వార్తా విభాగం

    అభిప్రాయం

    ‘తాళ్ళపొద్దుటూరు’లో ఏమి జరుగుతోంది?

    2004లో రిజర్వాయర్ తొలి సామర్థ్యం 16.850 TMC, మునక గ్రామాలు 14. 2007లో పెంచిన రిజర్వాయర్ సామర్థ్యం 26.85 TMC, మునక గ్రామాలు 22. ———————————- పులివెందుల నియోజకవర్గంలో ఎండిపోతున్న చీనీ చెట్లకు ఆరునెలల్లో నీళ్లిస్తామని, అంతవరకు తాను గడ్డం కూడా తియ్యనని శపథం చేసిన అప్పటి తెదేపా నాయకుడు, శాసనమండలి ఉపాధ్యక్షుడు (ఇప్పుడు కూడా ఈయన “అధికార పార్టీ”లోనే ఉన్నాడు) రెండుమూడేళ్ళుగా గడ్డంతోనే తిరుగుతున్నాడని జాలిపడి, గడ్డం తీయించడానికి తొందరపడి 2017లో గండికోట రిజర్వాయర్ నుంచి […]పూర్తి వివరాలు ...

    రహదారులు సమాచారం

    కడప జిల్లాలోని జాతీయ రహదారులు

    జాతీయ రహదారులకు గతంలో ప్రాధాన్యతా క్రమంలో ఇస్తూ వచ్చిన నంబర్లలో ఏవో కొన్ని ప్రధానమైన జాతీయ రహదారుల నంబర్లు తప్ప మిగతావి కొంత గందరగోళంగా తయారయ్యాయనే చెప్పాలి. ఏదైనా ఒక జాతీయ రహదారిని తీసుకుని దానితో కలుస్తున్న లేదా దాన్నుంచి విడిపోయిన ఇతర జాతీయ రహదారుల నంబర్లేమిటని చూస్తే చాలా సందర్భాలలో అవి ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉండేవి. అందువల్ల గుర్తుపెట్టుకోవడం కూడా కష్టమయ్యేది. దాంతో పదేండ్ల కిందట 2010లో రోడ్డు రవాణా & జాతీయ రహదారుల […]పూర్తి వివరాలు ...

    కైఫియత్తులు చరిత్ర

    పెద్దముడియం చరిత్ర

    పెద్దముడియం కడప జిల్లాలోని ఒక మండల కేంద్రం. చాళుక్య సామ్రాజ్య స్థాపకుడు విష్ణువర్ధనుడు పుట్టిన ఊరు మన కడప జిల్లాలో ఉందని తెలుసా ? ఒక సారి పెద్దముడియం గ్రామం చరిత్ర చూడండి. పూర్వం త్రిలోచన మహారాజు ( ముక్కంటి కడువెట్టి ) గంగానదిలో స్నానం చేయడానికి కాశీ నగరానికి వెళ్ళినపుడు, చాలా మంది బ్రాహ్మణులు రాజు సహాయార్థం వేచి ఉంటారు. రాజు స్నానాదికాలు పూర్తి చేసుకున్న తర్వాత వారికి దానాలు చేస్తు ఉన్నపుడు, 18 గోత్రాలకి సంబధించిన […]పూర్తి వివరాలు ...

    వార్తలు

    కామిశెట్టి శ్రీనివాసులు ఇక లేరు

    కడప : అన్నమాచార్య సంకీర్తనలపై విశేష పరిశోధనలు చేసిన ప్రముఖ పండితుడు కామిశెట్టి శ్రీనివాసులు శనివారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. కడప జిల్లాకు చెందిన డాక్టర్ కామిశెట్టి శ్రీనివాసులు (జూన్ 25, 1941) అన్నమాచార్య కీర్తనలపై పరిశోధన చేసిన వారిలో ప్రముఖుడు. ఇదే రంగంలో కీలకమైన పరిశోధన చేసిన రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ శిష్యుడు. ఆయన జూన్ 25, 1941 తేదీన లక్ష్మీదేవి, కామిశెట్టి వెంకటసుబ్బయ్య దంపతులకు కడపలో జన్మించారు. స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల నుంచి డిగ్రీ […]పూర్తి వివరాలు ...

    చరిత్ర శాసనాలు

    నాటి ‘తిరువత్తూరై’ నే నేటి అత్తిరాల !

    *అత్తిరాల పరశురామేశ్వర ఆలయం – తమిళ పాలన *అత్తిరాలలోని పరశురామేశ్వర ఆలయం ప్రాంగణంలో గోడలపై ఏడు తమిళ శాసనాలు తంజావూరు చోళుల పాలనకు తార్కాణం గా నిలుస్తున్నాయి. క్రీ.శ. 11 వ శతాబ్దంలో రాజరాజ చోళ -3 అత్తిరాల ఆలయాన్ని అభివృద్ధి చేసాడు. ఆలయ నిర్మాణం అంతకుముందే జరిగి ఉండవచ్చుననే అభిప్రాయం కూడా ఉంది. * ఈ ప్రాంతం  అధిరాజేంద్రచోళ మండలంగా, ‘మేల్పాకనాడు’ గా పిలువబడుతూ ఉండేదని ఈ శాసనాలవల్ల తెలుస్తోంది. అప్పట్లో అత్తిరాలను ‘తిరువత్తూరు’ పిలిచేవారని […]పూర్తి వివరాలు ...

