తాళ్లపాక: తొలి తెలుగు వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడూ అయిన తాళ్ళపాక అన్నమాచార్యుల 512వ వర్థంతి ఉత్సవాలు ఆయన జన్మస్థలి తాళ్లపాకలో తితిదే ఆధ్వర్యంలో మంగళవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటలకు బహుళ ద్వాదశి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సప్తగిరుల గోష్టిగానం కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. చివరిగా అన్నమయ్య చిత్రపటాన్ని తాళ్లపాక మాడవీధుల్లో వూరేగించారు. తిరుపతి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు నగర సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం తాళ్లపాక ధ్యానమందిర […]పూర్తి వివరాలు ...
కడప: చివరి దశలో ఉన్న రాయలసీమ సాగునీటి పథకాలు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు కేటాయించి ఆయా పథకాలను త్వరగా పూర్తి చేయాలని శాసనమండలిలో ప్రతిపక్ష నేత రామచంద్రయ్య ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నారు. శుక్రవారం ఇందుకు సంబంధించిన వినతిపత్రాన్ని రామచంద్రయ్య చంద్రబాబుకు పంపినారు. రాయలసీమ ఉద్యమం నేపధ్యంలో నాటి తెదేపా ప్రభుత్వం గాలేరు-నగరి, హంద్రీ-నీవా, సుజలస్రవంతి పథకాలు ఏర్పాటు ప్రకటించినా తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కమిటీలు,సర్వేల పేరుతో కాలం గడిపారుతప్ప రాయలసీమ సాగునీటి పై […]పూర్తి వివరాలు ...
మైదుకూరు: ప్రజా ప్రతినిధుల సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన వైఎస్సార్ జిల్లా కలెక్టర్ కెవీ రమణపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మైదుకూరు శాసనసభ్యుడు రఘురామిరెడ్డి శుక్రవారం శాసనసభలో సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు ఆహ్వానించి, ఆపై పోలీసుల ద్వారా అడ్డుకొని ప్రజాప్రతినిధులను అవమానపరిచారని ఈ నేపథ్యంలో సెక్షన్ 168 కింద విచారణకు స్వీకరించి చర్యలు చేపట్టాలని ఆయన స్పీకర్‌ను కోరారు.పూర్తి వివరాలు ...
కడప : ఎండలకాలం మొదలవుతున్నందున సోమవారం ( 16 మార్చి) నుంచి ఒంటిపూట బడి నిర్వహించాలని జిల్లా విద్యాధికారి ప్రతాప్‌రెడ్డి తెలిపారు. ఉదయం 8 నుంచి 12.30 గంటల వరకు తరగతులు నిర్వహించాలని సూచించారు. డీఎడ్, పదోతరగతి పరీక్షా కేంద్రాలున్న పాఠశాలల్లో మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు జరపాలన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఈ నిబంధన వర్తిస్తుందని డీఈవో తెలిపారు.పూర్తి వివరాలు ...
బడ్జెట్లో అరకొర కేటాయింపులు జలయజ్ఞానికి సంబంధించి ఇప్పటికే సాగునీరు పుష్కలంగా అందుతున్న కృష్ణా డెల్టా మీద అలవికాని ప్రేమ ప్రదర్శించిన ప్రభుత్వం ఆరుతడి పంటలకూ నోచుకోక కరువు బారిన పడ్డ సీమపైన వివక్షను కొనసాగించింది. నిరుడు రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు కేటాయింపులు జరపడంలో వివక్ష చూపిన ఆం.ప్ర ప్రభుత్వం ఈ ఏడాది కూడా ఆ విధానాన్ని కొనసాగించి తన ప్రాధమ్యాన్ని చెప్పకనే చెప్పింది. రాయలసీమలోని భారీ సాగునీటి పథకాలు అన్నిటికీ కలిపి ఎప్పుడో పూర్తయి నిర్వహణలో ఉన్న […]పూర్తి వివరాలు ...
జిల్లాకు అన్యాయం హంద్రీనీవాను పూర్తి చేయడానికి రూ. 1500 కోట్లు అవసరం కాగా.. బడ్జెట్టులో కేవలం రూ. 120 కోట్లు కేటాయించారు. అలాగే గాలేరు- నగరికి రూ. 1200 కోట్లు అవసరమైతే.. బడ్జెట్టులో కేవలం రూ. 169 కోట్లు మాత్రమే కేటాయించి, కడప జిల్లాకు అన్యాయం చేశారు. – రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి రాయలసీమ ప్రస్తావన ఏదీ? వెనుకబడిన ఉత్తరాంధ్రకు రూ.350కోట్లు ప్రకటించిన చంద్రబాబు రాయలసీమ ప్రస్తావన చేయకపోవడం విచారకరం. జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు […]పూర్తి వివరాలు ...
కడప: జిల్లా కలెక్టర్ కేవీ రమణ వ్యవహార శైలిపై అఖిలపక్షం నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రాజ్యాంగ బద్ధంగా పని చేయని ఆయన ఈ జిల్లా కలెక్టర్‌గా అర్హులు కారని పేర్కొన్నారు. కడప నగరంలోని వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ జయశ్రీ అధ్యక్షతన రౌండు టేబుల్ సమావేశం నిర్వహించారు. వైకాపా, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, కార్మిక సంఘం నేతలు జిల్లా కలెక్టర్ తీరుపై మండిపడ్డారు. గతంలో పని చేసిన […]పూర్తి వివరాలు ...
కడప జిల్లా ప్రజలు ఎలాంటివారో చెబుతూ ఆయా సందర్భాలలో ఈ ప్రాంతంతో అనుబంధం కలిగిన అధికారులూ, అనధికారులూ వెలిబుచ్చిన కొన్ని అభిప్రాయాలివి. కడప.ఇన్ఫో దగ్గర అందుబాటులో ఉన్న కొన్ని అభిప్రాయాలను ఇక్కడ పొందుపరుస్తున్నాం…. “ఇచట పుట్టిన చిగురు కొమ్మైన చేవ” – అల్లసాని పెద్దన [divider style=”normal” top=”10″ bottom=”10″] “అనురాగ, అభిమాన మూర్తులు కడప వాసులు. పర్యాటకులను, యాత్రీకులను ఎంతో ఆదరిస్తారు. ఎంతగానో సహకరిస్తారు.” – ట్రావెర్నియర్, ఫ్రెంచి యాత్రికుడు [divider style=”normal” top=”10″ bottom=”10″] [&పూర్తి వివరాలు ...
వేంపల్లె : సోమావారం ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీ విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కారు. తమ సమస్యలను పరిష్కరించేవరకు ఆందోళనను విరమించేదిలేదని మధ్యాహ్న భోజనం చేయకుండా భీష్మించుకున్నారు. కాగితాలకే పరిమితమవుతున్నాయి కానీ.. సమస్యలు పరిష్కారం కావడం లేదని అధికారులను నిలదీశారు. మెస్‌లో భోజనం సరిగాలేదని.. మెనూ ప్రకారం భోజనం పెట్టడంలేదని ఎన్నిమార్లు చెప్పినా అధికారులు పట్టించుకోలేదన్నారు. ఆదివారం రాత్రి ట్రిపుల్ ఐటీలోని కెఎంకే క్యాటరింగ్‌కు చెందిన మెస్‌లో సాంబారులో కప్పలు ప్రత్యక్షమయ్యాయని విద్యార్థులు అధికారులకు స్వయంగా […]పూర్తి వివరాలు ...