॥పల్లవి॥చిత్త మతిచంచలము చేఁత బలవంతంబుతిత్తిలో జీవుఁ డిటు దిరిగాడుఁ గాక॥చ1॥కదిసి జీవుఁడు పుట్టఁగాఁ బుట్టినటువంటిమొదలుఁ దుదయును లేని మోహపాశములువదలు టెటువలెఁ దారు వదలించు టెటువలెనుపదిలముగ వీనిచేఁ బడి పొరలుఁ గాక॥చ2॥కడలేని జన్మసంగ్రహములై యెన్నఁడునుగడుగ వసములు గాని కర్మవంకములువిడుచు టెటువలెఁ దారు విడిపించు టెటువలెనువిడువనివిలాపమున వేఁగుటలు గాక॥చ3॥యిందులోపల జీవుఁ డెన్నఁడే నొకమాటుకందు వెఱిఁగి వివేకగతులభాగ్యమునఅందముగఁ దిరువేంకటాద్రీశు సేవించిఅందరాని సుఖంబు లందుఁ గాక రాగము: వరాళి రేకు: 0024-05 సంపుటము: 1-147 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ ఏడ సుజ్ఞాన మేడ తెలివి నాకు బూడిదిలో హోమమై పోయఁ గాలము ॥చ1॥ ఇదె మేలయ్యెడి నా కదె మేలయ్యెడి నని కదిసిన యాసచేఁ గడవలేక యెదురుచూచి చూచి యెలయించి యెలయించి పొదచాటు మృగమై పోయఁ గాలము ॥చ2॥ ఇంతటఁ దీరెడి దుఃఖ మంతటఁ దీరెడినని వింతవింత వగలచే వేఁగివేఁగి చింతయు వేదనలఁ జిక్కువడుచు నగ్ని- పొంతనున్న వెన్నయై పోయఁ గాలము ॥చ3॥ యిక్కడ సుఖము నా కక్కడ సుఖంబని యెక్కడికైనా నూర కేఁగియేఁగి గక్కన […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥వలపులధికము సేయు వైభవములుతలఁపు లధికము సేయుఁ దలపోఁతలు॥చ1॥కోపమధికము సేయుఁ గోరికలుతాప మధికము సేయు దమకంబులుకోపంబుఁ దాపంబుఁ గూడ నధికము సేయుయేపయిన మోహముల నేమందమే॥చ2॥మచ్చికధికము సేయు మన్ననలుయిచ్చ లధికము సేయు నీరసములుమచ్చికలు నిచ్చలును మగుడ నధికము సేయు-నెచ్చరిక కూటముల నేమందమే॥చ3॥అందమధికము సేయుఁ నైక్యములుపొందులధికము సేయుఁ బొలయలుకలుఅందములుఁ బొందులును నలరనధికముసేయు-నెందు నరుఁదగు వేంకటేశు కృపలు రాగము: శ్రీరాగం రేకు: 0024-04 సంపుటము: 1-146 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, శ్రీరాగంపూర్తి వివరాలు ...
॥పల్లవి॥పాయని కర్మంబులె కడుబలవంతము లనినప్పుడెకాయమునకు జీవునకునుఁ గర్తృత్వము లేదుvoltaren végbélkúpvoltaren végbélkúpvoltaren szemcsepp॥చ1॥ఆతుమ కలవ్యాపకమని తలపోసినపిమ్మటజాతియుఁ గులాభిమానముఁ జర్చింపనెరాదుభూతవికారములన్నియుఁ బురుషోత్తముఁ డనినప్పుడుపాతకముల పుణ్యంబులపని తనకే లేదు॥చ2॥పదిలంబుగ సర్వాత్మకభావము దలఁచినపిమ్మటముదమున నెవ్వరిఁ జూచినఁ మొక్కకపోరాదుకదిసిన యిప్పటి సుఖములె కడుదుఃఖములని తెలిసినచెదరక సంసారమునకు జేసాఁపనెరాదు॥చ3॥పరిపూర్ణుఁడు తిరువేంకటపతియనఁగా వినినప్పుడుయెరవుల హీనాధికములు యొగ్గులు మరి లేవుపరమాత్ముండగు నీతని భక్తులందలఁచిన యప్పుడుతిరముగ నీతనికంటెను దేవుఁడు మరి లేఁడు రాగము: సామంతం రేకు: 0007పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఏల సమకొను సుకృత మెల్ల వారికి మహ –మాలిన్యమున నాత్మ మాసినది గానread॥చ1॥కలికాలదోషంబు కడవరానిది గానతలఁపుదురితముల కాధారంబు గానబలుపూర్వకర్మములు పట్టరానివి గానమలమూత్రజన్మంబు మదకరము గాన॥చ2॥రాఁపైనగుణవికారములు బహళము గానఆఁపరానివి యింద్రియంబు లటుగానదాఁపరంబగుమమత దయదలంపదు గానకాఁపురముచే నా కప్పుకొనుఁ గాన॥చ3॥హృదయంబు చంచలం బిరవుగానదు గానచదువు బహుమార్గములఁ జాటు నటుగానయెదురనుండెడు వేంకట్వేరునినిజమైన-పదముపై కోరికలు పైకొనపు గాన రాగము: ఆహిరి రేకు: 0024-03 సంపుటము: 1-145 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, ఆహిరిపూర్తి వివరాలు ...
