పౌరాణికం 1. సీతారామలక్ష్మణులు అరణ్యవాసం చేస్తున్నపుడు సీతమ్మ కోసం రామయ్య బాణం సంధించి భూమి నుంచి నీరు తెప్పించిన చోటు ఇక్కడుంది. అక్కడే నేడు రామతీర్థం వెలసింది. 2. సీతమ్మ కోసం వెతుకుతూ జాంబవంతుడు ఇక్కడ ఒక రాత్రి నిద్రించాడు. మరునాటి ఉదయం ఒక శిలలో సీతారామలక్ష్మణుల్ని, భావించి నమస్కరించి అన్వేషణకు బయలుదేరాడు. ఈ గుట్ట మీద నిర్మాణం అయిందే కోదండరామాలయం. భౌగోళికం తిరుమల నుంచి కడపకు వస్తున్న శేషాచలం కొండలు ఒంటిమిట్టను దాటుకొంటూ విస్తరించాయి. ఆ […]పూర్తి వివరాలు ...
కడప జిల్లాలోని దర్శనీయ స్థలాలు, పర్యాటక ఆకర్షణల వివరాలు. కడప జిల్లాలోని పర్యాటక ప్రదేశాలకు వెళ్లే మార్గాల వివరాలు.
వైష్ణవులకిది మధ్య ఆహోబిలమూ శైవులకిది మధ్య కైలాసమూ కడప నుంచి కర్నూలుకు వెళ్ళే మార్గంలో పుష్పగిరి క్షేత్రం కొండపై ఉంది. కింద పుష్పగిరి గ్రామం ఉంది. ఇది హరిహరాదుల క్షేత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రంలో ప్రాచీన కాలంలో వందకు పైగా ఆలయాలు ఉండేవన్న పురాణగాధ ప్రచారంలో ఉంది. బ్రహ్మాండ, వాయు పురాణాల్లో ఈ క్షేత్ర మహిమను వ్యాస మహర్షి ప్రస్తావించారుట. ఆది శంకరులు పూజించిన చంద్రమౌళీశ్వర లింగం, విద్యారణ్యస్వామి ప్రతిష్ఠించిన శ్రీచక్రంతో దర్శనీయ క్షేత్రంగా […]పూర్తి వివరాలు ...
కడప జిల్లా దువ్వూరు మండలం చింతకుంట లోని శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి దేవస్థానం ఎంతో ప్రాచీనమైనది. చింతకుంట గ్రామ శివార్ల లోని చెరువు , గ్రామంలో శిధిలావస్థలో ఉన్న శ్రీ సోమేశ్వరస్వామి ఆలయం చింతకుంట గ్రామ పురాతన చరిత్రకు, గతంలో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక వైభవానికి తార్కాణంగా నిలుస్తున్నాయి. చెన్నకేశవ ఆలయం జనమేజయుని కాలంలో నిర్మించబడిందని గ్రామస్తులు చెబుతున్నప్పటికీ ఆలయ వాస్తు, నిర్మాణ రీతులను పరిశీలిస్తే ఈ ఆలయం విజయనగర రాజులకాలంలో 13,14 శతాబ్దాల కాలంలో నిర్మించ బడినట్లుగా దాఖలాలున్నాయి […]పూర్తి వివరాలు ...
ఆయనకు ఆ స్థలం బాగా నచ్చింది. ఆ కొండ కోట నిర్మాణానికి ఎంతో అనువుగా ఉందనీ, అక్కడ కోటను నిర్మిస్తే ఆ చుట్టు పక్కల గ్రామం వెలసి సుసంపన్నంగా, ఎంతో వైభవంగా కళకళలాడుతుందనీ జ్యోతిష్కులు శెలవిచ్చారు. దాంతో కాకమహారాజులు అక్కడ కోటను నిర్మించాలని అనుకున్నాడు. వైకుంఠశుద్ధ పంచమి రోజున కోట నిర్మాణానికి శంకుస్థాపన జరిపాడు. అతితక్కువ వ్యవధిలోనే అక్కడ గండికోట ఆవిర్భవించి దుర్భేద్యమైన కోటగా పేరు తెచ్చుకుంది. 101 బురుజులతో నిర్మితమైన గండి కోట ఎంతో సుందరంగానూ, దృఢంగానూ […]పూర్తి వివరాలు ...
