27న కడప జిల్లా భవిష్యత్ పై  సదస్సు

    27న కడప జిల్లా భవిష్యత్ పై సదస్సు

    నగరంలోని సీపీ బ్రౌన్ లైబ్రరీలో జులై 27వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు ‘కడప జిల్లా భవిష్యత్? ‘ అనే అంశంపై జిల్లా స్థాయి సదస్సు నిర్వహించనున్నామని జనవిజ్ఞానవేదిక (జవివే) రాష్ట్ర గౌరవాధ్యక్షుడు రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం స్థానిక సీపీ బ్రౌన్ లైబ్రరీలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఎమ్మెల్సీలు బాలసుబ్రమణ్యం, డాక్టర్ గేయానంద్‌లు సదస్సుకు ముఖ్యఅతిథులుగా హాజరవుతారన్నారు.

    ఉపన్యాసకులుగా జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ గోపాల్, ఇరిగేషన్ ప్రాజెక్ట్ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ క్రిష్ణయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి నారాయణరెడ్డిలు హాజరవుతారని తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం జరుగుతున్న అభివృద్ధి చర్చలో జిల్లా ఆకాంక్షలను బలంగా వ్యక్తం చేసేందుకే సదస్సు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

    చదవండి :  యోగి వేమన విశ్వవిద్యాలయంపై ప్రభుత్వ వివక్ష

    జిల్లా ప్రజానీకం పెద్దఎత్తున హాజరై జయప్రదం చేయాలని కోరారు. కేంద్రం రాష్ట్రానికి కేటాయించిన 12 కేంద్ర విద్యాసంస్థలలో ఒక్కటి కూడా కడప జిల్లాకు కేటాయించలేదన్నారు. శివరామకృష్ణన్ కూడా జిల్లా సందర్శించలేదన్నారు.

    హంద్రీనీవా, గాలేరు-నగరి పూర్తి, ప్రభుత్వ రంగ సంస్థగా ఉక్కు పరిశ్రమ, ఎయిమ్స్, సెంట్రల్ యూనివర్శిటీ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ లాంటి సంస్థలను కడపలో ఏర్పాటుచేయాలని, అలాగే  జిల్లా అవసరాల మేర రోడ్డు, రైలు సదుపాయాలు పెరగాలని, కడపలో హైకోర్టు ఏర్పాటు చేయాలని తెలిపారు.

    చదవండి :  రాచమల్లు తరువాత రాచపాళెం

    జిల్లాలో వనరులు ఏమిటి, వాటిని ఎలా ఉపయోగించుకోవచ్చు, పెండింగ్‌లో ఉన్న సాగు నీటి ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటి, సిమెంట్ బెరైటీస్ పరిశ్రమలకు అదనంగా జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలేమిటి, జిల్లాలో అత్యంత నిరాదరణకు గురవుతున్న తరగతులు ఎవరు లాంటి అంశాలపై సదస్సులో చర్చ జరుగుతుందన్నారు.

    ఈ కార్యక్రమంలో జవివే జిల్లా సమతా విభాగం కన్వీనర్ సునీత, ఉపాధ్యక్షులు ప్రభాకర్, నగర అధ్యక్షుడు వెంకట్రామరాజు, ప్రధాన కార్యదర్శి నర్సింహారెడ్డి పాల్గొన్నారు.

    చదవండి :  మన పోలీసుకుక్కలకు బంగారు, రజత పతకాలు

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *