వార్తా విభాగం

సంకీర్తనలు

ఎచ్చోటి కేఁగిన యెప్పుడూఁ దమలోని – – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥ఎచ్చోటి కేఁగిన యెప్పుడూఁ దమలోని –మచ్చిక పెనుఁదెవులు మానకపోయె॥చ1॥పాయపు సతులగుబ్బల పెదపొట్లాలకాయము వడి నొత్తి కాఁచఁగనురాయిడిచే ఘనమాయఁగాని లోని-మాయపు పెనుఁదెవులు మానకపోయె॥చ2॥అతివల మోహపుటధరామృతములుయితవుగ నోరి కందియ్యఁగనుఅదిమోహమే ఘనమాయఁగాని లోని-మతకరిపెనుఁదెవులు మానకపొయె॥చ3॥తరుణుల మేనిమెత్తనిపరపులమీఁద-నిరవుగ నిటు సుఖియించఁగనుతిరువేంకటాచలాధీశుకృపచేఁగానిమరుచేతి పెనుఁదెవులు మానకపోయె రాగము: వరాళి రేకు: 0045-01 సంపుటము: 1-273 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

సతతవిరక్తుఁడు సంసారి గాఁడు – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥సతతవిరక్తుఁడు సంసారి గాఁడురతిసమ్మదుఁడు విరక్తుఁడు నితఁడె॥చ1॥నిత్యుఁడైనవాఁడు నిఖిలలోకములఁ-బ్రత్యక్షవిభవ సంపన్నుఁడు గాఁడునిత్యుఁడు నితఁడే నిరుపమానుఁడైనప్రత్యక్షవిభవ సంపన్నుఁ డితఁడె॥చ2॥యోగియైనవాఁడు వొనర నేకాలముభోగియై భోగిపై భోగింపలేఁడుయోగియు నితఁడే వుడుగక భోగిపైభోగించునటువంటి పురుషుండు నితఁడె॥చ3॥దేవుడైనవాఁడుఁ దెలుప లోకములదేవతారాధ్యుఁడై దీపింపలేఁడుదేవుఁడు నితఁడే దివిజవంద్యుఁడైనశ్రీవేంకటగిరిదేవుండితఁడె రాగము: కన్నడగౌళ రేకు: 0044-05 సంపుటము: 1-272 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, కన్నడగౌళపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

అది నాయపరాధ మిది నాయపరాధ – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥అది నాయపరాధ మిది నాయపరాధమదియు నిదియు నాయపరాధము॥చ1॥నెరయ రూపములెల్ల నీరూపమేకానరయని యది నాయపరాధముపరిపూర్ణుఁడగు నిన్నుఁ బరిచ్ఛిన్నునిఁగా-నరయుట యది నాయపరాధము॥చ2॥జీవాత్మునిఁగాఁ జింతింపఁ దలఁచుటయావంక నది నాయపరాధముసేవించి నిను నాత్మఁ జింతింపకుండుటఆవల నిది నాయపరాధము॥చ3॥యీడెరఁగక వేంకటేశుఁడ నినుఁ గొని-యాడుట యది నాయపరాధముయేడఁ జూచిన నాయెదుర నుండఁగ నిన్నునాడ నీడ వెదకుటపరాధము రాగము: మాళవి రేకు: 0044-04 సంపుటము: 1-271 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

నీమహత్త్వంబు లోనికిఁ వెలుపలికిఁ గప్పి – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥నీమహత్త్వంబు లోనికిఁ వెలుపలికిఁ గప్పికామింప నిట్టిదని కానరా దటుగాన॥చ1॥నిండి యిన్నిటిలోన నీవు గలవని భ్రాంతి-నుండుదువుగాని నీ వొకటియునుఁ గావుదండిగలగిరి ప్రతిద్వని దోచుఁగాని యదికొండలోపల లేదు కొండయునుఁ గాదు॥చ2॥బలసి యిన్నిటిలోపలనుఁ జైతన్యమైమెలఁగుదువుగాని యేమిట నీవు లేవుపలుదెరఁగులైన దర్పణమునందొక నీడవొలయుఁగా కందు దలపోయు నది లేదు॥చ3॥వుడుగ కన్నిటిలోన నుండుటయు లేదు నీ-వుడివోయి యందుండ కుండుటయు లేదుచెడనితేజముగాన శ్రీవేంకటేశ నీ-పొడవు పరిపర్ణమై పొలుపొందుఁగాన రాగము: కన్నడగౌళ రేకు: 0044-03 సంపుటము: 1-270 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, [&పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

