అలమేలు మంగమ్మ – అనుగ్రహం అన్నమయ్య అలసటను, ఆకలిని ఎవరు గమనించినా ఎవరు గమనిమ్పకపోయినా అలమేలు మంగమ్మ గమనించి కరుణించింది. మంగమ్మ పెద్ద ముత్తైదువులా అన్నమయ్యను సమీపించింది. తన ఒడిలో చేర్చుకుని శరీరం నిమురుతూ “లే! బాబూ, లేచి ఇలా చూడు” అన్నది. అన్నమయ్యకు తన తల్లి లక్కమాంబ పిలుస్తున్నట్లనిపించింది. “అమ్మా!” అని లేచాడు. కానీ కళ్ళు కనిపించడం లేదు. అమృతం లాంటి అమ్మ స్పర్శ; తేనెలూరే తల్లి పలుకులు. అన్నమయ్యకు దిక్కు తెలియడం లేదు. దీనంగా […]పూర్తి వివరాలు ...
ఇంటి పని ఎవరు చూస్తారు? నారయణసూరిది పెద్ద కుటుంబం. ఉమ్మడి కుటుంబాలలో చిన్నచిన్న కలతలు తప్పవు. వాళ్ళ కోపతాపాలు అర్థం లేనివి, ఇంతలో తగవులాడతారు. అంతలో కలిసిపోతారు. ఒకనాడు అందరూ కలిసికట్టుగా అన్నమయ్య మీద విరుచుకుపడ్డారు. అన్నమయ్యకు దిక్కు తెలియలేదు. “ఎప్పుడూ ఆ దండె భుజాన తగిలించుకుని పిచ్చి పాటలు పాడుకోవడమేనా? ఇంట్లో పనీ పాట ఎవరు చూస్తారు?” అని ఇంటివాళ్ళు దెప్పిపొడిచారు. “గాలి పాటలు కట్టిపెట్టి , అడవికెళ్ళి పశువులకింత గడ్డి తెచ్చి పడేయ్” ఏ […]పూర్తి వివరాలు ...
పాము కరవలేదు సరికదా! ఎదురుగ చింతలమ్మ ప్రత్యక్షమైంది. నారాయాణయ్య ఏడుస్తూ ఆమె పాదాల మీద పడ్డాడు. చింతలమ్మ ఆ బాలుని ఓళ్ళో చేర్చుకొని వూరడించింది.”ఎందుకు బాబు ఈ అఘాయిత్య?. నీ మూడోతరంలో గొప్ప హరి భక్తుడు జన్మిస్తాడు. అతని వల్ల మీ వంశమే తరిస్తుంది. నీకు చదువు రాకపోవడమేమిటి వెళ్ళు, తాళ్ళపాక చెన్నకేశవస్వామే నీకు అన్నీ అనుగ్రహిస్తాడు” అని చింతలమ్మ బాలుని చింత తీర్చి అదృశ్యమైంది. అమ్మ చెప్పినట్లు నారాయాణయ్యకు చెన్నకేశవస్వామి దయవల్ల అన్ని విద్యలూ సిద్ధించాయి. […]పూర్తి వివరాలు ...
అదిగో తెలుగు తల్లి తన కన్నబిడ్డకు గోరుముద్దలు తినిపిస్తూ పాడుతూంది. “చందమామ రావో జాబిల్లి రావో,మంచి కుందనంపు పైడికోర వెన్నపాలు తేవో” ఈ చందమామ పాట వ్రాసిందెవరో తెలుసా! తాళ్లపాక అన్నమాచార్యులు/అన్నమయ్య – వేంకటేశ్వరస్వామికి గొప్ప భక్తుడు; మహా కవి. మన తెలుగులో తొలి వాగ్గేయకారుడు. వాగ్గేయకారుడంటే పాటలు స్వయంగా వ్రాసి పాడేవాడని అర్ధం. వేంకటేశ్వరుడు, అన్నమయ్య మేలుకొలుపు పాట పాడుతూంటే విని నిద్రలేచేవాడు. మళ్ళీ ఆయన జోలపాట పాడందే నిద్రపోడు. స్వామికే గాదు అమ్మవారికి కూడ […]పూర్తి వివరాలు ...
