వార్తా విభాగం

వార్తలు

రేపు రాయలసీమ మహాసభ సమావేశం

మైదుకూరు: రాయలసీమ మహాసభ అధ్వర్యంలో ఆదివారం (మార్చి 22వ తేదీ) కడపలోని సి.పి.బ్రౌన్ గ్రంథాలయంలో రాయలసీమ రచయితల, కవుల, కళాకారుల, ప్రజాసంఘాల, విద్యార్ధి, మహిళా,  రైతుసంఘాల ప్రతినిధుల సమావేశం జరుగనుంది . ఉదయం 10 గంటలకు రాయలసీమ గురించి చర్చ జరుగుతుంది. మధ్యాహ్నం రాయలసీమ మహాసభ కడప జిల్లా కార్యవర్గ ఎంపిక జరుగుతుంది. సంబందిత ప్రతినిధులందరికీ , రాయలసీమ అస్తిత్వం గురించి తపన పడే మిత్రులకు సమావేశం ఆహ్వానం పలుకుతోంది.పూర్తి వివరాలు ...

వార్తలు

బీఎస్ఎన్ఎల్‌కు జిల్లాలో రూ.13 కోట్ల నష్టం

ఇదే కొనసాగితే ప్రైవేటుకు అప్పగించినా ఆశ్యర్యపోనవసరం పులివెందుల: ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ సంస్థను లాభాలబాట పట్టించేందుకు ఉద్యోగులంతా కృషి చేయాలని జీఎం శివశంకరరెడ్డి సూచించారు. సంస్థ కార్యాలయంలో శుక్రవారం ఉద్యోగులతో సమావేశం అయిన ఆయన మాట్లాడుతూ… దేశవ్యాప్తంగా సంస్థకు గత ఏడాది రూ.785కోట్లు నష్టం వస్తే జిల్లాలో రూ.13 కోట్ల నష్టం వచ్చిందన్నారు. ఇదే కొనసాగితే భవిష్యత్తులో జీతాలు కూడా ఉండవన్నారు. వసతులూ నిలిపేస్తూ ప్రైవేటు సంస్థకు నిర్వహణ అప్పగించినా ఆశ్యర్యపోనవసరం లేదని చెప్పారు. ల్యాండ్‌ఫోన్ల […]పూర్తి వివరాలు ...

వార్తలు

తాగే నీళ్ళ కోసం..ఖాళీ బిందెలతో ఆందోళన

కడప: నగరపాలక సంస్థ పరిధిలో తాగునీటి సమస్య నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సీపీఐ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ నగరంలో రోజురోజుకు నీటి సమస్య ఎక్కువవుతోందని, కలుషిత నీటితో జనం రోగాలబారిన పడుతున్నారని తెలిపారు. నీటి ఎద్దడి నివారణకు శాశ్వత మార్గాలు అన్వేషించకపోతే కార్పొరేషన్ కార్యకలాపాలను స్తంభింపజేస్తామని హెచ్చరించారు. ఐదురోజులుగా సీపీఐ నాయకులు బృందాలుగా ఏర్పడి […]పూర్తి వివరాలు ...

వార్తలు

ఉయ్యాలతాడే ఉరితాడయింది…

కడప: ఉయ్యాల తాడు ఓ చిన్నారి పాలిట ఉరితాడయింది. ఉయ్యాల ఊగుతుండగా ప్రమాదవశాత్తూ ఆ తాడు మెడకు బిగుసుకుని ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయిన సంఘటన కడప నగరంలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మరియపురానికి చెందిన నయోమి(10) అనే బాలిక గురువారం మధ్యాహ్నం స్కూలు నుంచి ఇంటికి వచ్చి ఊయల ఊగుతుండగా ప్రమాదవశాత్తు ఊయల తాడు ఆ బాలిక గొంతుకు బిగుసుకుంది. దాని నుంచి బైట పడేందుకు చిన్నారి చేసిన ప్రయత్నం ఫలించక ఊపిరాడక మృతి చెందింది. […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

జిల్లా కళాకారునికి ‘హంస’ పురస్కారం

మైదుకూరు: కడప జిల్లాకు చెందిన హరికథ, బుర్రకథ, యక్షగాన కళాకారుడు కొండపల్లి వీరభద్రయ్య భాగవతార్‌ను ప్రభుత్వం జానపద కళల విభాగంలో హంస (కళారత్న) పురస్కారానికి ఎంపిక చేసింది. ఉగాది సందర్భంగా తుళ్లూరులో నిర్వహించే ఉగాది సంబరాల్లో వీరభద్రయ్య పురస్కారంతో పాటు రూ.50 వేల నగదు బహుమతిని అందుకోనున్నారు. ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ విభాగాలలో 32 మంది కళాకారులకు హంస పురస్కారాలను, 67 మందికి ఉగాది పురస్కారాలనూ, బాలాంత్రపు రజనీకాంతరావుకు ‘తెలుగు వెలుగు విశిష్ట పురస్కారం’ను […]పూర్తి వివరాలు ...

వార్తలు

ముఖ్యమంత్రి కక్ష గట్టారు

ఉర్దూ విశ్వవిద్యాలయం కోసం కొనసాగుతున్న ఆందోళనలు కడప : కడపలో ఉర్దూ విశ్వవిద్యాలయం ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తూ సీపీఎం కార్యకర్తలు బుధవారం కలెక్టరేట్ ఎదుట ముఖ్యమంత్రి చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించారు. ఆందోళనకారులు దిష్టిబొమ్మతో ప్రదర్శనగా వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ప్రజాస్వామ్య బద్దంగా నిరసన తెలియజేసే హక్కు తమకు ఉందని, దీన్ని అడ్డుకోవడానికి మీరెవరంటూ సీపీఎం నగర కార్యదర్శి ఎన్.రవిశంకర్‌రెడ్డి ప్రశ్నించారు. ఇవేవి పట్టని పోలీసులు దిష్టిబొమ్మను లాగేశారు. […]పూర్తి వివరాలు ...

రాయలసీమ వార్తలు

‘పట్టిసీమ’ పేరుతో సీమను దగా చేస్తున్నారు

కడప: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టిసీమ పేరుతో రాయలసీమను దగాచేస్తున్నారని తక్షణం పట్టిసీమకు స్వస్తి చెప్పాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. ఇదే విషయమై ఈ నెల 20వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేయాలని సమావేశంలో తీర్మానించారు. బుధవారం నగరంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి అధ్యక్షతన ‘పట్టిసీమను పక్కనబెట్టి- రాయలసీమ ప్రాజెక్టులకు నిధులు పెంచి పూర్తిచేయాలి’ అనే అంశంపై అఖిలపక్ష రైతు సంఘాల రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

సంప్రదాయం ప్రకారమే కోదండరాముని పెళ్లి

ఒంటిమిట్ట : కోదండరాముని పెళ్లి ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తామని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్‌వీ ప్రసాద్ తెలిపారు. స్థానిక కోదండ రామాలయాన్ని బుధవారం ఆయన పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఒంటిమిట్ట కోదండ రామాలయ సంప్రదాయాల ప్రకారం అన్ని కార్యక్రమాలు యధావిధిగా కొనసాగుతాయని తెలిపారు. ఆలయంలో కల్యాణం ఎప్పటిలాగానే రాత్రి సమయంలో నిర్వహిస్తామన్నారు. ఒంటిమిట్ట కోదండ రామాలయం, శ్రీశైలం, కాణిపాకం, శ్రీకాళహస్తి, తిరుపతి, తిరుమలను ఒక సర్క్యూట్‌గా ఏర్పాటు చేసి పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరుస్తామన్నారు. […]పూర్తి వివరాలు ...

వ్యాసాలు

కడపజిల్లాపై ఉర్దూ ప్రభావం

క్రీ.శ.17 వ శతాబ్దం నుండి ఈ జిల్లాను మహమ్మదీయులు ఆక్రమించుకున్నారు. అప్పటినుంచి సిద్ధవటం, గండికోట, కడప ప్రాంతాలు ‘మయానా నవాబుల’ అధీనంలో ఉండేవి. వీరి పాలనా ప్రభావంవల్ల కొన్ని గ్రామనామాలు, వాడుక పదాలు ఉర్దూ భాషకు లోనైనాయి. ఇప్పటికీ ఈ జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు వారి పేర్లే నిలిచిపోయాయి. ఉదాహరణకు ఖాజీపేట, ఇబ్రహీంపేట, సాలాబాద్‌. నేక్‌నామ్‌ఖాన్‌ పేరుమీద ఏర్పడిన నేక్‌నామాబాద్‌ ఇప్పటి కడప. ఈ జిల్లాలో ‘మల్లయుద్ధం’ వంటి క్రీడల్ని నేర్చుకునే స్థలాలను ఇప్పటికీ ‘తాలెం కొట్టం’ […]పూర్తి వివరాలు ...

error: