వార్తా విభాగం

వార్తలు

బడ్జెట్‌ను వ్యతిరేకించండి

కడప: బిజెపి కేంద్ర బడ్జెట్‌ను వ్యతిరేకించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ రామ్మోహన్ పిలుపునిచ్చారు. 2015-16 సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ  ప్రవేశపెట్టిన బడ్జెట్‌  పెట్టుబడిదారులకు, ధనవంతులకు, విదేశీ బహుళజాతి కంపెనీలకు వత్తాసుగా ఉందన్నారు. ఈ దేశాన్ని మరింతగా దోచుకోవడానికి అవసరమైన రాయితీలన్నింటిని అడ్డుగోలుగా అప్పచెప్పుతూ, సాధారణ ప్రజలపై మాత్రం మోయలేనిభారాన్నివేస్తూ బడ్జెట్ ప్రతిపాదనలుండడం యాదృచ్ఛికం కాదన్నారు. ఓట్లేసిన ప్రజల కంటే ఎన్నికల నిధులను సమకూర్చిన పెట్టుబడిదారులకు సేవ చేయడమే లక్ష్యంగా బిజెపికి […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

‘నిధులు కేటాయించి ప్రాజెక్టు పూర్తి చేయాల’

కమలాపురం: ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ‘గాలేరు-నగరి’కి నిధులు కేటాయించి ప్రాజెక్టు పూర్తి చేయాలని మాజీ మంత్రి, వైఎస్ వివేకానంద రెడ్డి డిమాండ్ చేశారు.‘ప్రజా పోరాటాలకు కమలాపురం నియోజకవర్గం పుట్టినిల్లు. ఈ నియోజకవర్గ ప్రజల కోసం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి దీక్ష చేయడం అభినందనీయం’ అని ఆయన అన్నారు. గాలేరు-నగరి ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరుతూ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష బుధవారం నాలుగో రోజుకు చేరింది. ఈ సందర్భంగా వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ […]పూర్తి వివరాలు ...

ఆచార వ్యవహారాలు

బేస్తవారం నుంచి నీలకంఠరావుపేట ఉరుసు

రాయచోటి: రామాపురం మండలంలోని నీలకంఠరావుపేట దర్గాలో గురువారం నుంచి హజరత్ దర్బార్ అలీషావలి (రహంతుల్లా అలై), జలీల్ మస్తాన్‌వలీ ఉరుసు నిర్వహించనున్నట్లు సద్గురు దర్గా స్వామిజీ చెప్పారు. 5న గంధం, 6న జెండా మెరవణి, 7న ప్రసాద పంపిణీ కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. హిందూ-ముస్లిం సమైక్యతకు చిహ్నంగా, మతసామరస్యానికి ప్రతీకగా నీలకంఠరావుపేట దర్గా నిలిచింది. పక్కనే సాయిబాబా ఆలయం ఉండటంతో ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచింది. బెంగళూరు, చెన్నై, నెల్లూరు, గద్వాల్ తదితర ప్రాంతాల నుంచి భక్తులుతరలిరానున్నారు. దర్గా […]పూర్తి వివరాలు ...

ఆచార వ్యవహారాలు

రేపటి నుంచి మల్లూరమ్మ జాతర

రాయచోటి: చిన్నమండెం మండల పరిధిలోని మల్లూరమ్మ జాతర గురువారం నుంచి రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా మల్లూరంమను భక్తులు పూజిస్తారు. ఏటా పాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున అమ్మవారికి తిరునాళ్ల నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇటీవలే మల్లూరమ్మ ఆలయాన్ని రూ.20లక్షలు వెచ్చించి అభివృద్ధి చేశారు. ఈరోజు (బుధవారం) రాత్రి అమ్మవారిని తిమ్మారెడ్డిగారిపల్లె నుంచి సంప్రదాయబద్ధంగా ఆలయానికి తీసుకొస్తారు. గురువారం ఉదయం అభిషేకాలు, పూజలు ఉంటాయి. […]పూర్తి వివరాలు ...

వార్తలు

ఉర్దూ విశ్వవిద్యాలయం కోసం ఆందోళనలు

కడప: జిల్లాలో ఏర్పాటు చేస్తామని చెప్పిన ఉర్దూ విశ్వవిద్యాలయాన్ని చంద్రబాబు మాట మార్చి కర్నూలుకు మంజూరు చేస్తున్నట్లు పేర్కొనడంపై జిల్లాలోని అన్ని వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉర్దూ విశ్వవిద్యాలయ సాధనకు నగరంలోని ఉర్దూ మాతృభాషాభిమానులు, కవులు, ప్రజాప్రతినిధులు ఉర్దూ విశ్వవిద్యాలయ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట నిరహారదీక్షలు చేపట్టారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు రోజూ 25 మందితో దీక్షలు చేపడతామని యాక్షన్ కమిటీ అధ్యక్షుడు సలాఉద్దీన్ తెలిపారు. మాట మార్చిన వ్యక్తులకు మద్దతు పలికే […]పూర్తి వివరాలు ...

పర్యాటకం సమాచారం

కడప నగరం

కడప (ఆంగ్లం: Kadapa లేదా Cuddapah, ఉర్దూ: کڈپ ), వైఎస్ఆర్ జిల్లా యొక్క ముఖ్య పట్టణము, రాయలసీమలోని ఒక ప్రముఖ నగరము. మూడు వైపులా నల్లమల అడవులు, పాలకొండలతో కడప నగరం చూడముచ్చటగా ఉంటుంది. కడప నగరం యొక్క పాలన ‘కడప నగర పాలక సంస్థ’ పరిధిలో జరుగుతుంది. కడప పేరు వెనుక కథ: కడప జిల్లా గెజిటీరులో కడప పేరును 18వ శతాబ్ది వరకూ కుర్ప (Kurpa/Kurpah) అనే రాసేవాళ్ళని స్పష్టంగా ఉంది. ఇది కృప […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు రాయలసీమ

సీమ జలసాధన కోసం మరో ఉద్యమం: మైసూరారెడ్డి

రాయలసీమ అభివృద్ధికి బాబు చేసిందేమీ లేదు కడప: రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. వెంటనే గాలేరు-నగరి సుజల స్రవంతి పథకానికి అవసరమైన నిధులు కేటాయించాలని లేకపోతే రాయలసీమకు జలసాధన కోసం మరో ఉద్యమం చేస్తామని మాజీ మంత్రి, వైకాపా సీనియర్ నేత ఎంవీ మైసూరారెడ్డి హెచ్చరించారు. సోమవారం వీరపునాయునిపల్లె ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు వద్ద కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి చేస్తున్న నిరవధిక నిరాహారదీక్ష శిబిరానికి వచ్చిన మైసూరారెడ్డి ఆయనకు సంఘీభావం తెలిపారు. నిధులు కేటాయించాల ఈ […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

కడప – విశాఖపట్నంల నడుమ ‘ఇంద్ర’ బస్సు

కడప: కడప నుంచి విశాఖపట్నానికి ఇంద్ర బస్సు సర్వీసును ఆదివారం సాయంత్రం డిపో అధికారులు ప్రారంభించారు.ఈ బస్సు ప్రతి రోజు సాయంత్రం కడప డిపో నుంచి సాయంత్రం 6 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు విశాఖపట్నానికి చేరుకుంటుంది. తిరిగి విశాఖపట్నంలో సాయంత్రం 5.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు కడపకు చేరుకుంటుంది. కడప నుంచి బద్వేలు, కావలి, ఒంగోలు బైపాస్, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, అన్నవరంల మీదుగా […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

కమలాపురం శాసనసభ్యుడి నిరాహారదీక్ష

గాలేరు-నగరి సుజల స్రవంతిలో భాగమైన సర్వరాయసాగర్ పనులు తక్షణం పూర్తి చేసి ప్రజలకు, రైతులకు తాగు, సాగు నీరు అందించాలని కోరుతూ కమలాపురం శాసనసభ్యుడు రవీంద్రనాద్ రెడ్డి ఆదివారం మండల కేంద్రమైన వీరపునాయునిపల్లెలో  నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షా శిబిరంలో ఆయన మాట్లాడుతూ … ‘ఇప్పటికే మన ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. తాగడానికి నీరు లేదు.  తినడానికి తిండి లేదు.. రబీ సీజన్ కూడా మోసం చేసింది.. చంద్రబాబు సీఎం అయితే ఆయనతో […]పూర్తి వివరాలు ...

error: