కడప: ఎంసెట్-2016 పరీక్ష రాసే విద్యార్థులకు పరీక్ష రోజున ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించినట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ గోపీనాథ్‌రెడ్డి తెలిపారు. విద్యార్థులు హాల్‌టిక్కెట్టు చూపించి ఇంటి నుంచి పరీక్షా కేంద్రాలకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. కడప, ప్రొద్దుటూరు ఆర్టీసీ బస్టాండుల నుంచి పరీక్షా కేంద్రాల వరకు ఉదయం, మధ్యాహ్నం ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఒక ప్రకటనలో తెలియచేశారు. కడప: ఎంసెట్-2016 పరీక్ష […]పూర్తి వివరాలు ...
కడప జిల్లాపై ముఖ్యమంత్రి తీవ్ర వివక్ష చూపిస్తున్నారు రెండు జిల్లా వాళ్ళ మూడో పంట కోసమే పట్టిసీమ ఇంకుడు గుంతల పేరు చెప్పి ప్రాజెక్టులు అటకెక్కిస్తున్నారు ప్రొద్దుటూరు: కోస్తా ప్రాంతంలోని రెండు జిల్లాలకు కృష్ణా గోదారి నీళ్ళు రాయలసీమకు ఇంకుడు గుంతలా అని సిపియం జిల్లా కార్యదర్శి ఆంజనేయులు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. స్థానిక సిపియం కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేకించి కడప జిల్లాపై చంద్రబాబునాయుడు తీవ్ర […]పూర్తి వివరాలు ...
కడప : వైకాపాలో సీనియర్ నేతగా ఒక వెలుగు వెలిగిన మైసూరారెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇందుకు సంబంధించి వైకాపా అధినేతకు ఆయన రాసినట్లుగా చెబుతున్న నాలుగు పేజీల లేఖ బుధవారం మీడియాకు విడుదలైంది. మైసూరారెడ్డి గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. జగన్ వైఖరి పట్ల అసంతృప్తితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మైసూరా లేఖలో తెలిపారు. వైకాపాలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని లేఖలో మైసూరా ఆరోపించారు. గతంలో తన ప్రమేయం లేకుండానే వైకాపాలో […]పూర్తి వివరాలు ...
ఊటుకూరు వద్ద రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన కడప: జిల్లా రైతులు బిందు సేద్యం ద్వారా పంటలు సాగు చేయాలని ముఖమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. సోమవారం వివిధ కార్యక్రమాలలో పాల్గొనే నిమిత్తం జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి తొలుత ఇటీవల మరణించిన మాజీ ఎంపీ గునిపాటి రామయ్య కుటుంబాన్ని రైల్వేకోడూరులో పరామర్శించారు. తర్వాత రామాపురం మండలం నల్లగుట్టపల్లి చేరుకొని అక్కడి నీరు-చెట్టు పనులను పరిశీలించారు. అనంతరం కడపకు వచ్చిన ఆయన ఒక ప్రయివేటు ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన […]పూర్తి వివరాలు ...
కడప: ఒంటిమిట్ట కోదండరాముడి కళ్యాణోత్సవంలో పాల్గొనేందుకు జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం జిల్లాలో వివిధ పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.ముందుగా కడప నగరంలో కొత్త సచివాలయ భవనాన్ని (కలెక్టరేట్) ఆయన ప్రారంభించారు. అనంతరం ఒంటిమిట్ట సమీపంలో రూ.34కోట్లతో నిర్మించిన శ్రీరామ ఎత్తిపోతల పథకం పైలాన్‌ను రాత్రి ఆవిష్కరించారు. కలెక్టరేట్ ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…పట్టిసీమ నిర్మాణంతో వంద టీఎంసీల నీటిని వాడుకోవచ్చన్నారు. శ్రీశైలం నీటిని పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమ జిల్లాలకు తరలించవచ్చన్నారు. శ్రీశైలం జలాలతో గండికోట […]పూర్తి వివరాలు ...
ఒంటిమిట్ట: కోదండరాముని బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు (బుధవారం) ప్రత్యేక వేదికపై శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అర్చకులు కల్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. హస్తా నక్షత్రయుక్త శుభలగ్నంలో రాత్రి 8 గంటలకు మొదలైన కల్యాణం 10 గంటల వరకూ సాగింది. ఉత్సవ విగ్రహాలను పల్లకీపై కొలువుదీర్చి ప్రధాన ఆలయం నుంచి శోభాయాత్రగా శిల్పకళా శోభితమైన కళ్యాణమండపం వద్దకు తీసుకువచ్చారు. వేదికపైన రజిత సింహాసనంపై కళ్యాణమూర్తులను ఆసీనులను చేశారు. విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం చేసి […]పూర్తి వివరాలు ...
కడప : రాయలసీమ దాహార్తిని తీర్చడానికి తగినంత నీటిని పోతిరెడ్డిపాడు వద్ద నిలువ చేసుకునే అవకాశం సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం ద్వారా సాధ్యమవుతుందని రాయలసీమ సాగునీటి సాధన సమితి ఛైర్మన్ బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు. ‘సిద్ధేశ్వరం అలుగు మనమే నిర్మించుకుందాం’ అన్న అంశంపై సోమవారం కడపలోని వైఎస్సార్ పాత్రికేయ సమావేశ మందిరంలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ప్రాజెక్టుల నిర్మాణంలో సీమకు అన్యాయం జరగకుండా ఈ ప్రాంతవాసులు ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. సిద్దేశ్వరం అలుగు నిర్మించడానికి […]పూర్తి వివరాలు ...
కడప: ఉగాది పర్వదినం సందర్భంగా శుక్రవారం దేవుని కడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరుని దర్శనానికి ముస్లింలు పెద్ద సంఖ్యలో భక్తులతో కలిసి తరలివచ్చారు. ఉదయం 5 గంటల నుంచే స్వామి, అమ్మవార్లను దర్శించుకుని కొబ్బరి కాయలు కొట్టి కానుకలు సమర్పించారు. తీర్థ ప్రసాదాలను స్వీకరించి లడ్డూలను కొనుగోలు చేశారు. బీబీ నాంచారమ్మను తాము కుమార్తెగా భావిస్తామని, ఆ దృష్ట్యా శ్రీనివాసుడు తమకు అల్లుడవుతాడని… ప్రతి ఏటా ఉగాది రోజున ఆయనకు దిన భత్యం సమర్పించి పూజలు నిర్వహించడం […]పూర్తి వివరాలు ...
వారానికి మూడు రోజులు…మంగళ, బుధ, గురు వారాలలో టికెట్ ధర రూ.1665 కడప: కడప – విజయవాడ నగరాల మధ్య వారానికి మూడు సార్లు విమానాన్ని నడిపేందుకు ట్రూజెట్ విమానయాన సంస్థ సిద్ధమైంది. మొదటి విమానం మే 3వ తేదీ మధ్యాహ్నం 1 గంట 35 నిముషాలకు విజయవాడ నుండి బయలుదేరి మధ్యాహ్నం 2 గంటల 40 నిముషాలకు కడప చేరుతుంది. అదే విమానం మధ్యాహ్నం 3 గంటల 05 నిముషాలకు కడప నుండి బయలుదేరి 04 […]పూర్తి వివరాలు ...