గొడ్రాండ్రు దిగంబరులై భజనలు, నాట్యం చేస్తూ పార్శ్వనాథుని ఆలింగనం చేసుకునేవారు. రానురాను ఇది సభ్య ప్రపంచంలో అశ్లీలమై బూతు తిరునాళ్లుగా మారింది. తరువాత బ్రిటిష్ పాలకుల కాలం నాటికి కడప జిల్లా కలెక్టరు సర్ థామస్ మన్రో 1800- 1807 ప్రాంతంలో అశ్లీలతతో కూడిన ఆరాధనోత్సవాలను నిలిపేశారు. మరి కొంత కాలానికి మరింత జుగుప్సాకరంగా తిరునాళ్ల కొనసాగింది. 1918లో జిల్లా కలెక్టరు గారైన హెచ్.హెచ్. బర్‌కిట్...పూర్తి వివరాలు ...
వైయెస్సార్ జిల్లా వేముల మండలంలోని నల్లచెరువుపల్లె సమీపంలోని మోపూరు భైరవ క్షేత్రం జిల్లాలోని విశిష్టమైన శైవ క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. మొహనగిరి పై మోపూరు వద్ద ఈ పుణ్యక్షేత్రం వెలిసింది. మోపూరుకు దిగువన ప్రవహించే పెద్దేరు (గుర్రప్ప యేరు) , సింహద్రిపురం ప్రాంతం నుండీ పారే మొగమూరు యేరు ( చిన్నేరు ) , పులివెందుల ప్రాంతం నుండీ పారే ఉద్ధండవాగు నల్లచెరువు పల్లె వద్ద మోపూరు తిప్ప వద్ద కలుస్తాయి. ఈ భైరవేశ్వర దేవాలయం త్రివేణీ సంగమ […]పూర్తి వివరాలు ...
‘దేవుని కడప’లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయం కడప జిల్లాలోని ఒక ప్రసిద్ధ పుణ్య క్షేత్రం. కడప నగరంలోని ఉన్న ఈ పుణ్య క్షేత్రాన్ని దర్శించుకోవటానికి వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు వస్తుంటారు. నిర్మాణ శైలి : విజయనగర ప్రత్యేకతలు : ఏటా ఉగాది పర్వదినాన దేవుని కడప ఆలయాన్ని ముస్లింలు దర్శించుకుని స్వామి వారికి భత్యం సమర్పిస్తారు. ప్రతి సంవత్సరం ఈ గుడిలో అధిక సంఖ్యలో వివాహాలు జరుగుతాయి. సమీపంలోని దేవుని కడప చెరువులో పడవ విహారం […]పూర్తి వివరాలు ...
కడప నగరానికి కూతవేటుదూరంలో గల సికెదిన్నె మండలంలోని కొత్తపేట వద్ద గల గంగమ్మతల్లి భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలే కాక, జిల్లా నలుమూలల నుంచి కాకుండా ఇతర జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుని, అ మ్మవారికి తమ మొక్కులు చెల్లించి బోనాలు సమర్పించుకుంటున్నారు. దీంతో ప్రతి ఆదివారం ఆలయం వద్ద భక్తుల రద్దీ పెరిగి పండుగ వాతావర ణం నెలకొంటుంది. ఇక్కడి వచ్చి అనేక మంది […]పూర్తి వివరాలు ...
వై.ఎస్.ఆర్. కడప జిల్లా మైదుకూరు మండలంలోని యల్లంపల్లె సమీపంలో వెలసిన శ్రీ తిరుమలనాథ ఆలయం చారిత్రక విశిష్టతతో ఆధ్యాత్మిక శోభతో అలరారుతూ భక్తులను విశేషంగా ఆకర్శిస్తూ ఉన్నది. కొండలు, గుట్టలు, చెరువులతో కూడిన పకృతి రమణీయత నడుమ ఎత్తైన ఒక గుట్టపై వెలసిన ఈ ఆలయం మైదుకూరు ప్రాంతానికే కాక జిల్లాలోని ఎన్నో విశిష్టమైన ఆలయాల సరసన నిలిచి, భక్త జనకోటి పారవశ్యంలో మునిగి, ముక్తిని పొందే దివ్యధామంగా వెలుగొందుతుంది. శ్రీదేవి, భూదేవి సమేతంగా అలరారుతోన్న ఈ […]పూర్తి వివరాలు ...