ఇందరికి నభయంబు లిచ్చుచేయి కందువగు మంచి బంగారు చేయి॥ వెలలేని వేదములు వెదకి తెచ్చినచేయి చిలుకు గుబ్బలికింద చేర్చు చేయి కలికి యగు భూకాంత కౌగిలించినచేయి వలనైన కొనగోళ్ళ వాడిచేయి॥ తనివోక బలిచేత దానమడిగిన చేయి ఒనరంగ భూదానమొసగు చేయి మొనసి జలనిధి యమ్ముమొనకు దెచ్చినచేయి ఎనయ నాగేలు ధరియించు చేయి॥ పురసతుల మానములు పొల్లసేసినచేయి తురగంబుబరపెడి దొడ్డచేయి తిరువేంకటాచలాధీశుడై మోక్షంబు తెరువు ప్రాణులకెల్ల తెలిపెడి చేయి॥పూర్తి వివరాలు ...
గండికోట శ్రీరామచంద్రుని స్తుతించిన అన్నమయ్య సంకీర్తన విజయనగర సామ్రాజ్య కాలంలో వేలుగులీని హైందవ సంప్రదాయానికీ, సంస్కృతికీ ప్రతీకగా నిలిచిన గండికోటను చేరిన ‘పదకవితా పితామహుడు’ అక్కడి రాముని సేవించి తరించినాడు. గండికోట శ్రీరామచంద్రునికి అన్నమయ్య సమర్పించిన సంకీర్తనా నీరాజనమిది…. వర్గం : శృంగార సంకీర్తన కీర్తన సంఖ్య: 165 (19వ రాగిరేకు) రాగం: దేవగాంధారి ‘రాజవు (పు) నీకేదురేదీ’ సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి. ‘రాజవు నీకేదురేదీ’ సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ […]పూర్తి వివరాలు ...
గండికోట చెన్నకేశవుని స్తుతించిన అన్నమయ్య సంకీర్తన చెన్నకేశవుని యెడల అపారమైన భక్తిప్రపత్తులు కలిగిన అన్నమయ్య తన కీర్తనలలో ఆ స్వామిని స్తుతించి తరించినాడు. విజయనగర సామ్రాజ్య కాలంలో వేలుగులీని హైందవ సంప్రదాయానికీ, సంస్కృతికీ ప్రతీకగా నిలిచిన గండికోటలో చెన్నకేశవుని ఆలయం ఒకటి ఉండేది. ఈ ఆలయాన్ని దర్శించిన అన్నమయ్య ఇక్కడి చెన్నకేశవుడిని ఈ విధంగా స్తుతిస్తున్నాడు… రాగం: సామంత కీర్తన సంఖ్య: ౩౧౪(314), ౨౭ (27) వ రాగి రేకు పల్లవి: చీరలియ్యగదవోయి చెన్నకేశవా! చూడు చేరడేసి కన్నుల వో చెన్నకేశవా […]పూర్తి వివరాలు ...
నల్లబల్లి చెన్నకేశవునిపై అన్నమయ్య రాసిన సంకీర్తన – 1 శఠగోప యతీంద్రులకడ సకల వైష్ణవాగమములను అభ్యసించిన అన్నమయ్య జీవితమే ఒక ధీర్ఘశరణాగతి. కడప గడపలో జనియించిన ఈ వాగ్గేయకారుడు తన నుతులతో వేంకటపతిని కీర్తించి ఆనంద నృత్యం చేసినాడు. నల్లబల్లి – కడప జిల్లా, ముద్దనూరు మండలంలోని ఒక గ్రామం. ఇక్కడ గల చెన్నకేశవ స్వామిని పలుమార్లు దర్శించి తరించిన అన్నమయ్య, ఆ స్వామిపై పలు సంకీర్తనలను రాసి – పాడినాడు. Your browser does not […]పూర్తి వివరాలు ...
ఈ ఊరు కడప జిల్లా సిద్దవటం తాలూకాలో లో వుంది. అన్నమయ్య మేనమామ గారి ఊరు మాడుపూరు.ఇక్కడి స్వామి చెన్న కేశవ స్వామి. అన్నమయ్య సంకీర్తనలపై పరిశోధన చేసిన శ్రీ మల్లెల శ్రీహరి గారు మాడుపూరు చేన్నకేశవునిపై ఇదొక్క సంకీర్తన మాత్రమె అందుబాటులో ఉన్నట్లు తేల్చారు.పూర్తి వివరాలు ...