॥పల్లవి॥ మంగళము గోవిందునకు జయమంగళము గరుడధ్వజునకును మంగళము సర్వాత్మకునకు ధర్మస్వరూపునకూ,జయజయ ॥చ1॥ ఆదికినినాదైన దేవున కచ్యుతున కంభోజనాభున- కాదికూర్మంబైన జగదాధారమూర్తికిని వేదరక్షకునకును సంతతవేదమార్గవిహారునకు బలి- భేదికిని సామాదిగానప్రియవిహారునకు ॥చ2॥ హరికిఁ బరమేశ్వరునకును శ్రీధరునకును గాలాంతకునకును పరమపురుషోత్తమునకును బహుబంధదూరునకు సురమునిస్తోత్రునకు దేవాసురగణశ్రేష్టునకు కరుణా- కరునకునుఁ గాత్యాయనీ నుతకలితనామునకు ॥చ3॥ పంకజాసనవరదునకు భవపంకవిచ్ఛేదునకు భవునకు శంకరున కవ్యక్తునకు నాశ్చర్యరూపునకు వేంకటాచలవల్లభునకును విశ్వమూర్తికి నీశ్వరునకును పంకజాకుచకుంభకుంకుమపంకలోలునకు రాగము: లలిత రేకు: 0007-02 సంపుటము: 1-46 Tags: Annamacharya Keerthanalu, Telugu [&పూర్తి వివరాలు ...
॥పల్లవి॥సులభమా మనుజులకు హరిభక్తివలనొంది మరికదా వైష్ణవుఁడౌటgo॥చ1॥కొదలేని తపములు కోటానఁగోటులునదన నాచరించి యటమీఁదపదిలమైన కర్మబంధము లన్నియువదలించు కొనికదా వైష్ణవుఁడౌట॥చ2॥తనివోని యాగతంత్రములు లక్షలసంఖ్యఅనఘుఁడై చేసినయట మీదజననములన్నిట జనియించి పరమపా-వనుఁడై మరికదా వైష్ణవుఁడౌట॥చ3॥తిరిగితిరిగి పెక్కు తీర్ధములన్నియు-నరలేక సేవించినట మీఁదతిరువేంకటాచలాధిపుఁడైన కరిరాజవరదుని కృపఁగదా వైష్ణవుఁడౌట రాగము: సామంతం రేకు: 0024-02 సంపుటము: 1-144 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, సామంతంపూర్తి వివరాలు ...
॥పల్లవి॥మంచిదివో సంసారము మదమత్సరములు మానినకంచునుఁ బెంచును నొకసరిగాఁ దా చూచిననుreadlink॥చ1॥ఆపదలకుమ సంపదలకు నభిమానింపక యుండినపాపముఁ బుణ్యము సంకల్పములని తెలిసిననుకోపము శాంతము తమతమగుణములుగా భావించినతాపము శైత్యమునకుఁ దాఁ దడఁబడకుండినను॥చ2॥వెలియును లోపలయును నొకవిధమై హృదయం బుండినపలుకునుఁ బంతము దా నొక భావన దోఁచిననుతలఁపునఁ దిరువేంకటగిరిదైవము నెలకొనియుండినసొలపక యిన్నిటికినఁ దా సోఁకోరుచెనైనా రాగము: లలిత రేకు: 0007-01 సంపుటము: 1-45 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, లలితపూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఆపదల సంపదల నలయు టేమిట మానురూపింప నిన్నిటను రోసిననుఁ గాకreadlink॥చ1॥కడలేనిదేహరోగంబు లేమిట మానుజడనువిడిపించునౌషధసేవఁగాకవిడవ కడియాస తను వేఁచు టేమిట మానువొడలికలగుణమెల్ల నుడిగిననుఁగాక॥చ2॥దురితసంగ్రహమైన దుఃఖ మేమిట మానుసరిలేని సౌఖ్యంబు చవిగొన్నఁగాకకరుకైన మోహంధకార మేమిట మానుఆరిది తేజోమార్గ మలవడినఁగాక॥చ3॥చావులోఁ బెనగొన్నజన్మ మేమిట మానుయీవలావలి కర్మ మెడసినఁ గాకభావింప నరుదైనబంధ మేమిట మానుశ్రీ వేంకటేశ్వరుని సేవచేఁ గాక రాగము: వరాళి రేకు: 0024-01 సంపుటము: 1-143 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, వరాళిపూర్తి వివరాలు ...