॥పల్లవి॥దేహము దా నస్ధిరమట దేహి చిరంతనుఁడౌనటదేహపు మోహపు నేఁతలు తీరుట లెన్నఁడొకో॥చ1॥కన్నులఁబుట్టినకాంక్షలు కప్పికదా దుర్బోధలకన్నులు మనసునుఁ దనియక గాసిఁబడిరి జనులుతన్నిఁక నెరుఁగుట లెన్నఁడు తలఁపులు దొలఁగుట లెన్నఁడుతిన్నని పరవశములచేఁ దిరుగుట లెన్నఁడొకో॥చ2॥సిగ్గులు దొలఁగనియాశలఁ జిక్కికదా దుర్మానపు-సిగ్గుల యెగ్గులచేతను చిక్కువడిరి జనులుసిగ్గులు దొలఁగుట యెన్నఁడు చిత్తము లోనౌటెన్నఁడుతగ్గుల మొగ్గుల నేఁతలు తలఁగుట లెన్నఁడొకో॥చ3॥మనసు బుట్టిన యాతఁడు మనసునఁ బెనగొని తిరుగఁగమనసే తానగు దైవము మరచిరి యుందరునుఅనయము తిరువేంకటపతి యాత్మఁదలఁచి సుఖింపుచుఘనమగు పరమానందము కలుగుట లెన్నఁడొకో రాగము: శ్రీరాగం రేకు: […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥మనసిజ గురుఁడితఁడో మఱియుఁ గలఁడో వేద-వినుతుఁ డీతఁడు గాక వేరొకఁడు గలఁడోreadlisinopril and drivinglisinopriland.netlisinopril and drivingis-aber.netmebendazol dosierungmebendazol uden పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఏఁటిసుఖము మరి యేఁటిసుఖము నొక-మాటమాత్రమున నటమటమైన సుఖముread॥చ1॥కొనసాగుదురితములె కూడైన సుఖముతనువిచారములలో దాకొన్న సుఖముపనిలేనియాసలకుఁ బట్టయిన సుఖమువెనుకముందరఁ జూడ వెరగైన సుఖము॥చ2॥నిందలకులోనైన నీరసపు సుఖముబొందికిని లంచంబుపుణికేటి సుఖముకిందుపడి పరులముంగిలి గాచుసుఖముపందివలె తనుఁదానె బ్రదికేటి సుఖము॥చ3॥ధృతిమాలి యిందరికి దీనుఁగడు సుఖముమతిమాలి భంగములు మఱపించు సుఖముపతివేంకటేశుకృప పడసినది సుఖముయితరంబులన్నియును నీపాటి సుఖము రాగము: కాంబోది రేకు: 0022-05 సంపుటము: 1-135 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, కాంబోదిపూర్తి వివరాలు ...
॥పల్లవి॥వైష్ణవులుగానివార లెవ్వరు లేరువిష్ణుప్రభావ మీవిశ్వమంతయుఁ గానeuthyrox 150euthyrox 88॥చ1॥అంతయు విష్ణు మయం బట మరి దేవ-తాంతరములు గలవననేలాభ్రాంతిఁ బొంది యీ భావము భావించి-నంతనే పుణ్యులవుట దప్పదుగాన॥చ2॥యెవ్వరిఁ గొలిచిన నేమిగొరఁత మరియెవ్వరిఁ దలచిన నేమిఅవ్వలివ్వల శ్రీహరిరూపుగానివా-రెవ్వరు లేరని యెరుకదోచినఁ జాలు॥చ3॥అతిచంచలంబైన యాతుమ గలిగించు-కతమున బహుచిత్తగతులైయితరులఁ గొలిచిన యెడయక యనాథ-పతితిరువేంకటపతి చేకొనుఁగాక రాగము: ధన్నాసి రేకు: 0006-01 సంపుటము: 1-36 Tags: పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఎంతనేయఁగలేదు యిటువంటివిధి యభవు-నంతవానిని భిక్షమడుగు కొనఁ జేసెopen॥చ1॥కోరి చంద్రునిఁ బట్టి గురుతల్ప గునిఁ జేసెకూరిమలరఁగ నింద్రుఁ గోడిఁ జేసెఘోరకుడువఁగఁ ద్రిశంకుని నంత్యజునిఁ జేసెవీరుఁడగునలుఁ బట్టి విద్రూపుఁ జేసె॥చ2॥అతివ నొడ్డుగఁ జూదమాడ ధర్మజుఁ జేసెసతి నమ్ముకొన హరిశ్చంద్రుఁ జేసెకుతిలపడ శూద్రకుని గొఱ్ఱెముచ్చుగఁ జేసెమతిమాలి కురురాజు మడుఁగుచొరఁ జేసె॥