జానపద గీతాలు

ఆశలే సూపిచ్చివా – వరుణా…. జానపదగీతం

రాయలసీమ రైతన్నా

వర్గం: చెక్కభజన పాట పాడటానికి అనువైన రాగం: సావేరి స్వరాలు (ఏక తాళం) ఈ పొద్దు వానొచ్చె మలిపొద్దు సినుకోచ్చె కొండంత మబ్బొచ్చె కోరినా వానల్లు కురిపిచ్చి పోతావని ఆశలే సూపిచ్చివా – వరుణా అన్యాలమే సేచ్చివా ఏరులెండి పాయ సెరువులెండి పాయ దొరువులెండి పాయ సేల్లు బీల్లయిపాయ నీకు సేసిన పూజలన్ని …

పూర్తి వివరాలు

పచ్చొడ్లు నే దంచి…పాలెసరు బెట్టీ – జానపదగీతం

ఇసుర్రాయి

వర్గం: ఇసుర్రాయి పాట పచ్చొడ్లు నే దంచి పాలెసరు బెట్టీ పాలేటి గడ్డనా మూడు నిమ్మల్లూ మూగ్గూ నిమ్మల కింద ముగ్గురన్నల్లూ ముగ్గూరన్నల కొగడు ముద్దు తమ్మూడు పెద్దవన్న నీ పేరు పెన్నోబలేసూ నడిపెన్న నీ పేరు నందగిరిస్వామీ సిన్నన్న నీ పేరు సిరివెంకటేసూ కడగొట్టు తమ్మూడ కదిరి నరసింహా ముగ్గురన్నలతోడ నాకి …

పూర్తి వివరాలు

బండీరా..పొగబండీరా… జానపదగీతం

బండీరా

వర్గం: కోలాటం పాట పాడటానికి అనువైన రాగం: హనుమత్తోడి స్వరాలు (తిశ్రం) బండీరా..పొగబండీరా దొరలేక్కే రైలూబండీరా దొరసానులెక్కే బండీరా అది జాతోడెక్కే బండీరా ||బండీరా|| బండీ సూస్తే ఇనుమూరా దాని కూతెంతో నయమూరా రాణీ లెక్కేది బండీరా రాజూ లెక్కేది బండీరా ||బండీరా|| పయనమంటె రైలుబండీ బయలుదేరుతాదన్నా బుగ బుగ సేలల్లో బుగ్గటించెను …

పూర్తి వివరాలు

నా కొడకా నాగయో…. జానపదగీతం

ఒక తల్లి తైలవర్ణ చిత్రం (చిత్రకారుడు: మురళి)

వర్గం: కలుపు పాట పాడటానికి అనువైన రాగం: సావేరి స్వరాలు (ఏకతాళం) దాయాదుల కారణంగా కొడుకు వ్యసనాలు మరిగి చివరకు జైలు పాలయినాడు. సర్కారోల్లు ఇంటికొచ్చి కొడుకుకు బేడీలు వేసి తీసుకుపోవటంతో అవమానపడిన ఆ తల్లి బాధతో రగిలిపోయింది. ఆ తల్లి బాధను జానపదులు ఇలా పాటగా పాడినారు.. నగుమాసం నినుమోసి నినుకంటిరో …

పూర్తి వివరాలు

సీరల్ కావలెనా – జానపద గీతం

అందమైన దాన

వర్గం: జట్టిజాం పాట పాడటానికి అనువైన రాగం: హిందుస్తాని తోడి రాగస్వరాలు (ఆదితాళం) అందమైన మేనత్త కొడుకు పైన ఆపలేని అనురాగం పెంచుకుంది ఆ పల్లె పడుచు. అందుకే బావ చీరెలూ, సొమ్ములూ తెచ్చిస్తానని సెప్పినా వద్దంటుంది ఆ మరదలు పిల్ల. ఆ మరదలు పిల్ల మనసులోని మాటను జానపదులు ఇలా పాటలా …

పూర్తి వివరాలు

బొబ్బిళ్ళ నాగిరెడ్డిని గురించిన జానపదగీతం

Kuchipudi

బొబ్బిళ్ళ నాగిరెడ్డి గడేకల్లులో వెలసిన భీమలింగేశ్వర స్వామి వరప్రసాది అని ప్రతీతి. ఇతడు శ్రీమంతుల ఇల్లు దోచి బీదలకు పంచి పెట్టేవాడట. పట్టపగలు నట్ట నడివీధిలో ప్రత్యర్ధులు నాగిరెడ్డిని హతమార్చినారుట. ఆ సంఘటనను జానపదులు ఇలా పాటగా పాడినారు… చుట్టూ ముట్టూ పల్లెలకెల్ల శూరుడమ్మ నాగిరెడ్డి డెబ్బై ఏడు పల్లెలకెల్లా దేవుడమ్మా భీమలింగ …

పూర్తి వివరాలు

నలుగూకు రావయ్య నాదవినోదా! – జానపదగీతం

nalugu

నలుగు పెట్టేటప్పుడు పెండ్లి కొడుకును వేణుగోపాలునిగా భావించి ముత్తైదువులు పాడే పాట ఇది… వర్గం: నలుగు పాట నలుగూకు రావయ్య నాదవినోదా వేగామె రావయ్య వేణూగోపాల ||నలుగూకు|| సూరి గన్నెరి పూలు సూసకము కట్టించి సుందరుడ నాచేత సూసకమందుకో ||నలుగూకు|| సన్నమల్లెలు దెచ్చి సరమూ కట్టించి సరసూడ నాచేత సరమందవయ్య ||నలుగూకు|| చెండుపూలూ …

పూర్తి వివరాలు

నీళ్ళకు బోర తిమ్మ – జానపదగీతం

పిల్లల జానపదాలు

వర్గం: పిల్లల పాట నీళ్ళకు బోర తిమ్మ నిద్దరొస్తాదమ్మ కట్టెలు తేరా తిమ్మ కడుపు నస్తాదమ్మ నట్టుకు బోర తిమ్మ నడుము నస్తాదమ్మ పిన్నె దీసుకోర తిమ్మ ఇంతె సాలు మాయమ్మ సేనికి బోర తిమ్మ సినుకులొస్తాయమ్మ ఇంట్లో పడుకోర తిమ్మ ఇంతె చాలు మాయమ్మ పాడినవారు: వడ్లూరి నారాయణరెడ్డి, రాకట్ల, రాయడుర్గము …

పూర్తి వివరాలు

పొద్దన్నె లేసినాడు కాదరయ్యా – జానపదగీతం

jonna

వర్గం: హాస్యగీతాలు (పసలకాపర్లు పాడుకొనే పాట) పాడటానికి అనువైన రాగం : తిలకామోద్ స్వరాలు (ఆదితాళం) పొద్దన్నె లేసినాడు కాదరయ్యా వాడు కాళ్ళు మగం కడిగినాడు కాదరయ్యా(2) కాళ్ళు మగం నాడు కాదరయ్యా వాడు పంగనామం పీకినాడు కాదరయ్యా పంగనామం పీకినాడు కాదరయ్యా వాడు సద్ది సంగటి తిన్యాడు కాదరయ్యా సద్ది సంగటి …

పూర్తి వివరాలు
error: