అపర అయోధ్యగా కొనియాడబడుతున్న ఏకశిలానగరం ఒంటిమిట్ట క్షేత్రానికి సంబంధించి పురాణ, చారిత్రక విశేషాలున్నాయి. బహుళ ప్రచారంలో ఉన్న కథనాల కన్నా మరింత ఆసక్తిదాయకమైన విశేషాలు కూడా ఉన్నాయి. శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాల సందర్భంగా కొన్ని విశేషాలు … ఒంటిమిట్టలో మాత్రమే… రాత్రిపూట కల్యాణం సాధారణంగా అన్ని దేవాలయాల్లోనూ దేవతామూర్తుల కల్యాణోత్సవాలను పగలు మాత్రమే నిర్వహిస్తారు. కానీ కేవలం ఒంటిమిట్ట క్షేత్రం లో మాత్రమే రాత్రి 11 గంటల తర్వాత నిర్వహిస్తారు. దీనికో పురాణగాథ ఉందని పరిశోధకులు చెబుతున్నారు. […]పూర్తి వివరాలు ...
కడప జిల్లాలోని దర్శనీయ స్థలాలు, పర్యాటక ఆకర్షణల వివరాలు. కడప జిల్లాలోని పర్యాటక ప్రదేశాలకు వెళ్లే మార్గాల వివరాలు.
ప్రొద్దుటూరు అమ్మవారిశాల (శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం) పట్టణానికే తలమానికంగా విరాజిల్లుతోంది. జగములనేలే జగజ్జననిగా, భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ప్రసిద్ధికెక్కింది. శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం 121 ఏళ్ల క్రితం కామిశెట్టి కొండయ్య శ్రేష్టి ఆధ్వర్యంలో రూపుదిద్దుకొంది. చిన్నకొండయ్యకి కలలో అమ్మవారు కనిపించి తనకోసం ఒక ఆలయాన్ని నిర్మించాలని కోరడంతో 1890 లో ప్రొద్దుటూరులో ఆయన అమ్మవారిశాలను నిర్మించారు. ఆలయ నిర్మాణంలో నాణ్యమైన రంగూన్ టేకును వినియోగించారు. ప్రొద్దుటూరు అమ్మవారిశాలలోని శిల్పాలు ఎంతో ఆకర్షణీయమైనవిగా […]పూర్తి వివరాలు ...
సింహాద్రిపురం : కోరి కొలిచేవారికి కొంగుబంగారంగా, పిలిచిన పలికే దేవుడు,గరుత్మంతుడుఅనే విశ్వాసం వందలాది మంది భక్తుల్లో వేళ్లూనుకుంది. సింహాద్రపురం మండలం కోవరంగుట్టపల్లె గ్రామ శివార్ల భక్తుల సందడితో గరుత్మంతుడి ఆలయం అలరారుతోంది. పూర్వీకుల సందేసానుసారంగా కోవరంగుట్టపల్లె గ్రామ శివార్లలో పురాతనకాలంనాటి ఓ సమాధి ఉంది. చాలా కాలం నుంచి ఈ సమాధి పట్ల ఎవ్వరూ శ్రద్ధచూలేదు. అయితే ప్రతి ఏటా శ్రీరామనవమి పండుగరోజున ప్రత్యేక పూజలు చేస్తారు. కొన్నాళ్ల తర్వాత భాస్కర్ అనే భక్తుడు గరుత్మంతుడు చరిత్ర […]పూర్తి వివరాలు ...
ప్రపంచంలో గల వృక్ష సంపదలో దాదాపు 12శాతం మొక్కలు భారత దేశంలో వున్నాయి. దేశంలో 5 వేల శైవలాల జాతులు, 1,600 లైకెన్ జాతులు, 20వేల శిలీంధ్ర జాతులు, 2,700 బ్రయోఫైట్లు, 600 టెరిడోఫైట్లు, 18000 పుష్పించు మొక్కల జాతులువున్నాయి.రాయలసీమ వైశాల్యం 69,043 చదరపు కీలోమీటర్లు. రాయలసీమలో మూడు రకాల అడవులున్నాయి.చిత్తడి ఆకురాల్చు అడవులు, మొదటివి. కర్నూలు జిల్లాలోనిపూర్తి వివరాలు ...
సుమారు వందేళ్ళ క్రితమే అంతరించిపోయిందని భావించిన కలివికోడి ఇరవై ఏళ్ళ కిందట 1986వసంవత్సరంలో మనదేశంలోని తూర్పు కనుమల్లో భాగమైన నల్లమల, శేషాచలం పర్వతపంక్తులలోని శ్రీ లంకమల్లేశ్వర అభయారణ్యంలో సిద్దవటం-బద్వేలు మధ్య అటవీ ప్రాంతంలో ప్రత్యక్షమై పక్షిశాస్త్ర వేత్తలనూ, ప్రకృతి ప్రేమికులనూ ఆశ్చర్యానికి గురిచేసింది. కలివికోడి రక్షణకు గత ఇరవై ఏళ్ళగా పలుచర్యలను తీసుకుంటున్నారు. ..ఆ పక్షి ఉనికికే ప్రమాదం కలిగే రీతిలో జరిగిన పరిణామాలు ప్రపంచవ్యాప్త చర్చకు దారితీశాయి. కలివికోడికి ఆవాస ప్రాంతమైన లంకమల పరిథిలో తెలుగుగంగ […]పూర్తి వివరాలు ...
భైరేని లేదా భైరవకోన కడప జిల్లాలోని ఒక ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రము. మైదుకూరు పట్టణానికి ౩౦ కిలోమీటర్ల దూరంలో నల్లమల అటవీ ప్రాంతం లో వెలసిన భైరవకోన లేదా భైరేని భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రతి ఏట శివరాత్రి సందర్భంగా భైరవకోన తిరుణాల వైభవోపేతంగా జరుగుతుంది. ఈ భైరవకోన చరిత్ర ఇలా ఉంది . పూర్వం అహోబిలం సమీపంలో నల్లమలలో ప్రవహించే భవనాశి నది జలప్రళయానికి సూచనగా ఉప్పొంగడం మొదలయ్యింది. దీనితో అహోబిల నరసింహ స్వామి ఈ […]పూర్తి వివరాలు ...
వై.ఎస్.ఆర్ జిల్లాలోని మండల కేంద్రమైన సిద్ధవటంలో ఉన్న శత్రుదుర్భేద్యమైన కోట ఆ నాటి స్మృతులను నేటికీ కళ్లకు కట్టినట్టు ఆవిష్కరిస్తుంది. రాష్ట్రానికే కాకుండా దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన ఈ సిద్ధవటం కోట మన చారిత్రక సంపదల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. పూర్వకాలంలో సిద్ధవటం పరిసర ప్రాంతాల్లో సిద్ధులు ఎక్కువగా నివసిం చేవారట. వారు నివాసం ఉండే వట వృక్షాలు (మఱ్ఱి చెట్లు) విస్తారంగా ఉండేవట. అందుకే ఈ ప్రాంతానికి సిద్ధవటం అని పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతుంటారు. […]పూర్తి వివరాలు ...