అన్నమయ్య, కడప జిల్లాలో చాలా దేవాలయాలని దర్శించి, అక్కడి దేవుళ్ళ మీద కీర్తనలు రచించారు. వీటిలో కొన్ని ప్రదేశాలని కొంతమంది పరిశోధకులు, టిటిడి వాళ్ళు, వారి పరిశోధనలో గుర్తించడం జరిగింది. కాని ఇంకా కొన్ని ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయో తెలియలేదు. అలాంటి ప్రదేశాలలో, మేడిదిన్నె హనుమంతాలయం ఒకటి. ఈ ఊరి గురించి మాకు అన్నమయ్య కీర్తనల మీద పరిశోధన చేస్తున్న, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ద్వారా తెలిసింది. మేడిదిన్నె కడప జిల్లాలో పెద్దముడియం మండలానికి చెందిన గ్రామము. […]పూర్తి వివరాలు ...
కమలాపురం సమీపం లోని పెద్దచెప్పలి గ్రామంలో వెలసిన పురాతన దేవలాలకు ఎంతో విశిష్టమైన చరిత్ర ఉంది. అగస్త్యేశ్వర ఆలయం ఇక్కడి కామాక్షి సహిత అగస్త్యేశ్వర ఆలయాన్ని క్రీస్తు శకం 6వ శతాబ్దంలో రేనాటి చోళరాజైన పుణ్యకుమారుడు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఆయన పెద్దచెప్పలిని రాజధానిగా చేసుకుని తన రాజ్యాన్ని పాలించాడు. తన శాసనాలన్నింటినీ తెలుగులోనే వాడాడనటానికి అగస్త్యేశ్వరాలయంలోని స్తంభాలకు చెక్కబడిన తెలుగు శాసనాలే నిదర్శనం. ఇక్కడి ఆలయంలోని మూలవిగ్రహాలను అగస్త్యముని ప్రతిష్ఠించినట్లు మాలేపాడు శాసనం ద్వారా తెలుస్తోంది. […]పూర్తి వివరాలు ...
కడప జిల్లాలో ఉన్న అరుదైన ఆలయాలు ఈ అగస్త్యేశ్వరాలయాలు. సరైన ప్రచారానికి నోచుకోకుండా, జనబాహుళ్యంలో ఈ అరుదైన ఆలయాల గురించి చాల తక్కువ మందికి తెలుసు. చరిత్ర ప్రకారంగా చూస్తే, వీటిని రేనాటి చోళుల కాలంలో (క్రీ. శ. 6-9 శతాబ్దాల కాలం) నిర్మించారని శాసనాల ద్వారా తెలుస్తోంది. అగస్త్య మహాముని దక్షిణ భారతదేశ యాత్రలో, తాను బస చేసిన ప్రదేశాలలో శివలింగాలని ప్రతిష్టించారు అని కథనం. అగస్త్య ప్రతిష్టితమైన ఈ శివలింగాలు భారీలింగ రూపంలో, స్థంభములాగా, […]పూర్తి వివరాలు ...
ఆహోబిల మఠ సంస్తాపనాచార్యులైన శ్రీమాన్ శఠగోప యతీంద్రుల దగ్గర సకల వైష్ణవాగమాలను అభ్యసించిన పిదప దారి వెంబడి పలు ఆలయాలను దర్శిస్తూ తిరుమల చేరినాడు పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమయ్య. అన్నమయ్య దర్శించుకున్న రాయలసీమ జిల్లాలలోని ఆలయాల జాబితా : కడప జిల్లా: దేవుని కడప లక్ష్మీవెంకటేశ్వరాలయం ఒంటిమిట్ట కోదండరామాలయం గండికోట చెన్నకేశవాలయం గండికోట రామాలయం ప్రొద్దుటూరు చెన్నకేశవాలయం పొట్లదుర్తి చెన్నకేశవాలయం వెయ్యినూతులకోన నృసింహాలయం సంబటూరు చెన్నకేశవాలయం పెద్దచెప్పలి చెన్నకేశవాలయం మాచనూరు చెన్నకేశవాలయం పాలగిరి చెన్నకేశవాలయం కోన చెన్నకేశవాలయం […]పూర్తి వివరాలు ...
పుస్తకం : పులివెందుల రంగనాథ స్వామి వారి చరిత్రము , రచన: లగిసెట్టి వెంకటరమణయ్య, ప్రచురణ : 1929లో ప్రచురితం. సౌజన్యం : బ్రిటీష్ లైబ్రరీ, లండన్పూర్తి వివరాలు ...
కడప నగరంలోని అస్థానా-ఏ-మగ్దూమ్ ఇలాహీ (అమీన్‌పీర్ దర్గా లేదా పెద్ద దర్గా లేదా కడప దర్గా) దేశంలోని గొప్ప దర్గాలలో ఒకటి. ‘దక్షిణ భారత అజ్మీర్’గా పేరుగాంచిన ఈ దర్గాను నిత్యం వందలాది మంది భక్తులు దర్శించుకుంటారు. కడప దర్గాలో అడుగిడిన ప్రతి ఒక్కరూ తొలుత ప్రధాన గురువులైన హజరత్ ఖ్వాజా సయ్యద్‌షా పీరుల్లా మాలిక్ సాహెబ్ మజార్‌ను దర్శించుకుంటారు. అనంతరం అదే ప్రాంగణంలోని హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ మజార్‌తోపాటు ఆ వంశానికి చెందిన […]పూర్తి వివరాలు ...
భారతదేశంలో ప్రాచీన సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాలు, చారిత్రాత్మక ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలు, ప్రకృతి అందాలకు నిలయంగా ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. అలాంటి కట్టడాలలో కడప జిల్లాలోని నందలూరులో వెలసిన శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయం ఒకటి. శ్రీ సౌమ్యనాథాలయం అపురూప చోళ శిల్పకళా సంపదకు అలవాలమై బాహుదానదీ తీరాన అహ్లదకరమైన ప్రశాంత వాతావరణంలో తూర్పుముఖంగా వెలిసివుంది. కడప నుండి 45 కిలోమీటర్ల దూరంలో, రాజంపేట నుండి 10 కిలోమీటర్ల దూరంలో నందలూరులో ఈ ఆలయం వెలసివుంది. ఈ నందలూరును పూర్వపుకాలంలో నీరందనూరు, […]పూర్తి వివరాలు ...
రాయలకాలంలో రాయచోటి పక్కన ఉన్న మాండవ్య నది ఒడ్డున భద్రకాళి సమేత వీరభద్రుస్వామి దేవాలయం వెలసింది. వీరభద్రస్వామికి రాచరాయుడు అనే పేరుకూడ ఉంది. ఇక్కడ మార్చి నెలలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాలు జరిగిన తరు వాత మధ్యలో ఉన్న ద్వారాలు దాటుకొని సూర్యకిరణాలు స్వామి వారి పాదాలను తాకడం ప్రత్యేక విశేషం. ఆనవాయితీ మరో విశేషం ఏమంటే ముస్లింలలోని దేశముఖితేకు చెందిన వారు బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారికి పూజా సామాగ్రి పంపుతారు. ఆ పూజా సామగ్రితో పూజలు నిర్వహించి […]పూర్తి వివరాలు ...