేయడమే లక్ష్యంగా బిజెపికి […]పూర్తి వివరాలు ...
కమలాపురం: ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ‘గాలేరు-నగరి’కి నిధులు కేటాయించి ప్రాజెక్టు పూర్తి చేయాలని మాజీ మంత్రి, వైఎస్ వివేకానంద రెడ్డి డిమాండ్ చేశారు.‘ప్రజా పోరాటాలకు కమలాపురం నియోజకవర్గం పుట్టినిల్లు. ఈ నియోజకవర్గ ప్రజల కోసం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి దీక్ష చేయడం అభినందనీయం’ అని ఆయన అన్నారు. గాలేరు-నగరి ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరుతూ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష బుధవారం నాలుగో రోజుకు చేరింది. ఈ సందర్భంగా వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్ఆర్సీపీ […]పూర్తి వివరాలు ...
కడప: జిల్లాలో ఏర్పాటు చేస్తామని చెప్పిన ఉర్దూ విశ్వవిద్యాలయాన్ని చంద్రబాబు మాట మార్చి కర్నూలుకు మంజూరు చేస్తున్నట్లు పేర్కొనడంపై జిల్లాలోని అన్ని వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉర్దూ విశ్వవిద్యాలయ సాధనకు నగరంలోని ఉర్దూ మాతృభాషాభిమానులు, కవులు, ప్రజాప్రతినిధులు ఉర్దూ విశ్వవిద్యాలయ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట నిరహారదీక్షలు చేపట్టారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు రోజూ 25 మందితో దీక్షలు చేపడతామని యాక్షన్ కమిటీ అధ్యక్షుడు సలాఉద్దీన్ తెలిపారు. మాట మార్చిన వ్యక్తులకు మద్దతు పలికే […]పూర్తి వివరాలు ...
రాయలసీమ అభివృద్ధికి బాబు చేసిందేమీ లేదు కడప: రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. వెంటనే గాలేరు-నగరి సుజల స్రవంతి పథకానికి అవసరమైన నిధులు కేటాయించాలని లేకపోతే రాయలసీమకు జలసాధన కోసం మరో ఉద్యమం చేస్తామని మాజీ మంత్రి, వైకాపా సీనియర్ నేత ఎంవీ మైసూరారెడ్డి హెచ్చరించారు. సోమవారం వీరపునాయునిపల్లె ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు వద్ద కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి చేస్తున్న నిరవధిక నిరాహారదీక్ష శిబిరానికి వచ్చిన మైసూరారెడ్డి ఆయనకు సంఘీభావం తెలిపారు. నిధులు కేటాయించాల ఈ […]పూర్తి వివరాలు ...
కడప: కడప నుంచి విశాఖపట్నానికి ఇంద్ర బస్సు సర్వీసును ఆదివారం సాయంత్రం డిపో అధికారులు ప్రారంభించారు.ఈ బస్సు ప్రతి రోజు సాయంత్రం కడప డిపో నుంచి సాయంత్రం 6 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు విశాఖపట్నానికి చేరుకుంటుంది. తిరిగి విశాఖపట్నంలో సాయంత్రం 5.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు కడపకు చేరుకుంటుంది. కడప నుంచి బద్వేలు, కావలి, ఒంగోలు బైపాస్, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, అన్నవరంల మీదుగా […]పూర్తి వివరాలు ...
గాలేరు-నగరి సుజల స్రవంతిలో భాగమైన సర్వరాయసాగర్ పనులు తక్షణం పూర్తి చేసి ప్రజలకు, రైతులకు తాగు, సాగు నీరు అందించాలని కోరుతూ కమలాపురం శాసనసభ్యుడు రవీంద్రనాద్ రెడ్డి ఆదివారం మండల కేంద్రమైన వీరపునాయునిపల్లెలో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షా శిబిరంలో ఆయన మాట్లాడుతూ … ‘ఇప్పటికే మన ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. తాగడానికి నీరు లేదు. తినడానికి తిండి లేదు.. రబీ సీజన్ కూడా మోసం చేసింది.. చంద్రబాబు సీఎం అయితే ఆయనతో […]పూర్తి వివరాలు ...
కడప: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తీ చేసేదానికి అవసరమైన డబ్బులు కేటాయించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని అఖిలపక్షం నేతలు అన్నారు. శనివారం అఖిలపక్షం నేతలు కలెక్టరేట్ ఆవరణలో నీటిపారుదల శాఖ సీఈ వరదరాజుకు వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో నిలిచిపోయినన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు వచ్చే బడ్జెట్లో రూ.1800 కోట్లు నిధులు కేటాయించాలన్నారు. గండికోట జలాశయానికి నీరు తీసుకొచ్చేందుకు సంబంధిత పనులు పూర్తి చేయాలని, […]పూర్తి వివరాలు ...
కడప: గోదావరి, కృష్ణా పరిధిలో ఆదా చేసిన 70 టిఎంసీల నీటిని రాయలసీమకు మళ్లిస్తా.. రాబోవు జూలైలో కాలువ గట్టుపై నిద్రించైనా గండికోటలో నీరు నిల్వ చేస్తా.. గండికోట, మైలవరం ప్రాజెక్టులకు 35 టీఎంసీల నీరు తీసుకవస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. శుక్రవారం ఆయన గండికోట ప్రాజెక్టు సందర్శించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ పులివెందుల రైతుల అభ్యర్థన మేరకు చీనీ తోటలకు నీరు ఇచ్చాం.. గండికోట ముంపు బాధితులకు న్యాయం చేస్తాం.. ప్రభుత్వ […]పూర్తి వివరాలు ...