    అభిప్రాయం

    కడప రుచుల కేంద్రం వన్ టౌన్ సర్కిల్

    నేను పెద్దగా రుచులు తెలిసినవాణ్ణి కాను. రుచుల విషయంలో నాది మా నాన్న తరహా. ఏదైనా పదార్థం తినేటప్పుడు ఎంత రుచిగా ఉంటుందనే దాన్ని బట్టి కాకుండా ఎంత సులభంగా గొంతు దిగుతుంది, తిన్న తర్వాత ఎంత తేలిగ్గా అరుగుతుంది, అరిగాక వంట్లో ఏం చేస్తుంది అన్నదాన్ని బట్టే ఇష్టాయిష్టాలు ఏర్పడుతాయి :-). మా అమ్మ మా చిన్నప్పుడు ఇంట్లోనే ఎప్పటికప్పుడు రకరకాల స్వీట్లు, ఇతర చిరుతిండ్లు చేసి పెట్టేది. ఊర్లో మిగతా పిల్లలు గువ్వలచెరువు (యెస్, […]పూర్తి వివరాలు ...

    చరిత్ర శాసనాలు

    పెద్దపసుపుల – దానవులపాడు (కురుమరి) పొలిమేర కొట్లాట

    దండనాయకుడిని హతమార్చిన పెద్దపసుపుల ప్రజలు పశ్చిమ చాళుక్య రాజైన త్రైలోక్యమల్ల మహారాజు కళ్యాణీ పట్టణాన్నిరాజధానిగా చేసుకుని గండికోటసీమతో సహా పాలన చేస్తున్న (క్రీ.శ.1064) కాలంలో కటకచంద్రనాయకుడు అనే దండనాథుడు జమ్మలమడుగు ప్రాంత రాజ్యపాలనను పర్వవేక్షించేవాడు. ఈ నేపథ్యంలో పెద్దపసుపుల, దానవులపాడు గ్రామాల మధ్య పొలిమేర తగాదా తలెత్తింది. ఇది రెండు గ్రామాల ప్రజల మధ్య పోరాటానికి దారి తీసింది. ఈ విషయం త్రైలోక్యమల్ల మహారాజు దృష్టికి వెళ్ళింది. దీంతో రాజు ఈ తగాదాను పరిష్కరించాల్సిందిగా కటకచంద్ర దండనాయకున్ని […]పూర్తి వివరాలు ...

    అభిప్రాయం

    కొత్త జిల్లా కేంద్రంగా కడప వద్దు !

    ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు వస్తే కొన్ని నెలల క్రిందట పత్రికల్లో ఒక వార్త వచ్చింది – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో నాలుగు ప్రాంతీయ అభివృద్ధి/ప్రణాళిక మండళ్లను ఏర్పాటు చేయనుందని. నాలుగు రాయలసీమ జిల్లాలకు కలిపి కడపలో, ఉత్తరాంధ్రకు విజయనగరంలో, మధ్యాంధ్రకు కాకినాడలో, దక్షిణాంధ్రకు గుంటూరులో అన్నారు. మూడు రాజధానుల విషయంలో లాగే నగరాల ఎంపికలోనే నాకు అభ్యంతరం ఉంది తప్ప వికేంద్రీకరణ విషయంలో ఈ మండళ్ల ఏర్పాటును నేను పూర్తిగా సమర్థిస్తాను. ఉత్తరాంధ్రకు విజయనగరం, దక్షిణాంధ్రలోని మూడు […]పూర్తి వివరాలు ...

    ఈ-పుస్తకాలు వ్యాసాలు సంవేదన

    సంవేదన (త్రైమాసిక పత్రిక) – ఏప్రిల్ 1969

    1968-69 సంవత్సరాల్లో కడప నుంచి -కేవలం ఏడాదిన్నరకాలం మాత్రమే – వెలువడిన సాహిత్య పత్రిక ‘సంవేదన’. ఈ పత్రికను ‘యుగసాహితి’ నిర్వహించింది. యుగసాహితిలో రా.రా.తోపాటుగా గజ్జెల మల్లారెడ్డి, వైసీవీ రెడ్డి, ఆర్వియార్, సొదుం జయరాం, నల్లపాటి రామప్ప నాయుడు, టి.సాంబశివారెడ్డి, చెన్నారెడ్డి, కేతు విశ్వనాథరెడ్డి, ఐ.సుబ్బారెడ్డి, చవ్వా చంద్రశేఖర రెడ్డి, వి. రామకృష్ణ తదితరులు చురుకయిన పాత్ర పోషించారు. వీళ్లలో ఒకరిద్దరు తప్ప తక్కినవారందరి రచనలూ ‘సంవేదన’లో కనిపిస్తాయి. అయితే, ‘సంవేదన’ పత్రికకు దిక్సూచిగా నిలబడింది మాత్రం […]పూర్తి వివరాలు ...