చ3॥పడనిపాట్ల బరచి బ్రహ్మతల వోఁజేసెతొడరి కాలునికాలు దునియఁ జేసెఆడర నీవిధికి విధియగు వేంకటేశుకృపపడయకుండఁగ భంగపడకపోరాదు రాగము: ముఖారి రేకు: 0022-04 సంపుటము: 1-134 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఏ నిన్ను దూరక నెవ్వరి దూరుదు నీ-వాని నన్నొకయింత వదలక నను నేలవలదాread॥చ1॥అపరాధిఁగనక నన్నరసి కావుమనిఅపరిమితపుభయ మంది నీకు శరణంటిఁగాకనెపములేక నన్ను నీకుఁ గావఁగ నేలఅపవర్గరూప దయాంబుధి తిరువేంకటాధిపా॥చ2॥ఘనపాపిఁ గనక నీకరుణ గోరి నీ-వనవరతము నాయాతుమ విహరించుమంటిఁ గాకయెనసి నన్నుఁ గాచు టేమి యరుదు నీకు-ననఘుఁడ పరమతత్త్వానంద తిరువేంకటాధిప రాగము: సామంతం రేకు: 0005-06 సంపుటము: 1-35 Tags: Annamacharya Keerthanalu, Telugu పూర్తి వివరాలు ...
॥పల్లవి॥చూడఁజూడ మాణిక్యాలు చుక్కలవలె నున్నవియీడులేని కన్నులవె యిన చంద్రులుvoltaren végbélkúpvoltaren végbélkúpvoltaren szemcsepp॥చ1॥కంటిఁగంటి వాఁడెవాఁడె ఘనమైన ముత్యాలకంటమాలలవే పదకములు నవెమింటి పొడవైనట్టి మించుఁ గిరీటంబదెజంటల వెలుఁగు శంఖచక్రా లవె॥చ2॥మొక్కుమొక్కు వాఁడెవాఁడె ముందరనే వున్నాఁడుచెక్కులవే నగవుతో జిగిమో మదెపుక్కిట లోకములవె భుజకీర్తులును నవెచక్కనమ్మ అలమేలు జవరాలదె॥చ3॥ముంగైమురాలును నవె మొలకఠారును నదెబంగారు నిగ్గులవన్నె పచ్చబట్టదెయింగితమెరిఁగి వేంకటేశుఁడిదె కన్నులకుముంగిటి నిధానమైన మూలభూతమదె రాగము: వరాళి రేకు: 0022పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఇన్నియుఁ గలుగు టేజన్మముననైనఁజెన్నలర హరిసేవ సిద్దించుకొరకుopenlisinopril and drivinglisinopriland.netlisinopril and driving॥చ1॥అరయ వేదాధ్యయన మది బ్రహ్మశుద్దికొర-కిరవైనశాస్త్రంబు లెరుకకొరకుతరి యజ్ఞములు రుణోత్తారమయ్యెడికొరకుసరిలేనిదానములు జన్మములకొరకు॥చ2॥మమకారదూరంబు మనసు గెలుచుటకొరకుసమవివేకంబు శాంతములకొరకుఅమరశ్రీతిరువేంకటాధ్రీశుమనసు నీ-జముగెలుచు బ్రహ్మవిజ్ఞానంబుకొరకు రాగము: నాదరామక్రియ రేకు: 0005-05 సంపుటము: 1-34 పూర్తి వివరాలు ...
॥పల్లవి॥చలపాదిరోగ మీసంసారము నేఁడుబలువైనమందు విష్ణుభక్తి జీవులకుopen॥చ1॥కీడౌట మది నెఱింగియు మోహ మెడల దిదిపాడైన విధికృతము బలవంతముయీడనే ఇది మాన్ప హితవైన వజ్రాంగిజోడువో హరిఁ దలంచుట జీవులకును॥చ2॥హేయమని తెలిసి తా నిచ్చగించీ యాత్మపాయ దీరతిసుఖము బలవంతముమాయ నుగ్గులుసేయ మాధవునిదంచనపు-రాయివో వైరాగ్యరచన జీవులకు॥చ3॥పొలయుదురితంపు రొంపులు దన్ను వడి ముంచపలుమారుజన్మ మీబలవంతమునెలవుకొని సకలంబు నిర్మలముగాఁ గడుగు-జలధివో వేంకటేశ్వరుఁడు జీవులకు రాగము: ముఖారి రేకు: 0022-02 సంపుటము: 1-132 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, [&పూర్తి వివరాలు ...