నమో నారాయణాయ నారాయణాయ – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥నమో నారాయణాయ నారాయణాయ సగుణబ్రహ్మణేసర్వపారాయణాయ శోభనమూర్తయే నమో॥చ1॥నిత్యాయ విబుధసంస్తుత్యాయ నిత్యాధి-పత్యాయ మునిగణ ప్రత్యయాయసత్యయ పత్యక్షాయ సన్మానససాం-గత్యాయ జగదవనకృత్యాయ తేనమో॥చ2॥అక్రమోద్దతబాహువిక్రమాతిక్రాంతశుక్రశిష్యోన్యూలనక్రమాయశక్రాదిగీర్వాణవక్రభయభంగని-ర్వక్రాయ నిహతారిచక్రాయ తేనమో॥చ3॥అక్షరాయాతినిరపేక్షాయ పుండరీ-కాక్షాయ శ్రీవత్సలక్షణాయఅక్షీణవిజ్ఞానదక్షయోగీంద్రసం-రక్షానుకంపాకటాక్షాయ తేనమో॥చ4॥కరిరాజవరదాయ కౌస్తుభాభరణాయమురవైరిణే జగన్మోహనాయతరుణేందుకోటీరతరుణీ మనస్త్సోత్ర-పరితోషచిత్తాయ పరమాయ తే నమో॥చ5॥పాత్రదానోత్సవప్రథిత వేంకటరాయధాత్రీశకామితార్థప్రదాయగోత్రభిన్మణిరుచిరగాత్రాయ రవిచంద్ర-నేత్రాయ శేషాద్రినిలయాయ తే నమో నారయణాయ రాగము: శుద్దవసంతం రేకు: 0044-02 సంపుటము: 1-269 Tags: పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఈ దేహవికారమునకు నేదియుఁ గడపల గానము – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥ఈ దేహవికారమునకు నేదియుఁ గడపల గానముమోదమెరంగని మోహము ముందర గననీదు॥చ1॥నిత్యానిత్యవివేకము నీరసునకు నొనగూడదుసత్యాలాపవిచారము జరగదు లోభికినిహత్యావిరహితకర్మము అంటదు క్రూరాత్మునకునుప్రత్యక్షంబగుపాపము పాయదు కష్టునకు॥చ2॥సతతానందవికాసము సంధించదు తామసునకుగతకల్మషభావము దొరకదు వ్యసనికినిజితకాముఁడు దా నవుటకు సిద్ధింపదు దుష్కర్మికిఅతులితగంభీరగుణం బలవడ దధమునకు॥చ3॥శ్రీవేంకటగిరివల్లభు సేవా తాత్పరభావము –ద్రోవ మహలంపటులకు తోఁపదు తలఁపునకుదేవోత్తముఁగడు నీతని దివ్యామృతమగు నామముసేవింపఁగ నితరులకును చిత్తం బొడఁబడదు రాగము: లలిత రేకు: 0044-01 సంపుటము: 1-268 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

మందరధర మధుసూదన – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥మందరధర మధుసూదననందగోపనందనా॥చ1॥నరసింహ గోవింద నవనీతానందహరిముకుంద నయనారవిందకరివరద గరుడగమనరూపగురుచాపా యదుకులదీపా॥చ2॥భవదూర భయహర పరిపూర్ణామృతభవనపాలన సురపాలనభువనభూషణ పరపురుష పురాతననవభోగా కరుణాయోగా॥చ3॥పంకజాసననుత భవ్యనిర్మలపాద-పంకజ పరమ పరాత్పరవేంకటశైలనివేశ శు-భంకరా క్షేమంకరా రాగము: కురంజి రేకు: 0043-07 సంపుటము: 1-267 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఆపన్నులపాలి దైవమాతఁడే గతిఁదక్క – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥ఆపన్నులపాలి దైవమాతఁడే గతిఁదక్కయే పొద్దును భజియించఁగ నితరుఁడు మరి కలఁడా॥చ1॥నిరుపాధిక నిజబంధుఁడు నిరతి శయానందుఁడుకరి వరదుఁ డితఁడే గాక ఘనుఁడధికుఁడు గలఁడా॥చ2॥సంతత గుణ సంపన్నుఁడు సాధులకుఁ బ్రసన్నుఁడుఅంతర్యామితఁడే కాక అధికుఁడు మరి కలఁడా॥చ3॥పరమాత్ముఁడు పరమపురుషుఁడు పరికింపఁగఁ గృపాలుఁడుతిరువేంకట విభుఁడే కాక దేవుఁడు మరి కలఁడా రాగము: శ్రీరాగం రేకు: 0043-06 సంపుటము: 1-266 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

కిం కరిష్యామి కిం కరోమి బహుళ- – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥కిం కరిష్యామి కిం కరోమి బహుళ-శంకాసమాధానజాడ్యం వహామి॥చ1॥నారాయణం జగన్నాధం త్రిలోకైక-పారాయణం భక్తపావనందూరీకరోమ్యహం దురితదూరేణ సం-సారసాగరమగ్నచంచలత్వేన॥చ2॥తిరువేంకటచలాధీశ్వరం కరిరాజ-వరదం శరణాగతవత్సలంపరమపురుషం కృపాభరణం న భజామిమరణభవదేహభిమానం వహామి రాగము: శుద్దవసంతం రేకు: 0043-05 సంపుటము: 1-265 Tags: Annamacharya Keerthanalu, Telugu పూర్తి వివరాలు ...

error: