రాగల్లు యిసిరేటి ఓ రామ చిలుకా – జానపదగీతం

వర్గం: ఇసుర్రాయి పాట

రాగల్లు యిసిరేటి ఓ రామ చిలుకా
మొగుడెందు బోయెనో మొగము కళదప్పే

నాగలోకము బోయి – నాగుడై నిలిచే
దేవలోకము బోయి – దేవుడై నిలిచే

చింతేల నీలమ్మ చెల్లెలున్నాది
చేతి గాజులు పోయె చెల్లెలెవరమ్మ

యేడొద్దు నీలమ్మ తల్లి వున్నాది
తలమింద నీడ బోయె తల్లె యెవరుమ్మా

యేడొద్దు నీలమ్మ తండ్రి వుండాడు
తాళిబొట్టూ బోయె తండ్రెవరమ్మా

యేడొద్దు నీలమ్మ అక్క వుండాది
అయిన సంసారం బోయె అక్కెవరమ్మా

చదవండి :  కసువు చిమ్మే నల్లనాగీ... జానపదగీతం

యేడొద్దు నీలమ్మ బావలున్నారు
బందూ బళగం లేనీ బావలెవరమ్మా

యేడొద్దు నీలమ్మ అన్నలున్నారు
అండా ఆసరా లేని అన్నలెవరమ్మ

యేడొద్దు నీలమ్మ తమ్ములున్నారు
తాడు తలుగూ లేని తమ్ములెవరమ్మ

అందలము పోయింది ఆనాడు మొగుడుంటే
అందలము లెక్కుదును అంతా ఏలుదును

పాడినవారు: బోల్నీని నారాయణమ్మ, రాకట్ల, రాయదుర్గం తాలూకా, అనంతపురం జిల్లా

ఇదీ చదవండి!

శివశివ మూరితివి

శివశివ మూరితివి గణనాతా – భజన పాట

కోలాట కోపుల్లో తాలుపుగట్టి మొదటిది. ‘శివశివ మూరితివి’ అనే ఈ పాట తాలుపుగట్టి కోపుల్లో కడప జిల్లాలో జానపదులు పాడుకునే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: