తెలుగు సినిమా దర్శకుల్లో గొప్పవాళ్ళు ఎవరనే ప్రశ్న వస్తే మనం ముందుగా వినే పేరు “బి.ఎన్. రెడ్డి”. నిజానికి 30 ఏళ్ళ సినీ జీవితంలో ఆయన తీసింది పదకొండు సినిమాలే. కాని ప్రతి ఒక్కటీ పేరు గడించిందే! “బి.ఎన్” గా సుపరిచితులైన బి.ఎన్.రెడ్డి అసలు పేరు బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి. కడపజిల్లా – పులివెందుల తాలూకాలోని ఎద్దులయ్యగారి కొత్తపల్లిna 16.11.1908 న ఆయన జన్మించారు. బి.ఎన్ ప్రాథమిక విద్యాభ్యాసం రైల్వేకోడూరు తాలూకాలోని పొట్టిపాడులో జరిగింది. ఆయన తండ్రి Rallis, […]పూర్తి వివరాలు ...
రా.రా .గా ప్రసిద్ధుడయిన విమర్శకుడూ, సంపాదకుడూ, కథకుడూ, అనువాదకుడూ సిసలయిన మేధావీ – రాచమల్లు రామచంద్రారెడ్డి (1922-88) హృదయమున్న రసైకజీవి! స్వపరభేదాలు పాటించని విమర్శకుడు. పిసినారి అనిపించేటంత పొదుపరి కథకుడు. ముళ్లలోంచి పువ్వులను ఏరే కళలో ఆరితేరిన సంపాదకుడు. మూలరచయిత మనసును లక్ష్యభాషలోని పాఠకుడికి సమర్థంగా చేర్చిన అనువా దకుడు. అక్షరాంగణంలో నిలువెత్తు విగ్రహాలుగా పాతుకు పోయిన ‘ప్రముఖుల’ గుట్టురట్టు చెయ్యడానికి క్షణమాత్రం జంకని విగ్రహ విధ్వంసి. ఒక్కమాటలో చెప్తే- మూడున్నర దశాబ్దాల సాహిత్య జీవితంలో ఒక […]పూర్తి వివరాలు ...
శ్రేష్టమైన సద్గురు పరంపరలో భారతీయ సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ దీన జనసేవ, గోసేవ, శిథిలమైన దేవాలయాల జీర్ణోద్ధరణ చేస్తూ ఆజన్మాంతం ఆధ్యాత్మిక మార్గమే శరణ్యమని ఆచరణలో చూపిన మహనీయుడు కాశిరెడ్డి నాయన. నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా బెడుసుపల్లి గ్రామంలోని మునెల్లి వంశంలో మునెల్లి సుబ్బారెడ్డి, కాశమ్మ దంపతులకు రెండవ సంతానంగా జన్మించిన పుణ్యమూర్తి కాశరెడ్డి నాయన. అమావాస్యనాడు అర్ధరాత్రివేళ జన్మించిన కాశినాయన ప్రజలను అజ్ఞానాంధకారంనుంచి జ్ఞానమార్గం వైపు మళ్లించిన ఒక దివ్య జ్యోతి నృసింహాపాసకులు.పూర్తి వివరాలు ...
నాటక, సినిమా రంగాలలో మేటి నటిగా, వితరణశీలిగా పేరుగాంచిన పసుపులేటి కన్నాంబ జన్మదినం గురించి విభిన్న అభిప్రాయాలుండేవి. కొందరు 1910 అని, కొందరు 1912, 1913 అని రాశారు. 1949 అక్టోబర్లో, పెనుపాదం, ఆమెతో జరిపిన ఇంటర్వ్యూలో కన్నాంబ 1911- అక్టోబర్ 5వ తేదీ అని తేల్చారు. ఆమె కోడలు కళావతి, కన్నాంబ జీవిత విశేషాలను విశదపరచారు. కన్నాంబ, కడపలో లోకాంబ, వెంకట్రామయ్య గార్లకు జన్మించారు. వెంకట్రామయ్య ప్రభుత్వ గుత్తేదారు. ఆ దంపతుల ఏకైక సంతానమైన కన్నాంబ, […]పూర్తి వివరాలు ...
పాతాళభైరవి… మాయాబజార్… మిస్సమ్మ… జగదేకవీరుని కథ… గుండమ్మ కథ…. ఈ అయిదు సినిమాలూ మనకు రాలేదనే అనుకుందాం. అప్పుడేంటి పరిస్థితి? జస్ట్! ఒక్కసారి ఊహించుకోండి. కిరీటం కోల్పోయిన ఛత్రపతిలా, జాబిల్లి లేని గగనంలా, పరిమళం తెలియని జాజిపూల మాలలా… తెలుగు సినిమా కనిపించదూ! ఎవరైనా ఒక్క మేలు చేస్తేనే మనం గుండెల్లో పెట్టి పూజించేసుకుంటాం. మరి ఇంత మేలు చేసిన బి.నాగిరెడ్డి రుణం ఎలా తీర్చుకోవాలి? ఓ విజయా సంస్థనీ- ఓ చందమామనీ – తెలుగు సినిమాకి […]పూర్తి వివరాలు ...
[divider](తవ్వా విజయ భాస్కర రెడ్డి, ఐ. ప్రవీణ్ కుమార్) తెలుగు సినీ పరిశ్రమలో అప్పటికీ , ఇప్పటికీ నటీనటుల అనుబంధాల్లో అనేక మార్పులు వచ్చాయని సీనియర్ నటి టిజి కమలాదేవి పేర్కొన్నారు. మారిన సినీ వాతావరణంలో తాను ఇమడలేకపోయానని, అందుకే క్రీడలపైనా, నాటకాల పైనా ఏకాగ్రత చూపానని ఆమె చెప్పారు. ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ‘నా బాల్యం’ శీర్షిక కోసం కమలాదేవిని చెన్నైలోని ఆమె నివాసంలో కలిసినపుడు ఆమె తన బాల్య స్మృతులను ఇలా పంచుకున్నారు….పూర్తి వివరాలు ...
‘ఏమానందము భూమీతలమున శివతాండవమట.. శివలాస్యంబట! వచ్చిరొయేమో వియచ్ఛరకాంతలు జలదాంగనలై విలోకించుటకు ఓహోహోహో.. ఊహాతీతము ఈయానందము ఇలాతలంబున..!’ సరస్వతీపుత్ర పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు ప్రొద్దుటూరు అగస్తేశ్వరస్వామి ఆలయంలో 18 రోజుల్లో రాసిన ‘శివతాండవంలోనివి ఈ పంక్తులు’. సంగీతం, సాహిత్యం మిళితమై నాట్యానికనుగుణంగా ఉన్న ఈ రచన ఆయనకు అనంత కీర్తి ప్రతిష్టలను ఆర్జించి పెట్టింది.పూర్తి వివరాలు ...
స్వర్ణయుగమని చెప్పుకునే విజయనగర చక్రవర్తుల తుది దిశలో సామాన్యుల బ్రతుకు కడగండ్ల పాలైంది. మండలాధీశుల భోగలాలసత్వం, అధికారుల దౌర్జన్యం, దోపిడీలు.. దానికితోడు జనులలో పేరుకుపోయిన అమాయకత్వం, అజ్ఞానం వారి జీవితాలను మరింత దుర్భరంగా చేసాయి. అర్థం లేని ఆచారాలు, దురాచారాలు, అధికార బలం, దబాయింపులతో ప్రజలను మోసంచేసి అణచిపెట్టేవారు. అటువంటి చిమ్మచీకటి తెరలను చీల్చుకుని వెలిగిన వేగుచుక్కలు యోగి వేమన, పోతులూరి వీరబ్రహ్మము . (1608-1693). ఇద్దరూ సమకాలీకులైనా, ఒకరికొకరు ముఖ పరిచయం లేకున్నా ఒకే ఆశయంతో […]పూర్తి వివరాలు ...
తెలుగు సాహిత్యంలో ధృవతార సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు. ఆయన బహు భాషా కోవిదుడు. రాయలసీమ గర్వించదగ్గ భారతీయ సాహిత్యకారుడు. సాహితీసేద్యంలో ఆయన ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఆ మహానుభావుని కుమార్తె నాగపద్మిని. నాన్నగారి (అయ్యగారు) జ్ఞాపకాలను ఆమె ఇలా పంచుకున్నారు …పూర్తి వివరాలు ...