ఘటనలు

Aug
16
Sun
ఉక్కు కర్మాగారం కోసం ప్రొద్దుటూరులో రౌండ్ టేబుల్ సమావేశం @ NGO హోం
Aug 16 @ 4:00 PM

16న  కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం కలగానే మిగులుతుందా !! “ అను అంశం పై రౌండ్ టేబుల్ సమావేశం ఆదివారం (16-08-2015) సాయంత్రం 4 గంటలకు ప్రొద్దుటూరు NGO హోం నందు నిర్వహిస్తున్నట్టు రాయలసీమ అభివృద్ది ఉద్యమ వేదిక ప్రొద్దటూరు కన్వీనర్ తవ్వా సురేష్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అందరూ హాజరుకావాలని తెలిపారు.

Sep
26
Sat
గండికోట ఉత్సవాలు
Sep 26 – Sep 27 all-day
గండికోట ఉత్సవాలు

కడప: ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ గండికోట ఉత్సవాలను సెప్టెంబర్ 26న నిర్వహించాలని కలెక్టర్ వెంకటరమణ ఆదేశించారు. బుధవారం సభాభవన్‌లో నిర్వహించిన జిల్లా పర్యాటక ప్రమోషన్ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 26న గండికోట ఉత్సవాలు, 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలని సూచించారు.

కార్యక్రమాలను నిర్వహించేందుకు వేదిక, రిసెప్షన్, పార్కింగ్ స్థలం, అప్రోచ్ స్థలం, ఎగ్జిబిషన్, విద్యుత్తు దీపాలు తదితర వసతులు కల్పించాలని ఆదేశించారు. ప్రజలకు తెలిసేలా ప్రచారం చేయాలని చెప్పారు. తాగునీటి సమస్యను 15రోజుల్లోగా పరిష్కరించాలన్నారు. గండికోట ప్రాశస్థ్యం తెలిసేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.

జిల్లా పర్యాటక అభివృద్ధి అధికారి గోపాల్ మాట్లాడుతూ.. జిల్లాలోని 23 పర్యాటక వసతి, సమాచార భవనాలన్ని దేవాదాయశాఖ స్థలాల్లో నిర్మించారన్నారు. గండికోట నుండి మైలవరం వరకు జల విహారయానం, వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలు తీసుకోవాలని చెప్పారు. స్థానిక పర్యాటక కేంద్రాల అభివృద్ధికి రెండుకోట్ల రూపాయలు బడ్జెట్‌లో ఉందన్నారు. యాత్రికులను ఆకర్షించేలా పుష్పగిరి దేవాలయం, ఆమీన్‌పీర్ దర్గా, చింతకొమ్మదిన్నె మండలంలోని గంగమ్మ దేవాలయాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

ఇంతకీ ఈ సారైనా గండికోట ఉత్సవాలు జరుగుతాయా?

error: