ఆంజనేయస్వామి జయంత్యుత్సవం పురస్కరించుకుని జిల్లాలో ఉన్న ఆంజనేయస్వామి దేవస్థానాల్లో బుధవారం హనుమజ్జంతి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయం నుంచే భక్తులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆలయాల నిర్వాహకులు భక్తులు స్వామిని దర్శించుకునేందుకు అన్నిఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా భక్తులు ఆంజనేయస్వామికి ఇష్టమైన ఆకుపూజలు చేయించి తమ మొక్కుబడులు తీర్చుకుంటారు. ఈసందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి ఉదయం గణపతిపూజ, పుణ్యాహవాచనం, పురుషసూక్త, శ్రీసూక్త, నమక, చమక, మన్యుసూక్తపారాయణము, రుద్రహోమం, పూర్ణాహుతి, శ్రీరామాంజనేయ మూలమంత్ర జపం, అభిషేకం, అర్చన, నివేదనం, మంత్రపుష్పం […]పూర్తి వివరాలు ...
మైదుకూరు: తెదేపా మైదుకూరు నియోజకవర్గ భాద్యులు పుట్టా సుధాకర్‌యాదవ్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యునిగా రాష్ట్రప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జె.ఎస్.వి.ప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు. సుధాకర్ గత ఎన్నికల్లో తెదేపా తరఫున మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. సుధాకర్‌యాదవ్ నియామకంపై జిల్లాకు చెందిన పలువురు తెదేపా నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడికి సుధాకర్ యాదవ్ వియ్యంకుడు. యనమల సిఫార్సు ఆధారంగానే సుధాకర్ తితిదే […]పూర్తి వివరాలు ...
కడప : ప్రవాసాంధ్రుల సంఘం ‘తానా’ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా కడప జిల్లాకు చెందిన వేమన సతీష్ ఎంపికయ్యారు. ప్రస్తుత కార్యవర్గాన్ని ఎన్నుకునేందుకు జరిగిన ఎన్నికలలో సతీష్ 5120 ఓట్ల ఆధిక్యత సాధించి కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సతీష్ ఇప్పటికే తెదేపా తరపున క్రియాశీలకంగా పని చేస్తున్నారు. తానా ఆధ్వర్యంలో చేపట్టే సామాజిక, సాంస్కృతిక సేవా కార్యక్రమాలలో సతీష్ కడప జిల్లాను కూడా భాగం చేస్తారని ఆశిద్దాం. తానా కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన వేమన సతీష్ గారికి అభినందనలు!పూర్తి వివరాలు ...
మొన్న పద్దెనిమిదో తేదీ ఈనాడులో వచ్చిన వార్తాకథనంలో రాష్ట్రంలో పారిశ్రామిక కేంద్రాలుగా అభివృద్ధి చెయ్యడానికి ఎంపిక చేసిన 11 ప్రాంతాల జాబితా ఇచ్చారు: పైడి భీమవరం – శ్రీకాకుళం జిల్లా అచ్యుతాపురం – విశాఖపట్నం జిల్లా నక్కపల్లి – విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం – విశాఖపట్నం జిల్లా కాకినాడ – తూర్పుగోదావరి జిల్లా కంకిపాడు – కృష్ణా జిల్లా గన్నవరం – కృష్ణా జిల్లా జగ్గయ్యపేట – కృష్ణా జిల్లా కొప్పర్తి – కడప జిల్లా ఏర్పేడు-శ్రీకాళహస్తి […]పూర్తి వివరాలు ...
ప్రొద్దుటూరు: సినిమా నటుడు జయప్రకాశ్‌రెడ్డి ప్రదర్శించిన అలెగ్జాండర్ నాటకం ఆహూతులను కడుపుబ్బా నవించింది. స్థానిక జార్జిక్లబ్ సభాభవనంలో ప్రొద్దుటూరు నాటక కళాపరిషత్ 18వ వార్షికోత్సవం ముగింపు సభ ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జయప్రకాశ్‌రెడ్డి అలెగ్జాండర్ నాటకాన్ని ప్రదర్శించినారు. ఇందులో పదవీ విరమణ పొందిన మేజర్ పాత్రను పోషించిన జయప్రకాశ్‌రెడ్డి ఆద్యంతం నాటకాన్ని రక్తి కట్టించారు. కుటుంబ వివాదాల నడుమ ఒంటరి జీవితం గడపాలని నిర్ణయించుకున్న మేజర్ నామజిక రుగ్మతలకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ఒక […]పూర్తి వివరాలు ...
కృష్ణా నీటిని పునః పంపిణీ చేయాల రాజధాని పారిశ్రామిక కారిడార్ కోసమే పట్టిసీమ ఓవైపు సీమ ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం.. మరో వైపు సీమ కోసమే పట్టిసీమ అనడం కుట్ర పట్టిసీమ ఉత్తర్వులో సీమకు నీరిస్తామన్న అంశాన్ని ఎందుకు పొందుపరచలేదో చెప్పాల రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు కడప: రాజధాని ప్రాంతం చుట్టూ ఏర్పాటయ్యే పారిశ్రామిక కారిడార్‌కు నీరందించడం కోసం రాయలసీమ పేరు చెప్పి కోస్తా వారు చేస్తున్న మరో మోసమే పట్టిసీమ అని ఏపీ రైతుసంఘం […]పూర్తి వివరాలు ...
పాత ప్రభలవీడు బద్వేలు తాలూకాలోని ఒక గ్రామము. సగిలేటి ఒడ్డున ఉన్న రాతి మీద ఉన్న మునీశ్వరుని బొమ్మకు దిగువన రాసి ఉన్న శాసనమిది. ఇందులోని విషయాలు అస్పష్టం. శాసనపాఠం: 1. శ్రీ – 0దజియ్య [లు] 2. 0కారితాతమ 3. ల్ల జియ్య [ల||] (Reference: No 16 of 1967, Inscriptions of Andhrapradesh – Cuddapah District Part III)పూర్తి వివరాలు ...
కడప: విపక్ష నేతగా ఎన్నికైన చాన్నాళ్ళ తర్వాత మొదటి సారిగా విపక్షనేత వైఎస్ జగన్ రాయలసీమకు ప్రభుత్వం చేస్తున్న అన్యాయం గురించి మాట్లాడారు.రాజధాని ప్రకటన సమయంలో కానీ, సీమ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు విషయంలో కానీ ప్రభుత్వాన్ని పెద్దగా విమర్శించని జగన్ ప్రాజెక్టుల కోసం చేపట్టిన బస్సుయాత్రలో భాగంగా మూడో రోజు శుక్రవారం కర్నూలు జిల్లాలోని బనుకచర్ల నీటి మళ్ళింపు పథకం పనులను పరిశీలించిన తర్వాత విలేఖరులతో మాట్లాడుతూ సీమ ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని […]పూర్తి వివరాలు ...
ప్రొద్దుటూరు: శ్రీశ్రీ 105వ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 30న (బేస్తవారం) జనవిజ్ఞానవేదిక ప్రొద్దుటూరు శాఖ ఆధ్వర్యంలో సభను నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు డాక్టర్ తవ్వా సురేష్ రెడ్డి ఒక ప్రకటనలో తెలియచేశారు. స్థానిక గీతాశ్రమంలో సాయంత్రం పూట నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో సాహితీవేత్తలు పాల్గొని ప్రసంగించనున్నారు. సాహిత్యాభిమానులూ, ప్రజలూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని సురేష్ పిలుపునిచ్చారు.పూర్తి వివరాలు ...